pizza
Meghasri Birthday (25 Dec) celebrations
Oh My God release on 8 January
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 December 2015
Hyderabad

ఓ మై గాడ్ ప్రెస్‌మీట్‌

త‌నీష్‌ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `ఓ మై గాడ్‌`. మేఘ‌శ్రీ, పావ‌ని నాయిక‌లు. శ్రీ వెంక‌టేశ్వ‌ర విజువ‌ల్స్ ప‌తాకంపై రూపొందింది. వేణు ముక్క‌పాటి నిర్మిస్తున్నారు. శ్రీ వాస్త‌వ్ ద‌ర్శ‌కుడు. నాయిక మేఘ‌శ్రీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌

త‌నీష్ మాట్లాడుతూ ``కామెడీ, హ‌ర్రర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఎంట‌ర్ టైన‌ర్ ఇది. జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానుంది మా సినిమా. నూత‌న సంవ‌త్స‌రంలో మా సినిమా మంచి శుభారంభ‌మ‌వుతుంది`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``మ‌నుషులు బ‌తికున్న‌ప్పుడు చాలా మందికి మాట ఇస్తుంటారు. అలాంటివారు మ‌ర‌ణించి ఆత్మ‌లుగా మారిన త‌ర్వాత ఇచ్చిన మాట‌ల‌ను ఎలా నెర‌వేర్చుకున్నాయి? వాటిని నెర‌వేర్చుకోవ‌డానికి ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాయి? అన్న క‌థాంశంతో ఈ సినిమాను రూపొందించాం`` అని చెప్పారు.

మేఘ‌శ్రీ మాట్లాడుతూ ``న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాను. ఇందులో ఉన్న మూడు పాట‌లు ఆక‌ట్టుకుంటాయి`` అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ ``నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. జ‌న‌వ‌రి 8న సినిమాను విడుద‌ల చేస్తున్నాం`` అని అన్నారు.

పావ‌ని, స‌త్త‌న్న త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved