pizza
Sai Dharam Tej, Karunakaran & Creative Commercials movie songs shooting in Paris
పారిస్ వెళుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌, క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ చిత్రం
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 April 2018
Hyderabad

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.45గా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తోన్న చిత్ర యూనిట్‌ పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం పారిస్ వెళుతుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - ``నేను మా డైరెక్ట‌ర్ పూర్తి సినిమాను ఆడిటోరియంలో చూశాం. చాలా సంతోషంగా, స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. సాయిధ‌ర‌మ్ తేజ్ చాలా గొప్ప‌గా న‌టించారు. ఇటువంటి ఫుల్ టైమ్ ల‌వ్‌స్టోరీస్‌లో సాయిధ‌ర‌మ్‌ని చూడ‌టం ఇదే తొలిసారి. చ‌క్క‌టి టైమింగ్‌తో న‌టించారు. అలాగే సాయిధ‌ర‌మ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇద్ద‌రూ పోటీ ప‌డుతూ న‌టించారు. సాయిధ‌ర‌మ్ పాత్ర‌లో జీవించాడు. ఈస్త‌టిక్ ల‌వ్‌స్టోరీని ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించారు. ల‌వ్‌తో పాటు చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్స్ సినిమాలో ఉంటాయి. కుటుంబం అంతా క‌లిసి ఆనందించేలా సినిమా ఉంటుంది. ఇంత మంచి సినిమా తీసిన క‌రుణాక‌ర‌న్‌కి థాంక్స్‌. అండ్రూ గొప్ప‌గా సినిమాటోగ్ర‌ఫీ అందించారు. డార్లింగ్ స్వామి నేటి తరానికి న‌చ్చేలా డైలాగ్స్ రాశారు. బ్యాలెన్స్ ఉన్న రెండు పాట‌లు తీయ‌డానికి పారిస్ వెళుతున్నాం. ఆ పాట‌లు పూర్తి చేసి ఇక్క‌డకొచ్చి ప్యాచ్ వ‌ర్క్ పూర్తి చేస్తాం. మే నెల‌లో రీరికార్డింగ్ చేస్తాం. అతి త్వ‌రలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ఎ.క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ - ``సినిమా బ్యూటీఫుల్‌గా, గ్రాండ్‌గా వ‌చ్చింది. కె.ఎస్‌.రామారావుగారు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ఇంత మంచి సినిమా చేశామ‌ని రేపు థియేట‌ర్లో ప్రేక్ష‌కులు అబినందించేలా సినిమా ఉంటుంది`` అన్నారు.

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ - ``డార్లింగ్ త‌ర్వాత కె.ఎస్‌.రామారావుగారు నాకు మ‌రో అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా తొలి ప్రేమ‌, డార్లింగ్‌, ఉల్లాసంగా ఉత్సాహంగా స్టైల్లో సినిమా సూప‌ర్‌హిట్ అవుతుంది. డెఫ‌నెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జ‌య‌ప్రకాశ్‌, ప‌విత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హ‌ర్ష‌, జోష్ ర‌వి, అరుణ్ కుమార్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్: చ‌ంద్ర‌బోస్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, పోతుల ర‌వికిర‌ణ్, గోశాల రాంబాబు, స్టంట్స్: వెంక‌ట్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: స‌తీశ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: మోహ‌న్‌, చీఫ్ కో డైరెక్ట‌ర్: చ‌ల‌సాని రామారావు, ఎడిట‌ర్: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్ స్వామి, స‌హ నిర్మాత‌: అలెగ్జాండ‌ర్ వ‌ల్ల‌భ‌, నిర్మాత‌: కె.ఎస్‌.రామారావు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం: ఎ.క‌రుణాక‌ర‌న్‌.



Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved