pizza
Iddaram release on 8 July
8న `ఇద్ద‌రం` విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 July 2016
Hyderabad

జావ‌న్ అండ్ కాస్పియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ నిర్మిస్తున్న సినిమా `ఇద్ద‌రం`. సంజీవ్ క‌థానాయ‌కుడు. సాయికృప నాయిక‌. సుధాక‌ర్ వినుకొండ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా యూనిట్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం ఉద‌యం విలేక‌రుల‌తో స‌మావేశ‌మైంది.

సుధాక‌ర్ వినుకొండ మాట్లాడుతూ ``రొమాంటిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించాం. గ్యాంగ్ రేప్ నేప‌థ్యంలో సినిమా జ‌రుగుతుంది. రేప్ చేసే గ్యాంగ్‌లో ఒక‌డు మంచి వ్య‌క్తి ఉంటే, అత‌ను మిగిలిన వారిని ఎదిరిస్తే అక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తిక‌ర‌మైన అంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించాం. మొత్తం ఆరు పాట‌లున్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది`` అని చెప్పారు.

టైమ్ నాని మాట్లాడుతూ ``రైట‌ర్ గా ఇది నాకు తొలి సినిమా. అంద‌రూ క‌లిసి బాగా ప‌నిచేశారు. అంద‌రికీ పేరొస్తుంది`` అని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత కిర‌ణ్ మాట్లాడుతూ ``నేను ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు `ఇద్ద‌రం` అయ్యాం. పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జులై 8న రంజాన్ శుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల‌లో సుమారు 100 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం`` అని అన్నారు.

రంగ‌నాథ్‌, జీవా, సూర్య‌, కౌటిల్య‌, బ్యాంక్ శ్రీనివాస్‌, ప్ర‌భావ‌తి, జ‌బర్ద‌స్త్ బాష ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌: సుధాక‌ర్ వినుకొండ‌, స‌హ నిర్మాత‌లు: శివ‌దీప్ స్వామి, గంగిరెడ్డి, కెమెరా: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, సంగీతం: కిర‌ణ్ శంక‌ర్‌, మాట‌లు: టైమ్ నాని, ఎడిట‌ర్‌: నాగేంద్ర‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిర‌ణ్ సిరిగిరి, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: శ‌ర్మ ఎం.కె.వి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved