pizza
Gaali Sampath press meet
మార్చి11న విడుదలవుతున్న`గాలి సంపత్ `తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది - సూప‌ర్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు.
You are at idlebrain.com > News > Functions
Follow Us


21 February -2021
Hyderabad

" 'Gaali Sampath' Which Is Releasing On March 11th Will Definitely Become A SuperHit" - Super Successful Producer Dil Raju

'Gaali Sampath' is made under the Presentation of Blockbuster Director Anil Ravipudi. It got special craze with Director Anil Ravipudi acting as the Presenter along with providing Screenplay and Direction Supervision. Anil Ravipudi has delivered 5 consecutive blockbusters. 'Gaali Sampath' under his direction supervision is all set to become another Blockbuster. ‘Gaali Sampath’ is Produced by his Co-Director, Writer, Friend S. Krishna under his newly launched ImageSpark Entertainment along with Saahu Garapati, Harish Peddi’s Shine Screens banner. This film features Young Hero Sree Vishnu, Lovely Singh as Hero and Heroines while Natakireeti Dr. RajendraPrasad will be seen in the titular role as ‘Gaali Sampath’. Anish is Directing this film. This film is releasing worldwide on March 11th for Maha Shivaratri. Team interacted with media in a press meet at Prasad Labs, Hyderabad.

Producer S. Krishna said, " I have worked with Anil as a writer and in direction department for all of his films. For the first time I became a Producer with 'Gaali Sampath'. Anil is a main Piller in my life and he is my strength. This film started as a small movie and with the entry of Anil Ravipudi it turned into a big film which will impress everyone. My friends, Producers of Shine Screens supported me a lot. Director Anish has made this film beautifully. This film has Anil Ravipudi mark entertainment along with very good emotion. Dil Raju Garu and Sirish Garu have been supporting me from the beginning. Thanks to them. Thanks to Harish Garu and Sahu Garu for supporting me during the production of this film."

Shine Screens banner Producer Sahu Garapati said, " We loved the story narrated by S. Krishna and became a part of this movie's production. This film started as a small movie and turns big with the arrival of Anil Ravipudi. The film came out superbly. Dil Raju Garu supported a lot. 'Gaali Sampath' is releasing in theatres on March 11th. I hope you all will love this film and encourage it."

Director Anish said, " The shoot of 'Gaali Sampath' is completed recently. Currently post-production works are going on. The film is releasing on March 11th for Maha Shivaratri. Anil Ravipudi Garu gave his full support as a mentor. This film has very good emotions too along with ample entertainment. Rajendra Prasad Garu, Sai Kumar Garu, Sree Vishnu, Lovely Singh... everyone gave their best. Especially Rajendra Prasad Garu lived in the role of 'Gaali Sampath'. The audience will be thrilled while watching the film on March 11th. Thanks to Anil Garu, Sai Krishna Garu, Harish Peddi gadu, Sahu Garapati Garu for this opportunity. Special thanks to Dil Raju Garu who came here today to support us."

Super Successful Producer Dil Raju said, " It's very good to hear that Anil Ravipudi Presents Gaali Sampath. You all know about the journey of Anil from Pataas to Sarileru Neekevvaru. Any successful director starts with small films and gradually moves up to direct big films. But, they forget about small films. When we look back, Dasari Narayana Rao Garu, Raghavendra Rao Garu, Kodi Ramakrishna Garu used to do small films too along with big films. That's why they crossed 100 films mark. Current trend is Pan India Films. At this point big directors are not making any small films. To change that I told Anil to associate with small films along with big films. Anil stood as a backbone to this film. 'Gaali Sampath' which is releasing on March 11th will definitely become a SuperHit. A big director should make small films along with big films. To grab the attention of audience, small films should have an extra force. Every big director has their own mark. When it is added to a small film, it will turn into a big film. I believe 'Gaali Sampath' too will become a big film on March 11th. Director Anish has a very good comedy tinge. I laughed a lot watching his 'Ala Ela' film. I watched some episodes in this film and they are very entertaining. Climax is very emotional. Rajendra Prasad Garu and Sree Vishnu together aced during entertainment and emotional scenes. The audience will witness Anil Ravipudi, Anish Krishna mark entertainment and very good emotions too. Shine Screens Producers Sahu, Harish are very close to me. All the best to them, to Sai Krishna who is debuting as a Producer and to Anil Ravipudi."

Blockbuster Director Anil Ravipudi said, " S. Krishna played a crucial role during story sittings of my every film. When he told me about the story he wrote and he wanted to turn into producer with that story, I told him that I will support him. That's how we packed the story with all elements the audience expect from this film. Shine Screen Producers came forward to stand as a backbone for this film. 'Gaali Sampath' is the first film is S. Krishna's Imagespark Entertainment banner. Initially I wanted to set the story for this film. But, the story keeps on haunting me. We don't want to miss the magic in that story. So, we all worked as a team together. Coming to the film, the title 'Gaali Sampath' gives a lot of impressions. In this film Rajendra Prasad Garu loses his voice in an accident and only air comes out whenever he talks. That is the main concept of this film. You all.know about Kiliki language in 'Baahubali'. Similarly Rajendra Prasad Garu speaks a funny language in this film, 'FiFi Language'. It will entertain you all very much. Along with ample entertainment this film also has beautiful emotion between father and son. The second half is about how 'Gaali Sampath' who doesn't have voice comes out when he fell into a 30 feet pit. This film has many such thrilling points. I gave my contribution to this film to make this magical scenes more beautiful. You all will enjoy this film more than you expect. Post lockdown releases are generating superb revenues in theatres. I wish this film too will become a big Hit which is releasing on March 11th. Dil Raju Garu and Sirish Garu supported me like a family in my journey. I am very happy that they are extending their support for this film too."

Natakireeti RajendraPrasad, Sree Vishnu, Lovely Singh, Tanikella Bharani, Sathya, Raghu Babu, Sreekanth Aiyyangar, Mirchi Kiran, Surendra Reddy, Gagan, Memes Madhu, Aneesh Kuruvilla, Rajitha, Karate Kalyani, Sai Srinivas, Rupalakshmi, and others are the principal cast.

Story: S. Krishna
Script Assistance: Adinarayana
Cinematography: Sai Sri Ram
Music: Achu Rajamani
Art: AS Prakash
Editor: Thammiraju
Executive Producer: Nagamohan Babu .M
Dialogues: Mirchi Kiran
Lyrics: Ramajogayya Sastry
Fights: Nabha
Choreography: Sekhar, Bhanu
Make-up: Ranjith
Costumes: Vasu
Chief Co-director: Sathyam Bellamkonda
Production: Shine Screens, ImageSpark Entertainment
Producer: S. Krishna
Screenplay, Presented & Direction Supervision by: Anil Ravipudi
Director: Anish


బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం 'గాలి సంప‌త్`. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో పాటు స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ వ‌హిస్తుండ‌డంతో సినిమాకి స్పెష‌ల్ క్రేజ్ వ‌చ్చింది. వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది. అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ `గాలి సంప‌త్‌`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైదారాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో...

నా లైఫ్‌లో అనిల్ ఒక మెయిన్ పిల్లర్.
చిత్ర నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ - ``ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి దగ్గర నేను రచయితగా, దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఇప్పుడు గాలి సంప‌త్ సినిమాతో ఫస్ట్ టైం నిర్మాతగా పరిచయ మ‌వుతున్నాను. నా లైఫ్‌లో అనిల్ ఒక మెయిన్ పిల్లర్. ఆయనే నా స్ట్రెంత్. చిన్న కథగా మొదలైన ఈ సినిమా అనిల్ రావిపూడి రాకతో అందర్నీ అలరించే ఒక పెద్ద సినిమాగా తయారయింది. నా స్నేహితులు షైన్ స్క్రీన్స్ నిర్మాతలు చాలా సపోర్ట్ సపోర్ట్ చేశారు. దర్శకుడు అనీష్ చాలా చక్కగా తెరకెక్కించాడు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు నాకు మొదటినుండి సపోర్ట్ అందిస్తూ వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా నిర్మాణంలో నాకు సపోర్ట్ చేసిన హ‌రీష్ గారికి, సాహు గారికి నా ధన్యవాదాలు`` అన్నారు.

సినిమా బ్రహ్మాండంగా వచ్చింది.
షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ - ``ఎస్ క్రిష్ణ చెప్పిన స్టోరీ బాగా నచ్చి ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ‌డం జ‌రిగింది. చిన్న సినిమాగా మొద‌లై అనిల్ రావిపూడి రాక‌తో ఒక పెద్ద సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. దిల్ రాజు గారు ఎంతో సపోర్ట్ చేశారు. మార్చి 11న థియేటర్లలో రిలీజ్ అవుతుంది మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.

ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు
చిత్ర దర్శకుడు అనీష్ మాట్లాడుతూ - "గాలి సంపత్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మార్చి11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి గారు ఒక మెంటర్‌గా మాకు ఫుల్‌ సపోర్ట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు సినిమాలో మంచి ఎమోష‌న్స్ కూడా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ గారు గాలి సంపత్ పాత్రకు ప్రాణం పోశారు. రేపు మార్చి 11న ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు. ఈ అవ‌కాశం ఇచ్చిన అనిల్ గారికి సాయి కృష్ణ గారికి, హరీష్ పెద్ది, సాహు గారపాటి గారికి ధన్యవాదాలు. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్క‌డికి వచ్చిన దిల్ రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు" అన్నారు.

ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్స్‌ని జోడించారు
సూప‌ర్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు మాట్లాడుతూ - ``అనిల్ రావిపూడి ప్రెజెంట్స్ గాలి సంపత్. చాలా కొత్తగా ఉంది. పటాస్ నుంచి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ జర్నీ మీ అందరికీ తెలుసు. ఏ దర్శకుడైనా ఒక చిన్న సినిమాతో మొదలై సక్సెస్ సాధిస్తూ పెద్ద చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంటారు.
కాని ఈ సమయంలో చిన్న సినిమాలను మర్చిపోతారు. మనం చరిత్ర చూసుకుంటే దాసరి నారాయణ రావు గారు, రాఘవేంద్ర రావు గారు, కోడి రామకృష్ణ గారు అందరూ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీశారు. అందుకే వారు 100 సినిమాల మార్క్‌ను ఈజీగా దాట‌గ‌లిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఈ సమయంలో చిన్న సినిమాల వైపు పెద్ద దర్శకులు ఎవరు చూడడం లేదు. అది మారాలనే అనిల్ కి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాకి కూడా నీ సహాయ సహకారాలు అందించ‌మ‌ని చెప్పాను. అలా అనిల్ ఈ సినిమాను బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. మార్చి 11న విడుదల అవుతున్న గాలి సంపత్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఒక పెద్ద దర్శకుడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీయాలి. ఎందుకంటే చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావాలంటే ఆ సినిమాకు ఏదో ఒక ఎక్స్ ట్రా ఫోర్స్ ఉండాలి. ప్రతి పెద్ద డైరెక్టర్ కి ఒక మార్క్‌ ఉంటుంది అది యాడ్ అయినప్పుడు చిన్న సినిమాకూడా పెద్ద సినిమా అవుతుంది. అదేవిధంగా గాలి సంపత్ కూడా రేపు మార్చి 11న ఒక పెద్ద సినిమా అవుతుంది అని న‌మ్ముతున్నాను. దర్శకుడు అనీష్ దగ్గర కూడా ఒక మంచి కామెడీ టింజ్ ఉంది. ఆయన దర్శకత్వం వహించిన అలా ఎలా? సినిమా చూస్తున్నప్పుడు నేను కడుపుబ్బ నవ్వాను. రీసెంట్‌గా ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ చూశాను చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్, ఎమోషన్‌ని చాలా ఎక్స్ట్రార్డినరీగా పండించారు. థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు కావాల్సిన అనిల్ రావిపూడి, అనీష్ కృష్ణ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్స్‌ని కూడా జోడించారు.షైన్‌ స్క్రీన్స్ నిర్మాతలు సాహూ, హరీష్ నాకు సన్నిహితులు. వారికి, ప్రొడ్యూసర్ గా పరిచయం అవుతున్న సాయి కృష్ణకు, అనిల్ రావిపూడికి ఆల్ ది బెస్ట్" అన్నారు.

ఆ మ్యాజిక్ మిస్ అవ‌కూడ‌ద‌నే నా కాంట్రిబ్యూషన్.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - "ఎస్ క్రిష్ణ నా ప్రతి సినిమాలో స్టోరీ సిట్టింగ్స్ లో చాలా కీలక పాత్ర పోషించేవాడు. ఫస్ట్ టైం ఒక కథ రాసి ఆ కథతో నిర్మాతగా మారాలని అనుకుంటున్నాను అని చెప్పిన‌ప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. అలా ఆ కథలో థియేటర్లో ప్రేక్షకుల‌కు కావాల్సిన అన్ని హంగులు సమకూర్చడం జరిగింది. అలాగే ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిల‌బ‌డ‌డానికిషైన్ స్క్రీన్స్ నిర్మాత‌లు ముందుకు వచ్చారు. ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఎస్ క్రిష్ణ‌ నిర్మాతగా మొదటి సినిమా గాలి సంప‌త్‌. మొదట ఈ సినిమాకు కథ సెట్ చేసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఆ కథ నన్ను హాంట్ చేస్తూనే ఉంది. ఆ కథలో ఉన్న మ్యాజిక్ మిస్ కాకూడ‌ద‌నే మేం అంద‌రం క‌లిసి ఒక టీమ్‌గా ముందుకెళ్ల‌డం జ‌రిగింది. సినిమా విషయానికి వస్తే గాలి సంపత్ అనగానే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి గొంతు కి ప్రమాదం జరిగి అతని గొంతులో నుంచి మాట‌ బయటికి రాదు కేవలం గాలి మాత్రమే వస్తుంది. అదే ఈ సినిమా కాన్సెప్ట్. మీరు బాహుబలి సినిమా తీసుకుంటే అందులో కిలికి భాష అని ఉంటుంది. అది మనకు అర్థం కాదు అలాగే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చిలిపి భాష మాట్లాడటం జరిగింది. అదే ఫి..ఫి.. ఫీ లాంగ్వేజ్. అది మీ అందర్నీ ఎంతో ఎంట‌ర్‌టైన్ చేయబోతుంది. బోలెడంత ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఒక బ్యూటిఫుల్ ఎమోష‌న్ కూడా ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా ఒక 30 అడుగుల లోతు నుయ్యిలో మాటలు రాని గాలి సంపత్ ప‌డిన‌ప్పుడు తను ఎలా బయటపడ్డాడు అనేది సెంక‌డాఫ్‌. ఇలాంటి చాలా థ్రిల్లింగ్ పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మ్యాజికల్ సన్నివేశాలు అద్భుతంగా రావాలనే ఈ సినిమాకు నా కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్‌గా ఈ సినిమాను మీరు అనుకున్న దాని కన్నా ఇంకా బెటర్ గా ఎంజాయ్ చేస్తారు. లాక్‌డౌన్ తర్వాత థియేటర్ లో విడుదలైన సినిమాలు అద్భుతమైన రెవెన్యూలు సాధిస్తున్నాయి. మార్చి11న ఈ సినిమా కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు, శిరీష్‌ గారు నా జర్నీ లో ఒక ఫ్యామిలీ లాగా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా కూడా వారి సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,
క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,
ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,
సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,
సంగీతం: అచ్చురాజ‌మ‌ణి,
ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,
మాట‌లు: మిర్చికిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి,
ఫైట్స్‌: న‌భ‌,
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను,
మేక‌ప్‌: ర‌ంజిత్‌,
క్యాస్ట్యూమ్స్‌: వాసు,
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌.
నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్,
నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,
స్క్రీన్ ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,
ద‌ర్శ‌క‌త్వం: అనీష్.

 


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved