pizza
Kotha Kothaga Unnadi release on 14 October
14న `కొత్త‌కొత్త‌గా వున్న‌ది` విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 October 2016
Hyderaba
d

శ్రీ మ‌హాల‌క్ష్మి ఇన్నొవేటివ్స్ నిర్మించిన చిత్రం కొత్త కొత్త‌గా వున్న‌ది. స‌మ‌ర్ క‌థానాయకుడు. అక్షిత‌, కిమ‌య నాయిక‌లు. పేర్ల ప్ర‌భాక‌ర్, తోట గోపాల్ నిర్మాత‌లు. గుండేటి స‌తీష్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర యూనిట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా

నిర్మాత మాట్లాడుతూ ``ఆడియోకి మంచి స్పంద‌న వ‌చ్చింది. అక్టోబ‌ర్ 14న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. హీరో, హీరోయిన్లు ద‌ర్శ‌కుడు కూడా కొత్త‌వారే. చాలా మంది సినిమాను చూసి ఫ్రెష్ ఫీల్‌తో ఉంద‌ని అన్నారు. క‌చ్చితంగా ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చేసే చిత్ర‌మ‌వుతుంది`` అని అన్నారు.

Glam gallery from the event

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``యూజ్‌ఫుల్ కామెడీ ఉంటుంది. టెస్ట్ ట్యూబ్‌ల ద్వారా పుట్టిన హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనుబంధం వంటి ఎమోష‌న్స్ ఎలా ఉంటాయ‌నే కాన్సెప్ట్ తో ఎంట‌ర్‌టైనింగ్ గా చేసిన చిత్ర‌మిది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని తెలిపారు.

సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ ``ఈ నిర్మాత‌తో మంచి అనుబంధం ఉంది. మంచి పాట రాశాను. టీమ్‌కి అభినంద‌నలు తెలియ‌జేస్తున్నాను`` అని అన్నారు.

హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ ``మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రంలో న‌టించినందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved