pizza
Kalyana Vaibhogame - K.L. Damodar Prasad press meet
‘కళ్యాణ వైభోగమే’ చిత్రం మా బ్యానర్ లో వచ్చిన గత చిత్రాలకు ధీటుగా ఉంటుంది – కె.ఎల్.దామోదర్ ప్రసాద్
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 February 2016
Hyderabad

శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించిన చిత్రం కళ్యాణ వైభోగమే. ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘’కళ్యాణ్ వైభోగమే చిత్రం మార్చి 4న విడుదలవుతుంది. సాధారణంగా సినిమా కథ విని, అంతా రెడీ అయిన తర్వాతే సినిమా గురించి మాట్లాడుతాను. ఈ సినిమా కోసం 14 నెలలు పాటు వర్క్ చేశాం. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు, సాహిత్యానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలామొదలైంది తర్వాత నేను, నందిని రెడ్డీ కలిసి చేసిన సినిమా ఇది. మా ఇద్దరిదీ మ్యాజికల్ కాంబినేషన్. ఇద్దరి వేవ్ లెంగ్త్ లు చక్కగా ఉండటంతో మంచి కథ కుదురుతుంది. కళ్యాణ్ కోడూరిగారు మా ఆస్థాన విద్వాంసుడు. ఇంత వరకు మా బ్యానర్ లో వచ్చిన పాటల కంటే ఈ సినిమా ఆల్బమ్ కు మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా పెళ్ళి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను సినిమా చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు కొత్తవారిని ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే రాజు అనే సినిమాటోగ్రాఫర్ ను పరిచయం చేశాను. సినిమా చేస్తున్నట్టు ముందుగా చాలా మందికి తెలియదు. కానీ సినిమా అంతా పూర్తై, సెన్సార్ పూర్తయిన తర్వాతే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఇక్కడ అభిషేక్ పిక్చర్స్ వారు సినిమాను విడుదల చేస్తున్నారు. అలాగే ఓవర్ సీస్ లో కూడా చాలా మంచి బిజినెస్ అయ్యింది. ఇది లవ్ స్టోరీ. ఇప్పుడు జనరేషన్ కు తగిన విధంగా ఎంటర్ టైన్మెంట్ వేలో చెప్పాం. ప్రతి ఒక క్యారెక్టర్ చక్కగా కుదిరింది. నేను శాటిలైట్ కోసం ఎప్పుడూ నటీనటులను తీసుకోలేదు. కథను అనుసరించే నా సినిమాలో నటీనటులు ఉంటారు. మా బ్యానర్ లో వచ్చిన ఇతర సినిమాలకు ధీటుగా సినిమా ఉంటుంది’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved