19 July 2016
Hyderabad
‘అమ్మా నీకు వందనం', 'ప్రణయ వీధుల్లో' చిత్రాల ద్వారా విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ జైని తాజాగా 'క్యాంపస్ అంపశయ్య' పేరుతో ఓ చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాకర్ జైని కూడా ప్రధాన పాత్ర చేశారు. శ్యామ్ కుమార్, పావని హీరో హీరోయిన్ గా నటించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూలై 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ ``1969లో నవీన్ రాసిన 'అంపశయ్య' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం . ఓ విద్యార్థి జీవితంలో ఒకరోజులో ఏం జరిగింది అనేదే కథ. అంపశయ్య నవలను సినిమా తెరకెక్కించాలని చాలా మంది ప్రయత్నించి వదిలేశారు. కానీ కొత్త కథతో, ఘటనలతో సాగేలా ప్రముఖుల సలహాలను తీసుకుని ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమాలో శ్యామ్ కుమార్, పావనిలు చక్కని అభినయాన్ని కనపరిచారు. వ్యాపారాత్మక ధోరణిలో కాకుండా సినిమాను ఆర్ట్ ఫిలింలా చేశాం. అలాగే 50 ఏళ్ళలో ఉస్మానియా క్యాంపస్‌లో ఎవరూ షూటింగ్ చేయలేదు. ఈ సినిమా కోసం మేం పర్మిషన్ తెచ్చుకుని చిత్రీకరణ చేశాం. తెలుగులో జూలై 29న సినిమా విడుదలవుతుండగా, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
Pavani Glam gallery from the event |
|
|
|
హీరో శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ``ఇది నా తొలి తెలుగు చిత్రం. కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రం`` అన్నారు.
ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ``ఇదొక ప్రయోగాత్మక చిత్రం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం`` అన్నారు.
శ్యామ్ కుమార్, పావని, మోనికా థాంప్సన్, శరత్, యోగి దివాన్, రాధాకృష్ణ, వాల్మీకి, స్వాతినాయుడు యింకా తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు చాలా మంది నటించారు. ఒక ప్రత్యేక పాత్రలో ఆకెళ్ళ రాఘవేంద్ర నటించారు. కెమెరా రవికుమార్ నీర్ల, కోడైరెక్టర్ నవీన్, DI రాజన్న, ఎడిటింగ్ సిందం గోపి,క్రియేటివ్ హెడ్ తిరుపతి రెడ్డి కోట.