pizza
Yevaru on 26 Aug
ఆగ‌స్ట్ 26న విడుద‌ల‌వుతున్న `ఎవ‌రు`
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 August 2016
Hyderaba
d

క్రాంతి చిత్ర బ్యానర్ పై శేఖర్, యాచమిని, చందు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `ఎవరు`. తారకరత్న కీలక పాత్రలో నటిస్తున్నారు. రమణ సెల్వ దర్శకత్వంలో ముప్ప అంకమ్మ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 26న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో పాత్రికేయుల స‌మావేశం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో నారారోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

నారా రోహిత్ మాట్లాడుతూ ``ట్రైల‌ర్ చాలా బావుంది. తారక్‌ర‌త్న‌కు మ‌రో మంచి హిట్ వ‌స్తుంద‌ని భావిస్తున్నాను.యోగేశ్వ‌ర శ‌ర్మ మంచి మ్యూజిక్ అందించారు. హ‌ర్ర‌ర్ చిత్రాల ట్రెండ్ న‌డుస్తున్న ఇప్పుడు విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం పెద్ద స‌క్సెస్‌ను సాధిస్తుందనుకుంటున్నాను`` అన్నారు.

తార‌క‌ర‌త్న మాట్లాడుతూ ``ద‌ర్శ‌క నిర్మాత‌లు మంచి సినిమా కోసం చేసిన ప్ర‌య‌త్నం. యోగేశ్వ‌ర శ‌ర్మ నా ఫేవ‌రేట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యాడు. అంత మంచి సంగీతాన్ని ఇచ్చాడు. సినిమా ఈ నెల 26న విడుద‌ల‌వుతుంది. మా యూనిట్‌ను ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం`` అన్నారు.

నిర్మాత ముప్పా అంక‌మ్మ చౌద‌రి మాట్లాడుతూ ``క‌థ‌, క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. మంచి టీం కుదిరింది. తార‌క‌ర‌త్న త‌న న‌ట‌న‌తో ప‌రిపూర్ణ‌త్వాన్ని చేకూర్చారు. మా సినిమాకు క‌థే నాయ‌కుడు, ప‌త్రినాయ‌కుడుగా ఉంటుంది. మంచి చిత్రాన్ని అందించాల‌ని చేసిన ప్ర‌య‌త్నం. ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాం. మా సినిమాను స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: యోగేశ్వర శర్మ, కో ప్రొడ్యూసర్: లింగ శ్రీనివాసరావు, కోరియోగ్రఫీ: శ్రీధర్ రెడ్డి యర్వ, ప్రొడ్యూసర్: ముప్ప అంకమ్మ చౌదరి, కథ-దర్శకత్వం-సినిమాటోగ్రఫీ: వెంకటరమణ సెల్వ.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved