pizza
Asalu Em Jarigindante press meet
మార్చి నెలాఖరున వస్తున్న ‘అసలు ఏంజరిగిందంటే..’
You are at idlebrain.com > News > Functions
Follow Us


6 March 2020
Hyderabad

ఏబీఆర్ ప్రొడక్షన్స్ మరియు జిఎస్ ఫిలిమ్స్ పతాకంపై అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్న చిత్రం ‘అసలు ఏంజరిగిందంటే’. మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రదాన పాత్రదారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహించగా, అనిల్ బొద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సింగిల్ కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాను తెరకెక్కించాము. ఒక్క క్షణంలో మన జీవితంలో జరిగే మార్పును తెలిపే కథ ఇది. మార్చి నెలాఖరున సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయలనుకుంటున్నాము. ఇప్పటివరకు విడుదల అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నటించిన హీరో మహేంద్రన్ 150 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్టుగా మనందరికీ సుపరిచితమే.. తెలుగులో హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ చూసే సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే ఈ కథాంశం అందరికీ నచ్చి తీరుతుందని నమ్ముతున్నా. మార్చి 9న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించి, నెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సాల్మన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పోస్టర్‌ను తమిళ స్టార్ విజయ్ సేతుపతి ద్వారా, సాంగ్ థమన్ ద్వారా విడుదల చేయించాము. థ్రిల్లర్ కాన్సెప్ట్. కథకు తగ్గ యాక్టర్స్‌ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది..’’ అన్నారు.

హీరో మహేంద్ర మాట్లాడుతూ.. ‘‘తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఏదో ఒక స్పెషల్‌తో హీరోగా పరిచయం అవ్వాలనే ఈ కథను సెలెక్ట్ చేసుకుని చేయడం జరిగింది. రగ్డ్ క్యారెక్టర్ ఉన్న పాత్ర. చెప్పాలంటే రవితేజగారి పాత్రలా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్టుగా ఆదరించారు. ఇప్పుడు హీరోగా ఓ మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న నాపై అదే ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ.. ‘‘సావి అనే మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేస్తున్నా.. మంచి పాత్ర ఇచ్చారు. సాంగ్స్ చాలా నచ్చాయి. మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్న హీరో మహేంద్ర. ఒక ఫ్యామిలీలా కలిసిపోయి వర్క్ చేశాము. అందరూ సినిమా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాము’’ అన్నారు.

హేమంత్, కొమరన్, ఆర్ కె, చరణ్ అర్జున్, కర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్, కొమనన్, హరితేజ, షఫీ, విజయ్ కుమార్, షానీ, ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: చరణ్ అర్జున్, డిఓపి: కర్ణ ప్యారసాని, ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, ఫైట్స్: వాసు, కొరియోగ్రాఫర్: ఆర్ కె(రాధాకృష్ణ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షానీ సాల్మన్, కో డైరెక్టర్: సూర్య దొండపాటి, విఎఫ్‌ఎక్స్: రవి కొమ్ముల. నిర్మాత: అనిల్ బొద్దిరెడ్డి, పీఆర్ఓ: వీరబాబు, డైరెక్టర్: శ్రీనివాస్ బండారి.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved