ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ ప్రథాన తారాగణంగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'బాహుబలి2`. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ - ``బాహుబలి జర్నీ 2012లో మొదలైంది. ఐదేళ్ళుగా ఈ జర్నీ సాగింది. పార్ట్ 1 తర్వాత ఈ సినిమాకు పార్ట్‌నర్స్‌ను తీసుకున్నాం. గ్రాఫిక్స్ ఇండియా వాళ్లు మొబిగెస్చర్, ఒప్పో ఇలా అందరూ ఈ సినిమాలో పార్ట్ అయ్యారు. ఆనంద్ నీలకంఠన్ పుస్తకాలు రాశారు. గేమ్ ఒకటి రూపొందించాం. సినిమాను వర్చువల్ రియాల్టీలో చేశాం. ఇవన్నీ రాజమౌళి చేతుల
మీదుగా జరగడం ఆనందంగా ఉంది`` అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ - ``మన చుట్టూ వి.ఆర్.టెక్నాలజీ ఉన్నా కానీ మాకు పెద్దగా తెలియలేదు. స్టోరీతో పాటు, 30- 40 నిమిషాల పట్టే గ్రాఫిక్స్ ను వి.ఆర్.గ్రాఫిక్స్‌లో సెకనులో పదిహేను వంతులో క్రియేట్ చేశాం. ప్రేక్షకుల ఈ టెక్నాలజీని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభాస్, రానా, అనుష్క తదితరులు పాల్గొన్నారు.