pizza
Hippi press meet
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 April 2019
Hyderabad

'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్సీ హీరోహీరోయిన్లుగా కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'హిప్పీ'. తెలుగు, తమిళ్‌ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైంది. టీజర్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది.

హీరో కార్తికేయ మాట్లాడుతూ - ''ఆర్‌ఎక్స్‌ 100' విజయం తర్వాత చాలామంది ఫోన్‌ చేసి అప్రిషియేట్‌ చేశారు. అయితే ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ఇప్పుడు 'హిప్పీ' మూవీ కూడా అంతకన్నా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది. 'ఆర్‌ఎక్స్‌100' విడుదలైన తర్వాత చాలా స్క్రిప్ట్‌లు విన్నాను. అందరికీ నచ్చేవిధంగా ఉండి నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి మంచి స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో 'నువ్వు నేను ప్రేమ' సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన టి.ఎన్‌. కృష్ణగారు నాకు ఫోన్‌ చేసి నన్ను కలవాలి అన్నారు. అయితే గౌతమ్‌ మీనన్‌గారి దగ్గర పని చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనలాగే మంచి ప్రేమకథా స్టోరి ఉంటుందని అనుకున్నాను. కానీ నేరేషన్‌ విన్నాక ఆయన పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌ అని అర్థమైంది. ఈ సినిమా రియలిస్టిక్‌ స్టోరితో పాటు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌ ఉంటుంది. అన్ని కమర్షియల్‌ అంశాలను పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్‌ చేశారు. 'కబాలి' సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కలైపులి ఎస్‌. థానుగారు ఈ సినిమాని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఆయనతో కలిసి వర్క్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్‌ రోల్‌ ఉంది. ఆ క్యారెక్టర్‌ కోసం ఎవరిని తీసుకుందాం అనుకున్న సమయంలో జె.డి. చక్రవర్తిని ఓకే చేయడం జరిగింది. స్టోరి విన్న వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్‌. అలాగే మ్యూజిక్‌ చాలా బాగుంది. ఆర్‌డి రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకి మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా విజయంపై హండ్రెడ్‌ పర్సెంట్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌డి రాజశేఖర్‌ మాట్లాడుతూ - ''నా ఫ్రెండ్స్‌ చాలామంది ఇప్పటికీ ఇష్టమైన సినిమా ఏది అని అడిగితే... 'నువ్వు నేను ప్రేమ' అని చెప్తారు. అయితే ఈ సినిమా విడుదలయ్యాక 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సువారిని అడిగితే 'హిప్పీ' మూవీ అని చెప్తారు'' అన్నారు.

పాటల రచయిత అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ - ''సరదాగా ఉండే సున్నితమైన అంశాలతో తెరకెక్కిన ప్రేమకథ ఇది. సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. 'ఇంకేం కావాలె' పాట తర్వాత ఈ సినిమాలో 'ఎవరిలో' పాట అంత మంచి పేరు వస్తుంది. అదే కాకుండా ఇంకా మూడు పాటలు కూడా సాహిత్యం అద్భుతంగా కుదిరింది'' అన్నారు.

నటుడు జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ - ''ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్‌ కలైపులి థానుగారి గురించి మాట్లాడాలి. ఆయన బిజీయెస్ట్‌ అండ్‌ బిగ్గెస్ట్‌ ప్రొడ్యూసర్‌. గ్రేటెస్ట్‌ హ్యూమన్‌ బీయింగ్‌. ఆర్‌డి రాజశేఖర్‌గారు ఈ సినిమాకి బ్యూటిఫుల్‌ విజువల్స్‌ అందించారు. దిగంగన అందంతో పాటు చాలా తెలివైన నటి. ఈ సినిమాకు డైలాగులు తెలుగులో నేర్చుకొని డబ్బింగ్‌ చెప్పింది. శ్రీరామ్‌గారు మంచి లిరిక్స్‌ ఇచ్చారు. హీరో కార్తికేయ 'ఆర్‌ఎక్స్‌100' నుంచి చూస్తున్నాను. కార్తికేయ రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నారు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతారు'' అన్నారు.

దర్శకుడు టిఎన్‌. కృష్ణ మాట్లాడుతూ - ''ఇది చాలా సింపుల్‌ స్టోరి. మన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ జీవితంలో జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఈ సినిమాను తమిళ్‌లో డైరెక్ట్‌ చేద్దామనుకున్న సమయంలో కార్తికేయ నటించిన 'ఆర్‌ఎక్స్‌100' తమిళ్‌ రీమేక్‌ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు హీరో కార్తికేయను చూసి ఈ స్టోరి తనకు యాప్ట్‌ అవుతుందని అనడంతో థానుగారు ఒప్పుకొని కార్తికేయకి స్టోరి చెప్పడం జరిగింది. కార్తికేయకు హీరోయిన్‌ కోసం చాలామందిని ఆడిషన్స్‌ చేసి దిగంగనని ఎంపిక చేసి వాళ్ళిద్దరికీ టెస్ట్‌షూట్‌ చేశాం. జె.డి. చక్రవర్తిది సినిమాలో క్రూషియల్‌ రోల్‌. కానీ చాలా లవబుల్‌గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా తనకి మంచి పేరు వస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌డి రాజశేఖర్‌ 'చెలి' సినిమా నుండి నన్ను సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. అందరి సహకారంతో 48 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేశాం. తెలుగులో మంచి కమెడియన్‌గా పేరున్న వెన్నెల కిషోర్‌ ఈ సినిమాలో మంచి పాత్ర పోషించారు. త్వరలోనే సినిమా విడుదలవుతుంది. అందరూ చూడండి'' అన్నారు.

హీరోయిన్‌ దిగంగన సూర్యవన్సీ మాట్లాడుతూ - ''జీవితంలో మనకి తెలియకుండానే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాలో రాజశేఖర్‌గారు నన్ను చాలా అందంగా చూపించారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత కలైపులి ఎస్‌. థాను మాట్లాడుతూ - ''డి.వి.ఎస్‌. రాజు, దాసరి నారాయణరావు, డి. రామానాయుడులాంటి లెజెండరీ పర్సన్స్‌ ఉన్న తెలుగు ఇండస్ట్రీ స్టేజిమీద నుండి వారిని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఒకసారి కార్తికేయ నా ఆఫీస్‌కి వచ్చి నేను 'ఆర్‌ఎక్స్‌ 100' హీరో కార్తికేయ అని పరిచయం చేసుకున్నారు. మీ సినిమాలో హీరోగా చేస్తున్నా అని చెప్పారు. 'ఆర్‌ఎక్స్‌ 100' హిట్‌ అయ్యాక చాలామంది ప్రొడ్యూసర్స్‌ నీతో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు కదా? అన్నాను. 'స్టోరి చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది సార్‌' అన్నారు. ఆ వెంటనే కృష్ణకి ఫోన్‌ చేసి నువ్వు ఈ సినిమాని డైరెక్ట్‌ చెయ్‌ అని చెప్పాను. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఔట్‌ స్టాండింగ్‌ స్క్రిప్ట్‌. డెఫినెట్‌గా ఈ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. ఆ క్యారెక్టర్‌కి జె.డి. చక్రవర్తి టూ హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ ఫ్రంట్‌లైన్‌ హీరోగా నిలబడతారు. భానురేఖ, సావిత్రి, హేమమాలిని, సరోజనీదేవి, జయలలితలాంటి పొటెన్షియల్‌ ఉన్న హీరోయిన్‌ దిగంగన. ఆర్‌డి రాజశేఖర్‌గారు అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. నేను ఆయన్ని కూడా దర్శకుడిగానే పరిగణిస్తాను. ఆయన్ని డైరెక్షన్‌ చేయమని అడిగాను. లేదు సార్‌, నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం అని చెప్పారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు కృష్ణ రెండు సినిమాలకి వర్క్‌ చేయనున్నారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved