pizza
Sri Sri Sri Swaroopanandendra Saraswati Mahaswamy at Film Nagar Daiva Sannidhanam
ఫిలిం నగర్ దైవసన్నిధానాన్ని సందర్శించిన విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానంద సరస్వతి , శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి
You are at idlebrain.com > News > Functions
Follow Us


27 June 2019
Hyderabad

శ్రీ విశాఖ శారదాపీఠంశ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి ఆజ్ఞతో యావత్ భారత దేశ ఉత్తరాధికారిగా భాద్యతలు స్వీకరించారు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి. గురువారం నాడు ఫిలిం నగర్ దైవసన్నిధానాన్ని శ్రీ స్వరూపానంద సరస్వతి , శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి సందర్శించి పూజా కార్యక్రామాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు, కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, శ్రీమతి సురేఖ, ఎస్. గోపాల్ రెడ్డి, దర్శకుడు బి . గోపాల్ , హీరో శ్రీకాంత్, ఊహ, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు నిర్మల, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

ఫిలిం నగర్ దైవసన్నిధానం చైర్మన్ డా. మోహన్ బాబు మాట్లాడుతూ - " రెండు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ మహోన్నత స్వామి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి వారు. నేను రజినీకాంత్ గారు ఒక సారి వారి పీఠానికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజమైన ప్రశాంతత కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఒక్కసారి వైజాగ్ లోని శ్రీ శ్రీ శ్రీ శారదా పీఠం ని దర్శించుకోవాల్సిందిగా మనవి. అలాంటి బృహత్తర రూపం గల శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరాధిఖారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి భాద్యతలు ఇవ్వడం మంచి పరిణామం. వారికి దాదాపు భారతదేశం లో 108 మఠాలు ఉన్నాయి. వారి ఆశీస్సులు ఫిలిం నగర్ దైవసన్నిదానానికి ఎల్లవేళలా ఉంటాయి" అన్నారు.

శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ - " ఈరోజు ఫిలిం నగర్ దైవసన్నిధానంలో సినిమా వారు ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇచ్చే మోహన్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాలకు ఒక పరిచయ వేదికగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. విశాఖ శ్రీ శారదా పీఠం అంటే ధర్మ ప్రతిష్టాపన కోసం 21 సంవత్సరాలుగా అవిశ్రామంగా కృషి చేస్తుంది. మా పీఠానికి శ్రీ సుబ్బిరామి రెడ్డి గారు ఎంతో చేయూత నిస్తున్నారు. ఆయన నేను లేకుండా ఈ కార్యక్రమం చేయడానికి ఇష్టపడరు. నా తరువాత ఆది శంకరాచార్యుల దృక్పథాన్ని నిలబెట్టడానికి 5 వ యావత్ భారత దేశానికి ఉత్తరాధికారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గారిని నియమించడం జరిగింది. ఫిలిం నగర్ దైవసన్నిధానం నుండి విస్తృతమైన ధర్మ ప్రచారానికి నాంది ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది' అన్నారు.

కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ - " ఫిలిం నగర్ దైవసన్నిధానం ఎల్లప్పుడూ కలకలడానికి కారణం భారత దేశంలో అతి తక్కువ సమయంలోనే అన్ని చోట్ల పీఠాలను నెలకొల్పిన శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు. వారి జీవిత లక్ష్యం ప్రతి ఒక్కరికి ధార్మిక జీవితాన్ని ప్రసాదించడం. అలాగే స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహా జ్ఞాని. ఆయన నాకు చాలా కాలం గా పరిచయం. నేను గత 27 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేసిన వారు, వారు ఆశీస్సులు నాతోనే ఉంటాయి" అన్నారు.

శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ - " మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ళక్రితం ఇక్కడే గణపతి ప్రదక్షిణాలు చేసి స్వామి వారి దగ్గర పాఠాలు నేర్చుకునే వాడిని. నాకు ఈ ఫిలిం నగర్ దైవసన్నిధానం తో చాలా అభినవభావసంభందం ఉంది. రెండు సంవత్సరాలక్రితం మా గురువు గారు ఉత్తరాఖండ్ లో తపస్సు చేయమని చెప్పారు. చాలా క్లిష్ట మైన ప్రదేశం. అక్కడ జవాన్ లు మాత్రమే ఉండగలరు. అక్కడకూడా తెలుగు వారు వచ్చి ఫిలిం షూటింగ్ లు జరుపుతున్నారు. ప్రేక్షకులకు రెండు మూడు గంటలు ఆనందంఇవ్వడం కోసం అంత కస్టపడి సినిమాలు తీస్తారా? అని ఆశ్చర్యానికి లోనయ్యాను. అలా సైనికులు ఉండగలిగే ప్రదేశాలలో షూటింగ్ చేయడం సినిమా వారికే చెల్లింది" అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved