pizza
Antham release on 7 July
`అంతం` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 July 2016
Hyderabad

హ‌ను చ‌ర‌ణ్ క్రియేష‌న్స్ తో క‌లిసి చ‌ర‌ణ్ క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తున్న సినిమా అంతం. ర‌ష్మి గౌత‌మ్‌, చర‌ణ్‌దీప్‌, వాసుదేవ్‌, సుద‌ర్శ‌న్ కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు జీఎస్ఎస్‌పీ క‌ల్యాణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌. ఈ సినిమా యూనిట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``మీ ఊహ‌కంద‌నిది జ‌ర‌గ‌బోతోంది అనే క్యాప్ష‌న్‌తో తెర‌కెక్కించాం. చిన్న సినిమాగా తీశాం. ఏడాదిన్న‌ర క్రితం ఈ సినిమా క‌థ‌ను రాసుకున్నాం. ఈ నెల 7న విడుద‌ల చేయ‌బోతున్నాం. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు చాలా బాగా స‌పోర్ట్ చేశారు. రెహ‌మాన్ స్టూడియోలో కొంత‌భాగం రికార్డింగ్ చేశారు. ఫైట్స్ ను స్టంట్ మాస్ట‌ర్ బ‌డ్జెట్‌లో చేశారు. స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ ఇది`` అని తెలిపారు.

వాసుదేవ్ మాట్లాడుతూ ``నెగ‌టివ్ పాత్ర‌లో న‌టించాను. చిన్న సినిమాలు కూడా చాలా బాగా ఉంటాయ‌ని చెప్పేలా ఉంటుందీ సినిమా`` అని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత ల‌క్ష్మీప‌తి మాట్లాడుతూ ``క‌ల్యాణ్ చాలా బాగా క‌ష్ట‌ప‌డి ఈ సినిమాను చేశారు. స్టోరీ న‌చ్చింది. ముఖ్యంగా నాలుగు పాత్ర‌ల మీద ఈ క‌థ న‌డుస్తుంది. రష్మి చాలా బాగా స‌పోర్ట్ చేసింది. గ్లామ‌ర్‌, పెర్ఫార్మెన్స్ ప‌రంగా చాలా బాగా చేసింది`` అని తెలిపారు.

బాపిరాజు మాట్లాడుతూ ``టైటిల్ విన‌గానే న‌చ్చి ఈ సినిమాను చేశాను`` అని తెలిపారు.

ఈ సినిమాకు సంగీతం: కార్తిక్ రోడ్రిగ‌జ్‌, స్టంట్స్: రామ్ సుంక‌ర‌, సౌండ్ ఎఫెక్ట్స్: ఎతిరాజ్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: వి.ల‌క్ష్మీప‌తి రావు, బి.వేణు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved