pizza
RP Patnaik Yenki Patalu press meet
ఎంకి పాట - ఆర్పీ నోట ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


26 March 2019
Hyderabad

ఎంకిపాట‌ల‌కు తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రాముఖ్యాన్ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను ప‌ల్లెప‌దాల‌తో నండూరి సుబ్బారావు అల్లిని తీరు ఇప్ప‌టి జ‌నాల‌నూ క‌ట్టిప‌డేస్తుంది. ఆ ఎంకీ నాయుడుబావ ప్ర‌ణ‌య‌గాథ‌ల‌ను మ‌రోసారి గుర్తుచేస్తున్నారు ఆర్పీ ప‌ట్నాయ‌క్‌. `ఎంకి పాట - ఆర్పీ నోట‌` అనే పేరుతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు . దాని గురించి ఆయ‌న ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. ఆ విశేషాలు...

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ``1917-18 ప్రాంతంలో మ‌ద్రాసు క్రిస్టియ‌న్ కాలేజీలో నండూరి సుబ్బారావు లా చేస్తున్న స‌మ‌యంలో ట్రామ్‌లో ప్ర‌యాణం చేస్తున్నప్పుడు ఆయ‌న మ‌న‌సులో ఓ ఆలోచ‌న మెదిలింది. గుండెగొంతుక‌లోన కొట్టాడుతాది, కూకుండ నీదురా కూసింత సేపు అని... తెలుగు సాహిత్యంలో అప్ప‌టిదాకా ఈ ప్ర‌యోగాన్ని ఎవ‌రూ వాడ‌లేదు. ఆ ప్ర‌యోగం ఎంత బ‌ల‌మైన‌దంటే ఆ పాట‌లు వ‌చ్చిన వందేళ్ల త‌ర్వాత కూడా మ‌నం మాట్లాడుకుంటున్నాం. ఆయ‌న రాసిన‌వి 78 పాట‌లే. 780 సంవ‌త్స‌రాలు నిలిచిపోయే పాట‌లు రాశారు. `ఎంకిపాట ఆర్పీ నోట‌` అనే ప్రాజెక్టులో ఆయ‌న పాట‌ల‌న్నీ రికార్డు చేయాల‌ని మొద‌లుపెట్టాను. చాలా మంది జాన‌ప‌ద‌గేయ‌మా, ప్రైవేట్ ఆల్బ‌మా అని అడిగారు. అన్న‌మ‌య్య కీర్త‌న‌లు భ‌క్తి ర‌సానికి సంబంధించి ఎంత గొప్ప‌గా చెప్పుకుంటామో, ప్రేమ, శృంగారానికి సంబంధించి తెలుగులో `ఎంకిపాట‌లు` మాత్ర‌మే ఉన్నాయి. ఒక క‌లెక్ష‌న్‌గా ఉన్న‌వి అవే. ఎంకీ నాయుడు బావ మ‌ధ్య ప్రేమ అద్భుతం. నేను ఈ పాట‌లు కంపోజ్ చేస్తున్న‌ప్పుడు లెజండ‌రీ చిత్రం `మ‌ల్లీశ్వ‌రి` సినిమాకు కంపోజ్ చేస్త‌న్న ఫీలింగ్ క‌లిగింది. అంత అద్భుత‌మైన ప్రేమ‌, దానికి సంబంధించిన భావ‌ప్ర‌క‌ట‌న న‌న్ను ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌తి పాదంలోనూ నాకు ఆ ప్రేమ క‌నిపించింది. నేను గుర్తించ‌గ‌లిగాను. ఎంకిపాట‌లు ఇంత ప్రాచుర్యం పొందాయంటే ... ఎందుకున్నాయా అని నేను కంపోజ్ చేస్తున్న‌ప్పుడు అర్థం చేసుకున్నా.

తూర్పు కాపు యాస‌లో రాసిన పాట‌లు ఇవి. ఒక సంద‌ర్భంలో నాయుడుబావ గురించి ఎంకి ఆలోచిస్తుంటుంది. నాయుడుబావ ఎక్కిడికి వెళ్తే అక్క‌డికి అత‌ని నీడ కూడా వెళ్తుంది క‌దా. అలాంట‌ప్పుడు ఎంకి ` ఆ నీడంత క్లోజ్ కాదా నేను నీకు` అని అనుకుంటుంది. అలాంటి ఎక్స్ ప్రెష‌న్స్ కూడా ఎవ‌రైనా ఆలోచిస్తారా? అని ఆశ్చ‌ర్య‌పోయా. ఆ ప్రేమ‌లో ఉండే రెండు మ‌న‌సులు, రెండు ఆత్మ‌ల మ‌ధ్య ఉన్న ప్రేమ క‌థ ఇది. మ‌న‌కి దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌ధ్య‌లో రెండు జ‌న‌రేష‌న్స్ ఎంకిపాట‌ల‌కు దూర‌మ‌య్యారు.

కానీ ఈ పాట‌లు త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని న‌న్ను ఎంక‌రేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్‌కి ధ‌న్యావాలు. యూనిక్ స్టైల్‌లో ఈ పాట‌ల‌ను ప్లాన్ చేశాం. ఫ‌స్ట్ షెడ్యూల్‌ని ఈ రోజు నుంచి మొద‌లుపెడుతున్నాం. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే 15 సినిమాల ప్రాజెక్ట్ ఇది. అందుకు ఎవ‌రైనా ఎంకి అంటే ద‌య‌చేసి ప్రైవేట్ ఆల్బ‌మా అని ఎవ‌రూ అన‌వ‌ద్దు. 78 పాట‌లు ఒకేసారి విడుద‌ల చేయ‌లేం కాబ‌ట్టి ఫేస్ బై ఫేస్ ఏడాదిలో ఈ పాట‌ల‌న్నీ విడుద‌ల చేస్తాం.

తెలుగు సాహిత్యానికి అంద‌మైన సాహిత్యం అందించిన నండూరి సుబ్బారావుగారికి జెన్యూన్‌గా మేం చేసే ప‌ట్టాభిషేకం `ఎంకి పాట - ఆర్పీ నోట‌`. ఈ ప్రాజెక్ట్ కి మా అన్న‌య్య గౌత‌మ్ ప‌ట్నాయ‌క్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. నేనూ, అన్న‌య్యా క‌లిసి చేస్తాం. కంపోజ్‌, సింగింగ్ నేను చేస్తాం. నాయుడుబావ వైపు పాట‌ల‌న్నీ నేను పాడుతాను. ఎంకి స్వ‌రానికి నండూరి సుబ్బారావుగారి మ‌న‌వ‌డి కూతురు.. ఆయ‌న సొంత ర‌క్తం శ్రుతి నండూరి పాడ‌తారు. ఇలా ఎంకీ, నాయుడుబావ‌కు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ను అంద‌రి ముందుకు తీసుకొస్తాం. మీడియా, యూత్ అంద‌రూ ఆద‌రించాలి. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాన్ని చేయ‌డానికి అన్ని ర‌కాలుగా చేయూత‌నిచ్చిన ఆదిత్య వారికి థాంక్స్. హోప్ యు లైక్ దిస్ ప్రాజెక్ట్.

ఏదో కాపీ రైట్స్ ప్రాబ్ల‌మ్స్ కోసం నండూరి శ్రుతిని నేను ఎంపిక చేసుకోలేదు. ఆమె బేసిక‌ల్‌గా చాలా మంచి సింగ‌ర్‌. నేను ఇలా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాన‌ని తెలియ‌గానే శ్రుతి మ‌ద‌ర్ ల‌క్ష్మీగారు న‌న్ను అప్రోచ్ అయ్యి `మేం చేయాల‌నుకున్నామండీ. మీరు చేసేస్తున్నారే` అని ఒక చిన్న ఈర్ష్య‌ను వ్య‌క్తం చేశారు. `ఎంకి పాట‌లంటే నాయుడుబావ పాడేవండీ. అమ్మాయిలు చేస్తే ఏం బావుంటుందీ` అని అన్నా. అన్నాక ఎంకి పాడే కొన్ని వెర్ష‌న్స్ ఉన్నాయి.. వాటికి అమ్మాయి స‌రిపోతుందేమో చూస్తాను. వాయిస్ న‌చ్చితేనే ఓకే చేస్తాను అని అన్నా. వాయిస్ పంపారు. నేనూ, అన్న‌య్య‌ ఇద్ద‌రం విన్నాం. మాకు న‌చ్చింది. అమ్మాయి న్యూజెర్సీలో ఉంటుంది. నా ఫ్రెండ్ ఫ్ర‌సాద్ అని అక్క‌డుంటారు. అత‌ను పాట‌ల‌ను రికార్డ్ చేసి పంపారు. స్కైప్ ద్వారా రికార్డ్ చేశాం. ఔట్‌పుట్ చూస్తే ఆ అమ్మాయి శ్రేయా ఘోష‌ల్‌కి ఏ మాత్రం తీసిపోదు అని తెలిసింది. నేను ఎవ‌రి గురించీ అతిశ‌యోక్తి చెప్ప‌ను. మీరు వింటారు కాబ‌ట్టి మీరే అర్థ‌మ‌వుతుంది. మామూలుగా ఉగాదికి అని అనుకున్నాం. కానీ ఏప్రిల్ 11న ఎన్నిక‌లున్నాయి. అందువ‌ల్ల అంద‌రి దృష్టి దాని మీదే ఉంటుంది. ఏప్రిల్ 11న మేకింగ్ వీడియో విడుద‌ల చేసి, ఎన్నిక‌లు పూర్తి కాగానే మంచి రోజు చూసుకుని ఫ‌స్ట్ బంచ్ విడుద‌ల చేస్తాం. కొన్ని పాట‌లు ఇందులో ఒక‌టిన్న‌ర నిమిషం ఉన్న పాట‌లున్నాయి. నాలుగున్న‌ర నిమిషాల పాట‌లున్నాయి. ప్ర‌తి పాటా సినిమా పాట స్థాయిలోనే ఉంటుంది. ఈ పాట‌ల్లో మేం ఆయ‌న రాసిన అక్ష‌రాల‌ను మార్చ‌లేదు. ఒక్క అక్ష‌రం మార్చినా ఉరిశిక్ష తీసినంత నేర‌మ‌వుతుంది. యాజ్ ఇట్ ఈజ్‌గా ఉన్న మాట‌ల‌ను ఉన్న‌ట్టుగానే వాడాం. 78 పాట‌ల‌ను ఇంత‌కు ముందు సినిమాలో ఎవ‌రైనా పెట్టారేమో నాకు ఐడియా లేదు. కానీ ఆయ‌న బ‌తికుండ‌గా కొన్నిటిని రేడియో పాడారు. మ‌ళ్లీ వాటిలో కొన్నిటినీ బాల‌ముర‌ళీకృష్ణ‌గారు జ‌నాల్లోకి తీసుకెళ్లారు. కానీ నేను కంపోజిష‌న్ ప‌రంగా ఇవాళ్టి యూత్‌ని ఆక‌ట్టుకునేలా చేశాను. నా స్టైల్‌లో ల‌వ్వుని, జాన‌ప‌దాన్ని మిక్స్ చేసి చేశాం. పెద్ద‌వాళ్లు చేసిన దానిలో క్లాసిక‌ల్ ట‌చ్ ఎక్కువ‌గా ఉంది.దాని వ‌ల్ల సింగ‌ర్స్ బాగా పాడుకోవ‌చ్చు, కానీ కామ‌న్ పీపుల్ బాగా పాడుకోలేరు. కానీ పాట‌లు రాని వాళ్లు కూడా పాడుకునేలా ఉండాల‌ని సింపుల్ కంపోజిష‌న్స్ చేశాం. అన్నీ పాట‌ల‌కూ విజువ‌ల్స్ కూడా ఉంటాయి. ఫ‌స్ట్ లుక్ ఎలా ఉంటుందో, పాట‌ల‌న్నీ అలాగే ఉంటాయి. 1920 ఫ్లేవ‌ర్ ఉంటుంది.

ఇందులో విజువ‌ల్స్ కోసం మేం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ముఖ్యంగా అమ్మాయి పాత్ర‌ల కోసం 200 అమ్మాయిల‌ను చూశాం. తెలుగు అమ్మాయిల‌ను చాలా మందిని అడిగాం. కానీ బ్లౌజ్ వేసుకోకుండా చేయ‌డానికి ఎవ‌రూ ఒప్పుకోలేదు. అంత‌శిల హీరోయిన్‌. క‌ల‌క‌త్తా అమ్మాయి. ప్రశాంత్ ప్రాణం ఖ‌రీదులో హీరో. ఇందులో నాయుడుబావ‌గా చేస్తున్నారు. ఇప్పుడు ఏడాది పాటు ఆయ‌న ప్ర‌తి నెలా నాయుడుబావ‌గా ప‌ల‌క‌రించ‌డానికి వ‌స్తున్నారు.

ఎంకి పాట‌ల గురించి చాలా సార్లు విన్నా. కానీ ఎప్పుడూ దాన్ని పాట‌లుగా చేయాల‌నే ఆలోచ‌న రాలేదు. ఈ మ‌ధ్య ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో ఎంకి పాట‌ల బుక్ క‌నిపించింది. ఫ‌స్ట్ పేజీ తిప్ప‌గానే సాహిత్యం చూశాను. నాకు పాట‌లు చూడ‌గానే ఈజీ కంపోజిష‌న్‌కు ఉన్నాయి. ఇంద్ర‌గంటి శ‌ర్మ‌గారికి ఫోన్ చేసి `గురువుగారూ నేను ఇలా ఎంకి పాట‌ల‌ను చేయాల‌నుకుంటున్నాను. నాకు 78 పాట‌లు దొరికాయి. ఇంకేమైనా ఉన్నాయా` అని అడిగా. `ఆయ‌న రాసిన‌వి అన్నే` అని ఆయ‌న చెప్పారు. వెంట‌నే ఆథంటిక్‌గా చేశాం. మ్యూజిక‌ల్గా న‌న్ను అంద‌రూ కాక‌పోయినా, కొంద‌రైనా మిస్ అవుతున్నార‌ని తెలుసు. వాళ్ల‌కి ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను రీచ్ అవుతా. ఇప్ప‌టికి 25 పాట‌లు చేశాను. ఇంకా చేస్తాను. నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన సినిమా వ‌స్తే సంగీతం చేయ‌డానికి నేనెప్పుడూ సిద్ధ‌మే. కాక‌పోతే ఒక‌రేంజ్ హీరోలు అయితే వెంట‌నే ఒప్పుకోవ‌డానికి సిద్ధ‌మే. సంగీతానికి ఇంపార్టెన్స్ ఉన్నప్రాజెక్టులైతే ఇంకా హ్యాపీ. కొంత‌మంది ద‌ర్శ‌కులు నేను కూడా ద‌ర్శ‌కుడిని కాబ‌ట్టి, వాళ్ల ప్రాజెక్టుల్లో నేను వేళ్లుపెడ‌తానేమోన‌ని అనుకుంటారేమో. నేను ఛీఫ్ టెక్నీషియ‌న్‌గా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆలోచ‌న‌ల్లో నేను వేలుపెట్ట‌ను.

హీరోయిన్ మాట్లాడుతూ ``నాకు ఈ క్యార‌క్ట‌ర్ గురించి ఐడియా లేదు. నేను తొలిసారి హైద‌రాబాద్‌కి వ‌చ్చాను. ఈ కేర‌క్ట‌ర్ గురించి, అది పొందిన ప్రాచుర్యం గురించి నాకు తెలియ‌దు. కానీ ద‌ర్శ‌కుడు చాలా బాగా చెప్పారు. ఆ వేష‌ధార‌ణ‌, క‌ట్టూబొట్టూ చూసిన త‌ర్వాత అంద‌మైన మ‌హిళ అని అర్థం చేసుకున్నా. అంతా అర్థ‌మైన త‌ర్వాత నాకు కేక్‌వాక్‌లాగా అనిపించింది. ఆమెలాగా న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. నాకు భ‌ర‌త‌నాట్యం బాగా తెలుసు. నేర్చుకున్నా. అది నాకు షూటింగ్‌లో ఉప‌యోగ‌ప‌డుతోంది. నేను బెంగాల్‌లో చాలా కాలంగా చేస్తున్నా. ఇక్క‌డ కొన్ని పాట‌ల‌కు ప‌నిచేశాక వీళ్లు డీటైలింగ్‌కి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను`` అని అన్నారు.

హీరో మాట్లాడుతూ ``నాయుడుబావ కేర‌క్ట‌ర్‌కు నువ్వు చేస్తావా అని అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ త‌ర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇదేమీ సినిమా క‌న్నా త‌క్కువ కాదు. ఎంత పెద్ద‌గా వాళ్లు ప్లాన్ చేస్తున్నారో వివ‌రించి చెప్పారు. లొకేష‌న్ల గురించి వాళ్లు తిరిగిన‌వ‌న్నీ తెలిశాయి. 78 పాట‌లంటే త‌క్కువ విష‌యం కాదు. అన్ని పాట‌ల‌ను చేద్దామ‌ని అనుకోవ‌డ‌మే గొప్ప‌. రెండు జ‌న‌రేష‌న్‌ల‌కు డిస్క‌న‌ట్ అయిన‌దాన్ని మ‌ళ్లీ తీసుకొద్దామ‌ని అనుకుంటున్నామ‌ని ఆర్పీగారు చెప్పిన‌ప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్ర‌తి ఫ్రేమూ పెయింట్‌లాగా అనిపించింది. ఆరాధ్య‌నీయ‌మైన థాట్ అది`` అని అన్నారు.

ఆదిత్య నిరంజ‌న్ మాట్లాడుతూ ``మా ఆదిత్య ఉమేష్‌గారు సంగీత అభిమాని. ఆ అభిమానంతోనే సంగీతాన్ని ఎంక‌రేజ్ చేస్తారు. ఆయ‌న‌కు ఆర్పీగారితో మాట‌ల్లో చెప్ప‌లేని అనుబంధం ఉంది. ఆర్పీగారు చేసిన సినిమాల్లో 95 శాతం మా ద‌గ్గ‌రే ఉన్నాయి. ఆర్పీగారు, ఆయ‌న సోద‌రుడు ఎప్పుడూ మాతో క‌లుస్తూ ఉంటారు. ఒక‌సారి అనుకోకుండా `నేను ఇలాంటి ప్రాజెక్ట్ చేయాల‌నుకుంటున్నాను` అని అన్నారు. `ఓకే అన్నా కేరియాన్‌. చేద్దాం` అని అన్నా. మా సార్‌తోనూ చెప్పా. ప‌రిశోధ‌న చేసి ముందుకు తీసుకురావ‌డంతో వ‌చ్చే త‌రాల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది అని అన్నా. వెంట‌నే ఓకే అయి వ‌ర్క్ మొద‌లైంది. ఆర్పీగారు ఎన్ని ప్రాజెక్టులు చేసినా మేం ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తాం. ఆర్పీగారి మ్యూజిక్‌ను ప‌బ్లిక్ మిస్ అవుతున్నారు. దీంతో మ‌ళ్లీ ఆయ‌న క‌మ్‌బ్యాక్ అవుతార‌నే న‌మ్మ‌కం ఉంది`` అని అన్నారు.

ఆదిత్య మాధ‌వ్ మాట్లాడుతూ ``ఇవాళ్టి జ‌న‌రేష‌న్స్ కు ఎంకి అంటే ఏంటో తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ నాకు ఎంకీ-నాయుడుబావ గురించి బాగా తెలుసు. తెలుగులో ప‌ల్ల‌టూరి ప‌దాల స్వ‌చ్ఛ‌ద‌న ఈ పాట‌ల్లో ఉంటుంది. ఆ విష‌యాన్నే మేం మా బాస్‌కు చెప్పాం. ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టీజియ‌స్‌గా ముందుకు తీసుకెళ్తాం`` అని చెప్పారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved