pizza
SK Basheed XYZ press meet
`ఎక్స్ వై జ‌డ్‌` థియేట‌ర్లు పెరిగాయి - ఎస్‌.కె.బ‌షీద్‌
\
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 July 2016
Hyderaba
d

ఎక్స వై జ‌డ్ అనే సినిమా శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ సినిమాకు ఎస్‌.కె.బ‌షీద్ ద‌ర్శ‌క‌నిర్మాత‌. ఈ సినిమా గురించి ఆయ‌న శ‌నివారం విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

బ‌షీద్ మాట్లాడుతూ ``తొలి రోజు మా సినిమాకు 47ల‌క్ష‌ల షేర్ వ‌చ్చింది. సోమ‌వారం నుంచి మ‌రో తొమ్మిది థియేట‌ర్లు పెరిగాయి. చిన్న చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుంచి స‌పోర్ట్ లేద‌న‌డం లేదు. కానీ ప‌రిశ్ర‌మ నుంచి మాత్రం లేదు. స్టార్లు న‌టించిన సినిమాల‌కు త‌ప్ప, ఓ మాదిరి సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌డానికి అంద‌రూ నిరాక‌రిస్తున్నారు. మ‌ల్టీప్లెక్స్ ల‌లో ఒక స్క్రీన్ కోసం ముంద‌స్తుగా డ‌బ్బు చెల్లిస్తామ‌ని చెప్పినా థియేట‌ర్లు కేటాయించ‌డానికి ముందుకు రావ‌డం లేదు. క‌థా బ‌ల‌మున్న చిన్న సినిమాల‌కు గుర్తింపు లేకుండా పోతోంది. ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో సంఘాలున్నాయి. అయితే వాటి వ‌ల్ల ఇంచు కూడా ఉప‌యోగం లేదు. సినిమా మీద ప్రేమ‌తో ప‌రిశ్ర‌మ‌కు వ‌స్తున్న నిర్మాత‌లు ఇబ్బందుల పాల‌వుతున్నారు`` అని చెప్పారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved