pizza
Kundanapu Bomma release on 24 June
జూన్ 24న విడుద‌ల‌వుతున్న 'కుంద‌న‌పు బొమ్మ‌'
ou are at idlebrain.com > News > Functions
Follow Us

04 June 2016
Hyderabad

సుధీర్ వ‌ర్మ‌, చాందినిచౌద‌రి హీరో హీరోయిన్లుగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ. స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ముళ్ళ‌పూడి వ‌రా ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్‌, వంశీ, అనిల్ నిర్మించిన చిత్రం కుంద‌న‌పు బొమ్మ‌. మాగ్న‌స్ సినీ ప్రైమ్ ప్రై.లి. స‌హ‌కారంతో ఈ సినిమా జూన్ 24న విడుద‌ల‌వుతుంది. సుధాక‌ర్ కొమాకుల‌, ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

డైరెక్ట‌ర్ ముళ్ళ‌పూడి వ‌రా మాట్లాడుతూ ``విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ల‌వ్ స్టోరీ. ప్యామిలీ సెంటింమెంట్స్‌, ఎమోష‌న్స్ అన్నీ ఈ చిత్రంలో క‌న‌ప‌డ‌తాయి. సినిమా సెన్సార్ అయిన త‌ర్వాత చూసిన మాగ్న‌స్ సినీ ప్రైమ్ అధినేత శ్రీనివాస్ బొగ్గ‌రంగారు ఈ సినిమా రిలీజ్ చేయ‌డానికి ముందుకు రావ‌డం ఆనందంగా ఉంది. జూన్ 24న సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా అంద‌ర‌కీ న‌చ్చే చిత్ర‌మవుతుంది``అన్నారు.

శ్రీనివాస్ బొగ్గ‌రం మాట్లాడుతూ ``మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌. ఇటువంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తే బావుంటుంద‌నే ఉద్దేశంతో నా వంతు స‌హకారం అందించ‌డానికి ముందుకు వ‌చ్చాను. ఇటువంటి సినిమాల‌ను ఆద‌రిస్తే మ‌రిన్ని మంచి చిత్రాలు వ‌స్తాయి`` అన్నారు.

అనురాధ ఉమ‌ర్జీ మాట్లాడుతూ ``అంద‌రం ఫ్యామిలీలా క‌లిసి వ‌ర్క్‌చేశాం. ముళ్ళ‌పూడి వ‌రాగారితో వ‌ర్క్‌చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌`` అన్నారు.

Chandini Chowdary Glam gallery from the event

సుధాక‌ర్ కొమాకుల మాట్లాడుతూ ``ఈ సినిమాలో నా పాత్ర ప‌రిమితంగానే ఉన్న‌ప్ప‌టికీ చాలా ప్రాముఖ్య‌త‌తో కూడుకుని ఉంటుంది. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే చిత్ర‌మిది`` అన్నారు.

సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ ``ప్ర‌తి సీన్‌ను వ‌రాగారు ఎంతో గొప్ప‌గా తీశారు. సినిమా అన‌డం కంటే ఇదొక క్లాసిక‌ల్ విలేజ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలిచిపోవ‌డ‌మే కాకుండా మ‌నల్ని ఎక్క‌డో గుర్తుకు తెచ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన వంశీ మాట్లాడుతూ ``రెండేళ్ల ప్ర‌యాణ‌మే కుంద‌న‌పు బొమ్మ‌. అందులో సంవ‌త్స‌రం పాటు స్క్రిప్ట్‌పై వ‌ర్క్‌చేశాం. ఈ సినిమాలో మా హీరోయిన్ కుంద‌న‌పు బొమ్మ‌. ఆమెకు వ‌చ్చిన స‌మ‌స్యేంటి? ఎలా తీరింద‌నేదే క‌థ‌. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చాందిని చౌద‌రి, గౌత‌మ్ క‌శ్య‌ప్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ఎస్‌.డి.జాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నాగినీడు, రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్సీ, షాని, భార్గ‌వి త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రానికి మాటలుః అనురాధ ఉమ‌ర్జీ, సంగీతంః యం.యం.కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీః ఎస్‌.డి.జాన్‌, ఎడిట‌ర్ః జి.వి.చంద్ర‌శేఖ‌ర్‌, ఆర్ట్ఃఎం.కిర‌ణ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ఎం.ఎస్‌.శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్స్ః ఎన్‌.న‌ర‌స‌రాజు, అనిత‌, నిర్మాత‌లుః నిరంజ‌న్‌, అనిల్‌, వంశీ, స్క్రీన్‌ప్లేః ముళ్ళ‌పూడి వ‌రా, కెకె.వంశీ, శివ తాళ్ళూరి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః ముళ్ళ‌పూడి వ‌రా.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved