pizza
Sobhanbabu awards 2018 function on 25 December
డిసెంబర్ 25న శోభన్‌బాబు అవార్డుల ప్రదానం
You are at idlebrain.com > News > Functions
Follow Us


22 December 2018
Hyderabad

అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శోభన్‌బాబు పేరుమీద పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుక డిసెంబర్ 25 సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్‌ను శనివారం ఆవిష్కరించారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత రాశి మూవీస్ నరసింహారావు, దర్శకుడు రేలంగి నరసింహారావుతోపాటు శోభన్‌బాబు సేవా సమితి కన్వీనర్స్ ఎం.సుధాకర్‌బాబు, పూడి శ్రీనివాసరావు, టి.సాయి కామరాజు, బి.బాలసుబ్రహ్మణ్యం, జి.జవహర్‌బాబు, టి.వీర్రపసాద్, కె.శ్రీనివాసకుమార్, బి.శ్రీనివాసరావు, ఎస్.ఎన్.రావు, యు.విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవార్డుల కార్యక్రమానికి ముందు సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహిస్తారు. సీనియర్ నటులు కృష్ణంరాజుకు ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఎ.రమేష్ ప్రసాద్ చేతులమీదుగా జీవన సాఫల్య పురస్కారారాన్ని అందిస్తున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో లబ్ధ ప్రతిష్టులుగా పేరుగాంచిన నటీనటులు, దర్శకనిర్మాతలు, సంగీత దర్శకులకు శోభన్‌బాబు ఎవర్‌గ్రీన్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డులు అందుకునే వారిలో కె.రాఘవేంద్రరావు, సి.అశ్వినీదత్, కె.బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, రోజా, బి.సత్యానంద్, ఎస్.గోపాలరెడ్డి, దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. ఉత్తమ చారిత్రక చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి, ఉత్తమ జానపద చిత్రంగా ‘బాహుబలి’, ఉత్తమ సాంఘిక చిత్రం ‘ఖైదీ నంబర్ 150’, ఉత్తమ ప్రేమకథా చిత్రంగా ‘అర్జున్‌రెడ్డి’, ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ‘శతమానం భవతి’, జ్యూరీ అవార్డును ‘మహానుభావుడు’ చిత్రానికి అందిస్తున్నారు. ఈ అవార్డుల కార్యక్రమానికి మరపురాని కథానాయికలుగా సీనియర్ నటీమణులు జయచిత్ర, సరిత, భానుప్రియ ప్రత్యేకంగా హాజరవుతారు. ఈ ఫంక్షన్‌కి ఆత్మీయ అతిథులుగా మురళీమోహన్, గిరిబాబు, వి.విజయేంద్రప్రసాద్, తెలంగాణ ఎఫ్‌డిసి ఛైర్మన్ రామ్మోహన్‌రావు, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, సెక్రటరీ నరేశ్ హాజరు కానున్నారు.



Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved