pizza
Naga Shourya's Aswathama to release on January 31st
నాగశౌర్య అశ్వద్ధామ జనవరి 31న విడుదల !!!
You are at idlebrain.com > News > Functions
Follow Us


11 December 2019
Hyderabad

Naga Shourya's Aswathama has locked January 31st as its release date. The film stars Shourya and Mehreen in the lead roles. Usha Mulupuri is bankrolling Aswathama and it is being presented by IRA creations banner. The film is said to be an action entertainer which caters to all sections of the audience. The makers interacted with media and announced the release date.

The producer, Usha Mulupuri said Aswathama is presently in post-production phase. She added that the film deals with an underlying social issue, which will connect well with all age groups.

Shankar Prasad said Naga Shourya will be seen in a new avatar in Aswathama and the film will be hitting the big screens on January 31st.

The director, Ramana Teja thanked IRA creations for giving him the opportunity to direct Shourya in Aswathama and expressed his confidence on the film.

Co-producer Bujji said Aswathama shaped up really well and thanked the technical team for their support. "Anbu Aribu, who composed the fight sequences for KGF worked on our project and that helped us a lot.", He said.

నాగశౌర్య అశ్వద్ధామ జనవరి 31న విడుదల !!!

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఉష మూల్పూరి మాట్లాడుతూ....
అందరికి నమస్కారం. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3 అశ్వద్ధామ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉండబోతొంది. నాగ శౌర్య మంచి కథ రాశాడు, దాన్ని డైరెక్టర్ తెరమీద బాగా చూపించాడు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.

శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ...
అశ్వద్ధామ షూటింగ్ పూర్తి చేసుకొని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త నాగ శౌర్య ను ఈ సినిమాతో చూస్తారు. త్వరలో ఈ సినిమకు సంభందించిన మరిన్ని విశేషాలు తెలుపుతామని అన్నారు.

డైరెక్టర్ రమణ తేజ మాట్లాడుతూ....
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్ వారికి థాంక్స్, శౌర్య నన్ను నమ్ము ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యమని చెప్పారు. జనవరి 31న వస్తోన్న మా సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి ప్రేత్యేక ధన్యవాదాలు. కెమెరామెన్

కో ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ....
మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అనుకున్న టైమ్ లో సినిమాను పూర్తి చేశాము. మేము అనుకున్న దానికంటే ఔట్ ఫుట్ బాగా వచ్చింది. మా సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసారు.

కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేశారు సినిమాకు అది పెద్ద అసెట్ కానుందని తెలిపారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved