శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న తిక్క చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే ఈ బ్యానర్‌పై నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా ప్రొడక్షన్ నెం.2 చిత్రాన్ని ఉగాది పర్వదినాన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
నిర్మాత సి.రోహిణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ``మా బ్యానర్‌కు సంబంధించిన వెబ్‌సైట్, సోషల్ మీడియా పోర్టల్‌ను ఈ ఉగాది రోజున స్టార్ట్ చేయడం ఆనందంగా ఉంది. మా బ్యానర్‌లో స్టార్ట్ చేసిన తిక్క సినిమా 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. వచ్చే సోమవారం మలేషియాలో జరగనున్న షెడ్యూల్‌తో షూటింగ్ టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంటాం. జూన్ మూడో వారం ఆడియో విడుదల చేసి, జూలైలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం.అలాగే మా బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా నవీన్ విజయ్‌కృష్ణతో సినిమాను చేస్తున్నాం. శశాంక్ యెలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు`` అన్నారు.
సాయిధరమ్ తేజ్ మట్లాడుతూ ``తిక్క సినిమా 70 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. హిలేరియస్ ఎంటర్ టైనర్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ బ్యానర్ రూపొందిస్తున్న రెండో చిత్రంలో నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయ్ కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శశాంక్ తెరకెక్కిస్తున్నాడు. తను కూడా నాకు మంచి ఫ్రెండ్. అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
సునీల్ రెడ్డి మాట్లాడుతూ ``సినిమా బాగా వచ్చింది. మంచి ప్రోగ్రెస్‌లో సినిమా వస్తుంది. యూనిట్ అంతా కష్టపడి చేస్తున్నాం. మే నెలలో సినిమాను పూర్తి చేసి జూలైలో సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
నవీన్ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ ``తిక్క టీజర్ చూశాను. సినిమా చాలా బాగా ఉంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. ఇదే బ్యానర్‌లో నేను సినిమా చేయడం ఆనందంగా ఉంది. నేను చేస్తున్న మూడో సినిమా. శశాంక్ చాలా మంచి స్క్రిప్ట్ చెప్పాడు. ఈ స్క్రిప్ట్ కోసం నన్ను హీరోగా తీసుకున్నందుకు తనకు, నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
శశాంక్ యెలేటి మాట్లాడుతూ ``సినిమా జూన్ నుండి సెట్స్‌లోకి తీసుకెళుతున్నాం. నవీన్ తో చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. తనతో చాలా కాలంగా మంచి పరిచయం ఉంది. తిక్క యూనిట్‌కు ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం కల్పించిన నిర్మాత రోహిణ్‌కుమార్ రెడ్డిగారికి థాంక్స్`` అన్నారు.