pizza
Suresh Babu talks about Pittagoda
ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగిన స్వీట్‌ మెమొరీస్‌ని గుర్తుకు తెచ్చే చిత్రం 'పిట్టగోడ' - చిత్ర సమర్పకులు డి.సురేష్‌బాబు
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 December 2016
Hyderaba
d

'అష్టాచెమ్మా', 'గోల్కొండ హైస్కూల్‌', 'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన టేస్ట్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న తాజా చిత్రం 'పిట్టగోడ'. విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా అనుదీప్‌ కెవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సన్‌షైన్‌ సినిమాస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్స్‌పై స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌మాబు సమర్పణలో రామ్మోహన్‌ పి. నిర్మించిన చిత్రం 'పిట్టగోడ'. రీసెంట్‌గా సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రం క్లీన్‌ యు సర్టిఫికెట్‌ సాధించింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు డి.సురేష్‌బాబు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి 'పిట్టగోడ' చిత్రం విశేషాల్ని తెలిపారు.

చిత్ర సమర్పకులు, స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''ఒక కొత్త కథ, కథనాలతో న్యూ యాక్ట్రెస్‌, న్యూ డైరెక్టర్‌ని పరిచయం చేస్తూ మా సపోర్ట్‌తో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ రామ్మోహన్‌ 'పిట్టగోడ' చిత్రాన్ని నిర్మించారు. జనరల్‌గా కొత్తవాళ్లతో సినిమా తీయడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నది. అలాంటిది రామ్మోహన్‌ మళ్ళీ మళ్ళీ ఒక ప్యాషన్‌తో ఇష్టపడి సినిమాలు లేకుండా తిరిగే ఒక నలుగురు కుర్రాళ్ళు తమకంటూ ఒక పేరు, పేపర్లో పడాలని కలలు కంటారు. వారి కలలు ఎలా నెరవేర్చుకున్నారు. చివరికి లైఫ్‌లో ఎలా గెలిచారు? అనేది సస్పెన్స్‌. ప్రస్తుత సమాజంలో బ్లాక్‌మనీ, డిమానిటైజేషన్‌ మీద సినిమా వుంటుంది. చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది. టు ఇయర్స్‌ బ్యాక్‌ అనుదీప్‌ కథ రాసుకున్నాడు. లక్కీగా ఇప్పుడున్న టైమ్‌కి తగ్గట్లుగా సినిమా చేశాడు. అంతా కామెడీగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాన్స్‌, హ్యూమర్‌ వున్న క్లీన్‌ ఫ్యామిలీ ఫిలిం 'పిట్టగోడ'. ఎక్కడా వల్గారిటీ వుండదు. అందరి లైఫ్‌లో జరిగిన స్వీట్‌ మెమొరీస్‌ గుర్తుకు తెచ్చే చిత్రం ఇది. క్రిస్మస్‌ కాకనుగా డిసెంబర్‌ 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం.

అనుదీప్‌ కథ చెప్పినప్పుడు ఎంత ఎంజాయ్‌ చేసానో సినిమా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్‌ చేసాను. మా రోజుల్లో చెన్నైలో వున్నప్పుడు సోమ సుందరం గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడేవాళ్లం. గోడమీద కూర్చొని వచ్చే అమ్మాయిల్ని చూసి ఎంజాయ్‌ చేసేవాళ్లం. వాళ్లని అలాగే డాన్‌బాస్కో స్కూల్‌లో వచ్చి పోయే సిస్టర్స్‌ని చూసేవాళ్లం తప్ప ఎలాంటి కామెంట్స్‌ చేసేవాళ్లం కాదు. నేను చాలా పద్ధతైన కుర్రాణ్ణి. అణిగిమణిగి వుండేవాడ్ని. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగిన గ్రేట్‌ మెమొరీస్‌ గుర్తుకు వస్తాయి. ఈ కథకి పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ టైటిల్‌ 'పిట్టగోడ'. సంగీత దర్శకుడు కమలాకర్‌ ఈ సినిమాకి ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ కంపోజ్‌ చేశాడు. చిన్న సినిమా అయినా కూడా పెద్ద సినిమా రేంజ్‌లో లైవ్‌ ఆర్కెస్ట్రాతో రీరికార్డింగ్‌ చేశాడు. ఈ చిత్రానికి కమలాకర్‌ మ్యూజిక్‌ ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌ అవుతుంది. కొత్త జోనర్‌లో వెరైటీ ఫిల్మ్స్‌ తీయాలని నాకు బాగా ఇంట్రెస్ట్‌. ఇప్పుడు మా రానా హీరోగా తేజ డైరెక్షన్‌లో ఒక యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తీస్తున్నాం. షూటింగ్‌ జరుగుతోంది. దర్శకుడు రవిబాబు, నేను 'అదిగో' చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా అంతా పూర్తయింది. సిజి వర్క్‌ జరుగుతోంది. నెక్ట్స్‌ సమ్మర్‌కి రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. అలాగే చైతు, రానా కాంబినేషన్‌లో డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో ఒక చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాం. అలాగే కొత్తవాళ్లతో 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో నిర్మించే చిత్రానికి స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్లుగా 'ప్రేమనగర్‌' చిత్రాన్ని రీమేక్‌ చేయాలని వుంది'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved