pizza
Oka Manasu press meet
ఎకో ఫ్రెండ్లీ ప్ర‌మోష‌న్‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న 'ఒక మ‌న‌సు'
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 June 2016
Hyderabad

నాగశౌర్య, నిహారిక జంటగా టీవీ 9 సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై రామరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఒక మనసు'. జూన్‌ 24న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా కోసం నిర్మాత మ‌ధుర‌శ్రీధ‌ర్‌రెడ్డి ఎకో ఫ్రెండ్లీ ప్ర‌మోష‌న్స్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

మ‌ధుర‌శ్రీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ ``సినిమాను కొత్త‌గా ఎలా చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌ప్పుడు ఇమ్రాన్‌, పృథ్వీ అనే యువ‌కులు నా వద్ద‌కు మూడు చ‌క్రాల ఎకోఫ్రెండ్లీ ప్ర‌మోష‌న్ గురించి వ‌చ్చారు. వారు చెప్పిన ఈ కొత్త ప్ర‌మోష‌న్ విధానం నాకు బాగా న‌చ్చింది. విజ‌య‌వాడు, రాజమండ్రి, వ‌రంగల్‌, క‌రీంన‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ఈ విధానంతో ప్ర‌మోష‌న్స్ చేయ‌బోతున్నాం. ఈ నెల 24న సినిమా విడుద‌ల కానుంది`` అన్నారు.

ఇమ్రాన్‌, పృథ్వీ మాట్లాడుతూ ``ఎకో ఫ్రెండ్లీగా ఏదైనా కొత్త‌గా చేయాల‌ని అనుకున్నప్పుడు ఒక‌ప్పుడు మ‌న ఊళ్లో రిక్షాలపై ఆరుస్తూ ప్ర‌మోష‌న్ చేసేవారు. అదే విధానంతో ఈ ఎకోఫ్రెండ్లీ ప్ర‌మోష‌న్‌ను ప్లాన్ చేశాం. ఈ పద్ధ‌తిని ముందు 10 సైకిల్స్‌తో ప్రారంభించాం. ఇప్పుడు 100-150 మందికి జీవ‌నోపాధిని కూడా క‌ల్పిస్తున్నాం. దీనికి మ‌రింత టెక్నాల‌జీని యాడ్ చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నాం`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved