pizza
Only Nenu press meet
`ఒన్లీ నేను` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 March 2019
Hyderabad

శ‌ర‌క‌డం స్టోరీస్ స‌మ‌ర్పిస్తున్న సినిమా `ఒన్లీ నేను`. మైరా అమితి, పుర్వి ట‌క్క‌ర్‌, చెంగ్ కీల‌క పాత్ర‌ధారులు. శ్రీనివాస్ శ‌ర‌క‌డం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం ప్రెస్‌మీట్ హైద‌రాబాద్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది.

శ్రీనివాస్ శ‌ర‌క‌డం మాట్లాడుతూ ``ల‌వ్వు, రివెంజ్ ఉన్న సినిమా ఇది. కొంద‌రు సినిమా ప్రేమికులు కొత్త క‌థ‌ల్ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. నేను ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్‌ని. ప్ర‌పంచంలో టాప్ ప‌ది స్థానాల్లో అమ్మాయిలు స్థితిమంతులుగా లేరు. ఆ విష‌యాన్ని ఓ అమ్మాయి గ‌మ‌నిస్తుంది. టాప్ 10లో త‌న పేరు ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకుంటుంది. ఆ క్ర‌మంలో త‌న ప్రాణ స్నేహితురాలిని చంపిందా? ఏం చేసింది? వంటివి ఆస‌క్తిక‌రం. చాలా ట్విస్టులుంటాయి. డిసెంబ‌ర్ 6లోపు పూర్తి చేస్తాం`` అని అన్నారు.

చెంగ్ మాట్లాడుతూ ``నేను లాయ‌ర్‌ని. ఫ్యాష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌ని. క‌థ‌లో స‌స్పెన్స్ న‌చ్చి సినిమా చేస్తున్నా`` అని చెప్పారు.

పుర్వి మాట్లాడుతూ ``శ‌ర‌క‌డంతో క‌లిసి కొన్ని అసైన్ మెంట్స్ చేస్తున్నాం. క‌థ టెర్రిఫిక్‌గా ఉంటుంది`` అని అన్నారు.

బాల‌చంద‌ర్ మాట్లాడుతూ ``నేను తెలుగు, త‌మిళ్‌లో కొన్ని సినిమాల‌కు సంగీతం చేశాను. ఈ సినిమా నా క‌మ్ బ్యాక్ సినిమా అవుతుంది`` అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేష‌గిరిరావు మాట్లాడుతూ ``ఇంత‌వర‌కు ఎప్పుడూ రాని క‌థ‌తో ఈ సినిమా ట్రెండ్ సృష్టిస్తుంది`` అని చెప్పారు.ఫ్యాష‌న్ డిజైన‌ర్ సంధ్యా రెడ్డి, మేక‌ప్ ఆర్టిస్ట్ చైత‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved