pizza
Soda Golisoda coming soon
సోడా గోలీ సోడా కు క్లీన్ యూ సర్టిఫికెట్.. అతి త్వరలో విడుదల
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

3 February 2018
Hyderabad

ఎస్. బి క్రియేషన్స్ పతాకంపై చక్రసీద్ సమర్పించు చిత్రం 'సోడా గోలీ సోడా'. మొత్తం గ్యాస్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న చిత్రానికి నిర్మాత భువనగిరి సత్య సింధూజ, దర్శకుడు మల్లూరి హరిబాబు. మానస్, నిత్య నరేష్, కారుణ్య హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్... ఈ నేపథ్యంలో నిర్మాత సత్య సింధూజ మాట్లాడుతూ క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చిన సోడా గోలీ సోడా అంతా గ్యాసే.. చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఉండబోతోంది.. అని తెలిపారు... దర్శకుడు హరిబాబు మాట్లాడుతూ.. వినోదాత్మక చిత్రాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యం తోనే సోడా గోలీ సోడా సినిమాను చేయడం జరిగింది... క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది.. మానస్, నిత్య, కారుణ్యాలు ఇంత మంచి సినిమాను అంగీకరించి ఇష్టంతో కష్టపడి పనిచేశారు.. నాకు సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలను తెలియచేస్తున్నా... అన్నారు.

హీరో మానస్ మాట్లాడుతూ సీనియర్ కమెడియన్స్ అందరూ ఈ చిత్రలో ఉన్నారు... సినిమా పూర్తి స్ధాయి వినోదాత్మకంగా ఉంటుంది.. కుటుంబం మొత్తం హ్యాపీ గా కలసి చూసే సినిమా ఇది. పాలకొల్లు అందాలు, హైదరాబాద్ బ్యూటీ ఫుల్ లొకేషన్స్ లలో షూటింగ్ జరుపుకున్నాము.. భరత్ మ్యూజిక్ అద్భుతంగా అందించారు.. యూనిట్ సపోర్ట్ ఉంటే ఏ సినిమా అయినా బాగొస్తుందని రుజువయ్యింది.. ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. అతి త్వరలో విడుదల తేదీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తాం అన్నారు..

హీరోయిన్ నిత్య నరేష్, సహ నిర్మాత భువనగిరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మానస్, నిత్య నరేష్, కారుణ్య, బ్రహ్మానందం, అలీ, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి,

సహ నిర్మాత: భువనగిరి శ్రీనివాస్ మూర్తి, సంగీతం: భరత్, సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్, నిర్మాత: భువనగిరి సత్య సింధూజ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మల్లూరి హరిబాబు.

 


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved