pizza
Allu Arvind press meet about Khaidi No. 150 1st day collections
తొలిరోజునే టాలీవుడ్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా `ఖైదీ నంబ‌ర్ 150` - అల్లు అర‌వింద్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 January 2017
Hyderaba
d

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల‌ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`. ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత అల్లు అర‌వింద్ సినిమా గురించిన సంగ‌తుల‌ను తెలియ‌జేశారు. అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ...

తెలుగు సినిమాలో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌...
- పండుగ‌కు మూడు రోజుల ముందుగానే ఈ సినిమా విడుద‌ల కావ‌డంతో అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ వ‌ద్ద సంద‌డి చేశారు. నిన్న ఖైదీ నంబ‌ర్ 150 చిత్రం ఎంత క‌లెక్ట్ చేసింద‌నే విష‌యాన్ని సేక‌రించి లెక్క‌లేసి చూసుకుంటే చాలా గొప్ప, సంతోషక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేంటంటే ఇంత వ‌ర‌కు హ‌య్య‌స్ట్ ఫ‌స్ట్ డే గ్రాస‌ర్‌గా ఈ చిత్రం నిల‌బ‌డింది. పూర్తి వివ‌రాల‌తో చెబుతాను. ఇది గేమ్ కాదు. క‌లెక్ష‌న్స్ వివ‌రాల‌ను చిరంజీవిగారి కుటుంబ స‌భ్యుల‌తో షేర్ చేసుకున్న‌ప్పుడు వారు గొప్ప ఆనందాన్ని పొందారు. ఖైదీ నంబ‌ర్ 150 చిత్రం తొలి రోజున 47 కోట్ల 7 లక్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేసింది. ఓవ‌ర్‌సీస్‌తో స‌హా అన్నీ క‌లిపి గ్రాండ్ క‌లెక్ష‌న్స్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్ల న‌ల‌బై ఐదు వేలు, క‌ర్ణాట‌క 4 కోట్ల డెబై ల‌క్ష‌లు, ఓవ‌ర్‌సీస్‌లో(యు.ఎస్‌) 1.22 మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ట్ చేయ‌గా, యు.ఎస్ మిన‌హా మిగిలిన ఓవ‌ర్‌సీస్ ఏరియాస్‌లో 320 థౌంజండ్ డాల్స‌ర్స్‌ను వ‌సూళ్ళ‌ను క‌లెక్ట్ చేసింది. అంటే నార్త్ అమెరికాలో సుమారుగా ఎనిమిది కోట్ల తొంబై ల‌క్ష‌లు, రెస్టాఫ్ ఓవ‌ర్‌సీస్ సుమారు రెండు కోట్ల 45 ల‌క్ష‌ల రూపాయ‌లను వ‌సూలు చేసింది. మొత్తం క‌లిపి 47 కోట్ల 7 లక్ష‌ల‌వుతుంది. ఒరిస్సా 12లక్ష‌లు, త‌మిళ‌నాడు 20 ల‌క్ష‌లు, ఇవీకాక రెస్టాఫ్ ఇండియా 58ల‌క్ష‌ల రూపాయ‌ల గ్రాస్‌ వ‌చ్చాయి.

తెలుగు సినిమా మార్కెట్ పెరుగుతుంది......
- తెలుగు సినిమా మార్కెట్ ఎంతగానో పెరుగుతుంది. తెలుగు సినిమాను అభిమానించేవారు పెరిగితే ఇండ‌స్ట్రీకి ఎంతో బావుంటుంది అనే విష‌యాలు తెలియ‌జేయ‌డానికి ఈ క‌లెక్ష‌న్స్‌ను తెలియ‌జేశాను. చిరంజీవిగారు ఇండ‌స్ట్రీకి వ‌స్తున్న శుభ సంద‌ర్భంలో ఈ సినిమాను దాటింది, ఆ సినిమాను దాటిందని చెప్ప‌డం లేదు. మొద‌టిరోజు గ్రాస్ క‌లెక్ష‌న్స్ చెప్ప‌డానికి కార‌ణం చిరంజీవిగారిని చూడ‌టానికి జ‌నం ఎంత ఆస‌క్తిని క‌న‌ప‌రిచారో దీని ద్వారా తెలుస్తుంది. షేర్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను. ఈరోజుల్లో ఫ‌స్ట్ డే గ్రాస‌ర్‌, ఫ‌స్ట్ వీక్ షేర్ చాలా ముఖ్యం. రెండు, మూడు వారాల్లో 90 వాతం క‌లెక్ష‌న్స్ వ‌చ్చేస్తున్నాయి.

అందుకే ఒక‌రోజు ముందుగానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాం......
- సెకండ్ డే క‌లెక్ష‌న్స్ కూడా ఉధృతంగా ఉన్నాయి. సాధార‌ణంగా తెలుగు సినిమాను శుక్రవారం విడుదల చేస్తుంటాం. ఖైదీ నంబర్ 150 సినిమాను బుధవారం రిలీజ్ చేయడానికి ముందు ఆలోచించాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి సినిమాను జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేసినా బావుంటుంద‌ని భావించాం. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు వ‌స్తే బాగోదు. వ‌స్తే ఒక‌రోజు ముందైనా రావాలి, లేదా ఒక‌రోజు వెనకైనా రావాలని అంద‌రం ఆలోచించి ముందురోజు రావ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నాం.

చిరంజీవిగారి ఉధృత‌మే కార‌ణం....
- ఈ క‌లెక్ష‌న్స్ ప్ర‌వాహం చిరంజీవిగారి స‌త్తా మేర ఉండ‌వ‌చ్చు. సినిమాను జ‌న‌వ‌రి 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా సుమారుగా 2000 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేశాం. చిరంజీవిగారి క‌మ్ బ్యాక్ ఈ క‌లెక్ష‌న్స్‌కు కార‌ణ‌మ‌ని అనుకుంటున్నాను. చిరంజీవిగారిని ఒక న‌టుడిగా ప్రేమించిన వారందరూ ఆయ‌నెలా చేశారో చూడాల‌నుకున్నారు. కాబ‌ట్టి చిరంజీవిగారి ఉధృత‌మే ఇందుకు కార‌ణమ‌ని నేను అనుకుంటున్నాను. సినిమా రిలీజ్‌కు ముందు ఓవ‌ర్‌సీస్ క‌లెక్ష‌న్స్ సాధార‌ణంగా తెలుస్తుంటాయి. ఆ క‌లెక్ష‌న్స్ చూసి మాకే ఆశ్చ‌ర్యం వేసింది. బుధవారం రిలీజైనా కూడా అమెరికాలో ఇంత మేర క‌లెక్ట్ చేయ‌డానికి కార‌ణం చిరంజీవిగారి క‌మ్ బ్యాక్. మ‌స్క‌ట్‌లో తెలుగువాళ్లు ఉన్న కంపెనీలైతే సెల‌వులు కూడా ప్ర‌క‌టించారు.

చిరంజీవిగారు ఎటువంటి వివాదం లేని వ్య‌క్తి. అంద‌రితో క‌లుపుగోలుగా ఉంటారు. ఇలాంటి ఒక వ్య‌క్తి దాదాపు ప‌దేళ్ళ త‌ర్వాత సినిమాల్లోకి తిరిగి వ‌స్తున్నాడంటే ఇండ‌స్ట్రీలో అంద‌రూ వెల్‌క‌మ్ చెబుతారు. అలా అంద‌రూ వెల్‌క‌మ్ చెబుతుంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఇలా రెస్పాన్స్ క్రియేట్ చేసింది.

కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి తీసుకున్న నిర్ణ‌యం...
- చిరంజీవిగారు హీరోగా రీ ఎంట్రీ అవుతున్నార‌న‌గానే సినిమాను ముందు నేను ప్రొడ్యూస్ చేద్దామ‌నుకున్నాను. అయితే సురేఖ స‌మ‌ర్పించు, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత ఇవ‌న్నీ క‌లిపి ఆయ‌న క‌మ్‌బ్యాక్‌కు ఇదే అవుతుంద‌ని క‌టుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి తీసుకున్న నిర్ణ‌యంతో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా మారాడు.

చిరంజీవి 151వ సినిమా గురించి....
- చిరంజీవిగారి 151వ సినిమాను బోయ‌పాటిశ్రీను ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై చేద్దామ‌నుకున్నాం. అయితే కొన్ని కార‌ణాల‌తో వ‌అది పోస్ట్ పోన్ అవుతూ వ‌చ్చి ఆయ‌న కొత్త సినిమాను స్టార్ట్ చేసి నెల అవ‌గానే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి. అయితే ప్ర‌స్తుతం బోయపాటిగారు చేస్తున్న సినిమా ఆరు నెల‌లు ప‌డుతుంది. అలాగే చిరంజీవిగారి క‌థ ఓకే అయ్యింది కానీ ఈ క‌థ‌ను చిరంజీవిగారికి త‌గిన విధంగా మ‌ల‌చ‌డానికి తొమ్మిది నుండి ప‌ది నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది క‌నుక ఈలోపు చిరంజీవిగారు మ‌రో సినిమా చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయిని అనిపిస్తుంది. ఇప్పుడు విన్న క‌థ‌ల్లో చ‌ర‌ణ్ అల్రెడి ఒక క‌థ‌ను ప‌ట్టుకుని తిరుగుతున్నాడు. అదెంత వ‌ర‌కు వ‌స్తుందో చూడాలి. డైరెక్ట‌ర్‌గా సురేంద‌ర్‌రెడ్డిగారి పేరు విన‌ప‌డుతుంది. చిరంజీవిగారి 151వ సినిమాగా ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి క‌థ కూడా ప‌రిశీల‌న‌లో ఉంది

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved