pizza
Lakshmi Bomb press meet
`ల‌క్ష్మీబాంబ్‌` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 August 2016
Hyderaba
d

గుణ‌పాటి సురేశ్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఉద్భ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న చిత్రం `ల‌క్ష్మీ బాంబ్‌`. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న జ‌డ్జిగా న‌టిస్తున్నారు. డార్లింగ్ స్వామి క‌థ‌, మాట‌లు అందించారు. కార్తికేయ గోపాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వేళ్ల మౌనిక చంద్ర‌శేఖ‌ర్‌, ఉమా ల‌క్ష్మీ న‌ర‌సింహ (బుజ్జి) నిర్మాత‌లు. ఈ చిత్రం ఆన్‌లొకేష‌న్ ప్రెస్‌మీట్ హైద‌రాబాద్‌లోని డాగ్ హౌస్‌లో బుధ‌వారం జ‌రిగింది.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``మా సినిమా ఫూర్తి కావ‌చ్చింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రెండు పాట‌లు, రెండు ఫైట్లు ఉంటాయి. ఆగ‌స్టు 15కి షూటింగ్ పూర్త‌యింది. త్వ‌ర‌లో ఆడియో ప్లాన్ చేస్తాం. దీపావ‌ళికి ముందే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అని తెలిపారు.

గుణ‌పాటి సురేశ్ రెడ్డి మాట్లాడుతూ ``ల‌క్ష్మీ చాలా బాగా కో ఆప‌రేట్ చేస్తున్నారు. క‌ష్ట‌ప‌డి మా టీమ్ అంతా ప‌నిచేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. దీపావ‌ళి కి ముందే సినిమాను పూర్తి చేస్తాం`` అని అన్నారు.

ల‌క్ష్మీ మంచు మాట్లాడుతూ ``ఈ సినిమా చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తోంది. చాలెంజింగ్ పాత్ర చేస్తున్నాను. ఇలాంటి కేర‌క్ట‌ర్‌ని ఇప్ప‌టిదాకా చేయ‌లేదు. కంటిన్యుయ‌స్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తున్నారు. ఫైట్లు, పాట‌లు చాలా బాగా వ‌చ్చాయి. సినిమా నాకు సంతృప్తికంగా ఉంది. నా పాత్ర‌కు చాలా వేరియేష‌న్స్ ఉన్నాయి. ఈ పాత్ర గురించి మా ద‌ర్శ‌కుడు ఏం చెప్తే అదే చేస్తున్నాను. ఇందులో కొన్ని డైలాగులు చెప్ప‌డానికి నేనే సిగ్గుప‌డ్డాను. అయినా అంద‌రూ న‌న్ను ప్రోత్స‌హించి నాతో చెప్పించారు. ఇత‌ర భాష‌ల్లో మ‌హిళ‌ల‌ను ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా చూపిస్తూ చాలా మంచి సినిమాలు వ‌స్తున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవ‌లోకి చెందుతుంది`` అని చెప్పారు.

Lakshmi Manchu Glam gallery from the event

ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ ``దొంగాట త‌ర్వాత ల‌క్ష్మీగారితో క‌లిసి చాలా మంచి సినిమాలో మంచి పాత్ర‌ చేస్తున్నాను. ఇందులో నా పాత్ర పేరు వైకుంఠం`` అని చెప్పారు.

అమిత్ మాట్లాడుతూ ``నా పాత్ర బావుంటుంది`` అని చెప్పారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ``మా సినిమా బాగా వ‌స్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. టీమ్ అంతా చ‌క్క‌గా స‌హ‌క‌రిస్తున్నారు. ల‌క్ష్మీగారిని ఇంత‌కు ముందు ఎపుడూ చూడ‌ని పాత్ర‌లో చూస్తారు`` అని అన్నారు.

జోషి మాట్లాడుతూ ``సినిమా చ‌క్క‌గా వ‌స్తోంది. అంద‌రికీ న‌చ్చుతుంది`` అని తెలిపారు.

పోసాని కృష్ణ‌ముర‌ళి, హేమ‌, ప్ర‌భాక‌ర్‌, భ‌ర‌త్ రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బ‌రాయ శ‌ర్మ‌, జె.వి.ఆర్‌., రాజాబాబు, శ‌ర‌త్‌, శ్రీ హ‌ర్ష‌, విశాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు డ్యాన్స్: కిర‌ణ్‌, ఆర్ట్: ర‌ఘు కుల‌క‌ర్ణి, ఫైట్స్: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి, పాట‌లు: క‌ర‌ణాక‌ర్‌, కాస‌ర్ల శ్యామ్‌, సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌, కెమెరా: జోషి మ‌ల్హ‌ర్‌భ‌ట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: కె.ముర‌ళి, సుబ్బారావు, ఆర్‌.సురేంద్ర‌రాజు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved