pizza
Neelimalai release on 26 May
మే 26న విడుదలవుతున్న `నీలిమలై`
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 May 2017
Hyderabad

నీలిమ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై పల్లెర్ల ఆనంద్ కృష్ణ‌, వృషాలి గోస్వామి జంట‌గా సూర్య కిర‌ణ్‌ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ కృష్ణ నిర్మాత‌గా రూపొందిన చిత్రం `నీలిమ‌లై`. ఈ సినిమా మే 26న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్‌ మాట్లాడుతూ - ``ఒక దైవ సంబంధ‌మైన సినిమాను క‌మ‌ర్షియ‌ల్‌గా ఎలా తీయ‌వ‌చ్చు నీలిమలై సినిమాతో చూపించాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నీలిమలై సినిమా చేయ‌డం ద‌ర్శ‌కుడిగా ఎంతో సంతోషానిచ్చింది. మంచి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుదిరింది. ఆనంద్ కృష్ణ‌, వృషాలి స‌హా న‌టీన‌టులంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. అలీ, భానుప్ర‌కాష్‌, స‌త్య‌ప్ర‌కాష్ వంటి సీనియ‌ర్ ఆర్టిస్టులు మంచి స‌పోర్ట్ అందించారు.

ప‌ల్లెర్ల ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ - ``నీలిమ‌లై హీరోగా, నిర్మాత‌గా చేయ‌డం ఎంతో ఆనందంగాఉంది. అన్ని ఎలిమెంట్స్ చ‌క్క‌గా కుదిరాయి. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 26న వ‌స్తోన్న ఈసినిమాను ఇంకా పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam gallery from the event

మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవేంద్ర మాట్లాడుతూ - ``సినిమా పాట‌ల‌ను ఆద‌రిస్తున్న‌ట్లుగానే, మూవీని ఆదరిస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

వృషాలి గోస్వామి మాట్లాడుతూ - ``మంచి ఫ్యామిలీ డివోష‌న‌ల్ మూవీ. పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమాలో చాలా మంచి రోల్‌లో క‌నిపిస్తాను. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నాను`` అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved