pizza
London Life release on 12 February
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 February 2016
Hyderabad

ఫిభ్రవరి 12న విడుదలవుతున్న ‘లండన్ లైఫ్’

నవీన్ మేడారం దర్శకత్వంలో అసద్ షా, యాంబర్ రోజ్ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం లండన్ లైఫ్. లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఫిభ్రవరి 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘’ దర్శకుడు నవీన్ మేడారం నాకు మంచి మిత్రుడు. యు.కె.లో ఉంటాడు. తన దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా లండన్ లైఫ్. పెద్ద పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే అభిషేక్ పిక్చర్స్ వారు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడం గొప్పవిషయం. హైదరాబాద్ లోనే 33 మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఫిభ్రవరి 12న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటునాను’’ అన్నారు.

నవీన్ మేడారం మాట్లాడుతూ ‘’జురాసిక్ పార్క్ ఇన్ స్పిరేషన్ తో సినిమాల్లో ఏదైనా చేయాలనుకున్నాను. మాస్టర్స్ కోసం నేను యు.కె వెళ్ళినప్పుడు అక్కడే స్థిరపడ్డాను. 30 హాలీవుడ్ సినిమాల్లో వర్క్ చేశాను. 14 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాను. ఒక ఇంట్లో నివసించే 9 మంది క్యారెక్టర్స్ కు సంబంధించిన కథ. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. పెద్ద పెద్ద్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే అభిషేక్ పిక్చర్స్ మాకు సపోర్ట్ గా నిలవడం ఆనందంగా ఉంది. 9 మంది వ్యక్తుల ఎమోషనల్ జర్నీఇది. ఫిభ్రవరి 12న విడుదలవుతుంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్, అభిషేక్ పిక్చర్స్ కాళీ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Glam gallery from the event

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved