23 February 2016
Hyderabad
2013లో `ప్రేమకథా చిత్రమ్` విడుదలైంది. హారర్ కామెడీ జోనర్‌లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. 2014లో `గీతాంజలి`, 2015లో `రాజుగారి గది` ఆ లెగసీని కంటిన్యూ చేశాయి. ఇప్పుడు 2016లో మా `వీరి వీరి గుమ్మడి పండు` ఆ సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తుంది`` అని అన్నారు ఎం.వి.సాగర్. ఆయన దర్శకత్వం వహించిన `వీరి వీరి గుమ్మడి పండు` ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం సాగర్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
సాగర్ మాట్లాడుతూ ``నేను, నిర్మాత, హీరో, హీరోయిన్ అందరూ కొత్తవాళ్ళమే. దాదాపు 63 మంది కొత్తవాళ్ళం కలిసి చేసిన సినిమా ఇది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేశాం. ఫ్యామిలీ హారర్ కామెడీ తరహాకు చెందిన సినిమా. ఓ ఇంట్లో 16 మంది ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. తొలి సగం గంటా రెండు నిమిషాలు ఉంటుంది. అందులో తొలి 15 నిమిషాల్లో కేరక్టర్లను పరిచయం చేస్తాం. 20 నిమిషాలు ఇంటర్వెల్ బ్లాగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందనే విషయం దాంతో కన్‌ఫర్మ్ అవుతుంది. అయితే దెయ్యం ఎవరిలో ఉందనే కథనంతో రెండో సగం మొదలవుతుంది. క్లైమాక్స్ కూడా 20 నిమిషాలు ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. సరదాగా నవ్వుతూనే ఉంటారు. మంచి సినిమా చూశామని మిగిలిన ఫ్రెండ్స్ తో చెప్పుకునేలా ఉంటుంది సినిమా. మల్టీప్లెక్స్ ల నుంచి మాల్స్ వరకు అందరికీ నచ్చే చిత్రమవుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. 75 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం. నేను ఇంతకు ముందు ఎవరి దగ్గరా సినిమాలు చేయలేదు. మొదటి నుంచీ సినిమాలంటే ఆసక్తి. దాంతోనే నేను కథను సిద్ధం చేసుకుని మా నిర్మాతకు చెప్పాను. ఆయన విని తప్పకుండా చేద్దామని చేశారు. ఇటీవలే అమీర్‌పేటకు చెందిన 30 మంది యువకులకు ఈ సినిమాను ప్రదర్శించాం. అందరూ చాలా ఆసక్తికరంగా చూశారు. ఇందులో హీరోయిన్‌గా చేసిన అమ్మాయి డాక్టర్. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైతే తీసుకున్నాం. వెన్నెల అనే ఆమె చాలా బాగా చేసింది. హైలీ టెక్నికల్ సినిమా అవుతుంది`` అని చెప్పారు.
దుగ్గిన్ సమర్పణలో శివకృతి క్రియేషన్స్ బ్యానర్‌పై రుద్ర, వెన్నె, సంజయ్, బంగారం హార్దిక్, రుషిత, రఘుబాబు, శివన్నారాయణ, దీక్షిత్, అనంత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: శక్తి స్వరూప్, మ్యూజిక్: పి.ఆర్, సినిమాటోగ్రఫీ: కె.యం.కృష్ణ, ప్రొడ్యూసర్: కెల్లం కిరణ్‌కుమార్, దర్శకత్వం: ఎం.వి.సాగర్.
.