ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మనముందుకు వస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ లాంచ్ తో పాటు సినీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. రెండు సాంగ్స్ బ్యాలెన్స్ తో కొంత టాకీ పార్ట్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. అని అన్నారు.
చాందినీ చౌదరి మాట్లాడుతూ... ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ లభించింది. దర్శకుడు రేవన్ కు చాలా థాంక్స్. హీరో రాహుల్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఈసినిమా అందరికీ చాలా మంచి పేరు తెస్తుంది.
మనాలీ రాథోడ్ మాట్లాడుతూ.. నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. మా డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ని ఇప్పుడే రివీల్ చేయొద్దన్నారు. అందాల రాక్షసి సినిమా చూసిన తర్వాత రాహుల్ కి పెద్ద అభిమానిని అయ్యాను. నాకు చాలా ఇష్టమైన నటుడు. అని అన్నారు.
దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. మే మొదటి వారంలో టీజర్ విడుదల చేసి...రెండో వారంలో ఆడియో రీలీజ్ చేసి... నెలాఖరున సినిమాతో మీ ముందుకు వస్తాం. అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ - శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ - విజయ్ మిశ్రా
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత - ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వం - రేవన్ యాదు