pizza
Desham lo Dongalu Paddaru release on 4 October
అక్టోబర్ 4న "దేశంలో దొంగలు పడ్డారు"
You are at idlebrain.com > News > Functions
Follow Us


01 October 2018
Hyderabad

అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు`. సారా క్రియేషన్స్ ప‌తాకంపై రూపొందింది. గౌత‌మ్ రాజ్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ర‌మా గౌత‌మ్ నిర్మాత‌. అక్టోబర్ 4న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్ లొ చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

అలీ మాట్లాడుతూ.. "దేశంలొ దొంగలు పడ్డారు " సినిమా చూశాను. నచ్చింది. దర్శకుడు గౌతమ్ వద్ద టాలెంట్ ఉంది. ఖయ్యూమ్ తో చాలా వైవిధ్యమైన సినిమా చేశాడు. టెక్నికల్ గా దిబెస్ట్ మూవీ ని ఈ టీమ్ తీసుకువచ్చారు. చిరంజీవి గారు ట్రైలర్ లాంఛ్ చేయటం మా సినిమాకు చాలా కలిసి వచ్చింది. ఆయనకు మా ధన్యవాదాలు. సినిమాలొ మ్యాటర్ ఉంది. అక్టోబర్ 4 న ఈ సినిమా చూడండి. నచ్చితే ఈ టీమ్ ను ఆదరించాలని ఆశిస్తున్నానన్నారు.

పృధ్వీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నెగిటివ్ రోల్ చేశాను. నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాను. సినిమా చాలా బాగా వచ్చింది. అక్టోబర్ 4న చూడండి. నచ్చుతుందన్నారు.

ఖ‌య్యుమ్ మాట్లాడుతూ.‌.. నేను చాలా సినిమాలు చేశాను. రిలీజ్ కు ముందు నుంచే దేశంలొ దొంగలు పడ్డారు చిత్రానికి పాజిటివ్ బజ్ వచ్చింది. చిరంజీవి గారు వల్ల ,మీడియా వల్ల మా సినిమాకు హైప్ వచ్చింది. టీమ్ అందరం కష్టపడ్డాం. అక్టోబర్ 4న సినిమా చూడండన్నారు.

ద‌ర్శ‌కుడు గౌతమ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మీడియా మా సినిమాకు చేసిన ప్రమోషన్ అద్బుతం.‌అలీ గారి వల్లే ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ వరకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా రియలిస్టిక్ గా చేశాము. చిరంజీవి గారు మా ట్రైలర్ విడుదల చెయటం వల్ల హైప్ వచ్చింది.షానీ ఈ సినిమాలొ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. తను జార్జియా లొ సైరా చిత్రీకరణలొ ఉన్నందున రాలేకపొయాడన్నారు.

సహ నిర్మాత, సెలెబ్ కనెక్ట్ అధినేత సుమన్ మాట్లాడుతూ .. దేశంలొ దొంగలు పడ్డారు వైవిధ్యమైన కమర్షియల్ సినిమా. అందరికి నచ్చుతుందన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరొయిన్ తనిష్క్ రాజన్, డిఓపి శేఖర్, లోహిత్, చరణ్ ,యోగి, త్రినాధ్,గగన్ తదితరులు పాల్గొన్నారు.

గిరిధ‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్ రాఘ‌వ‌, వినోద్‌, త‌డివేలు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: శేఖ‌ర్ గంగ‌న‌మోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్‌: మ‌ధు.జి.రెడ్డి, క‌ళ‌: మ‌ధు రెబ్బా, సమర్పణ: అలీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: సాయికుమార్ పాలకూరి , స‌హ నిర్మాత‌లు: సంతోష్ డొంకాడ‌, సెలెబ్ కనెక్ట్, పి.ఆర్‌.ఓ: సాయి సతీష్.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved