pizza
RGV Journey - Shiva to Vangaveeti
`శివ టు వంగ‌వీటి` వేడుక‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 December 2016
Hyderaba
d

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వంగవీటి'. జీనియస్‌, రామ్‌లీల వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్‌ రూపొందించిన 'వంగవీటి' చిత్రం డిసెంబర్‌ 23న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా 'శివ టు వంగవీటి ది జర్నీ ఆఫ్‌ రామ్‌ గోపాల్‌ వర్మ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్‌ జెఆర్‌ సీ కన్వెషన్‌ హాల్‌ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున వెంకటేష్‌ సహా పూరి జగన్నాథ్‌, గుణశేఖర్‌, వై.వి.ఎస్‌.చౌదరి, వంశీ పైడిపల్లి, జీవిత, డా.రాజశేఖర్‌ సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా...

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''అమితాబ్‌ బచ్చన్‌ గారు ఈ ఫంక్షన్‌కి రావాలి కానీ...ఫ్లైట్‌ ప్రాబ్లమ్‌ ఇవ్వడం వలన ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. యాక్టర్స్‌ అందరూ ఎంతో కొంత అమితాబ్‌ గార్ని రీచ్‌ అవ్వాలని ట్రై చేస్తుంటాం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాము నాకు ఒక బ్రదర్‌లా..ఒక ఫ్రెండ్‌లా ఫీలవుతుంటాను. అన్నింటికంటే నాకు రాము ఫ్రెండ్‌గా బాగా ఇష్టం. నాకు కథ చెబుతానని వచ్చినప్పుడు వోడ్కా తాగి తర్వాత కథ చెప్పేవాడు. అంతం కథ చెప్పేటప్పుడు కత్తితో పొడిచే సీన్‌ ఏక్ట్‌ చేసి మరీ చూపించాడు. ప్రతిదీ ఫీలై చెబుతాడు. వర్మకు శివ సినిమాతో నేనేదో బ్రేక్‌ ఇచ్చాను అంటున్నారు కానీ...నేను అలా ఫీలవడం లేదు. ఒకరికి ఒకరం ఇచ్చిపుచ్చుకున్నాం. రాముతో మాట్లాడే ప్రతిక్షణాన్ని బాగా ఎంజాయ్‌ చేసేవాడిని. నేను ఫస్ట్‌ లో చాలా మందితో కనెక్ట్‌ అయ్యేవాడిని కాదు. కానీ రాము నేను నక్షత్రాలు గురించి బ్రూస్‌ లీ గురించి బాగా మాట్లాడుకునేవాళ్లం. దాంతో మా ఇద్దరికి బాగా కనెక్ట్‌ అయ్యింది. ఆ కన్షెన్‌తో రాముపై కాన్ఫినిడెన్స్‌ వచ్చింది. దానిని రాము నిలబెట్టుకున్నాడు. శివ సినిమా అనేది లైఫ్‌ చేంజింగ్‌ మూమెంట్‌ ఫర్‌ మీ. తెలుగు సినిమాని మార్చేసిన సినిమా. ఇండియాలో 100 బెస్ట్‌ మూవీస్‌ సెలెక్ట్‌ చేస్తే అందులో శివ ఉంది. అలా జరగడం వెరీ రేర్‌. ఇప్పుడు రాజమౌళి బాహుబలితో సంచలనం స ష్టించాడు. నా లైఫ్‌లో ఉన్నందుకు రాముకు థ్యాంక్స్‌ చెబుతున్నాను. నాతో శివ 2 తీద్దామని చాలా మంది వచ్చారు. రాము తీస్తానంటే చేయడానికి నేను రెడీ'' అన్నారు.

విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ - ''వంగవీటి ట్రైలర్‌ అవుట్‌ స్టాండింగ్‌గా ఉంది. శివ సినిమా తర్వాత నాతో శివ లాంటి సినిమానో, దాని బాబులాంటి సినిమానో తీస్తాడు అనుకుంటే వేరే జోనర్‌లో క్షణక్షణం తీశాడు. నాగ్‌తో చైన్‌ పట్టించాడు. నా సినిమాలో నన్నుపక్కన కూర్చొబెట్టి సాంగ్‌ అంటూ శ్రీదేవితోనే షూటింగ్‌ చేసేవాడు. నువ్వు ఫీలయ్యావా అని అడిగాడు లేదు ఎంజాయ్‌ చేశానని చెప్పాను. మిగిలిన హీరోలందరం ఎన్ని ఫైట్స్‌ చేసినా నాగ్‌గాడు ఒక్క ఛైన్‌ తీసి మొత్తం కొట్టేసాడ్రా అనుకునేవాళ్లం. శివ తర్వాత నుంచి ఫైట్స్‌ స్టైలే మారిపోయింది. రాముతో వండర్‌ ఫుల్‌ జర్నీ'' అన్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ - ''అమితాబ్‌గారు రావాల్సిఇంది కానీ ఫ్లైట్‌ ప్రాబ్లమ్‌ వలన రాలేకపోయారు. నా లైఫ్‌లో ముఖ్యమైన అమితాబ్‌, నాగార్జున ఇదరూ ముఖ్యమైనవారే. వంగవీటి అనేది నేను విజయవాడలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఉన్నప్పుడు చూసిన ఘటనలతో పాటు మరికొన్ని ఘటనలు గురించి తెలుసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. విజయవాడలో జరిగిన గొడవల నేపధ్యంతో శివ తీశాను. కానీ శివ సినిమాకి వంగవీటికి సంబంధం లేదు. వంగవీటి చిత్రంలో ఎంత చిన్న రోల్‌ అయినా సరే ఆ క్యారెక్టర్‌ గురించి డీటైల్‌ గా ఉంటుంది. నాగార్జున గురించి చెప్పాలంటే ఇండియాలోనే ఎలాంటి ఎక్స్‌ పీరియన్స్‌ లేకుండా సినిమా తీయడానికి నాకు డైరెక్టర్‌గా నాగార్జున అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు చెన్నైలో ఏదో స్ట్రైక్‌ జరుగుతుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చేయాలి అంటే ఇళయరాజాగారు ముంబాయిలో చేద్దాం అన్నారు. అప్పుడు నాగార్జునకి చెబితే కావాలంటే నా రెమ్యూనరేషన్‌ ఇవ్వద్దు రాముకి కావాల్సింది ఇవ్వండి అని ఎంతగానో నన్ను సపోర్ట్‌ చేసారు. ప్రపంచంలోనే నాగార్జున లాంటి హీరో, నిర్మాత మరొకరు లేరు. ఇక నుంచి నీమీద, నాగార్జున మీద ఓట్టు ఏసి చెబుతున్నాను ఇక నుంచి నా సినిమాలు అందరూ గర్వపడేలా ఉంటాయి'' అన్నారు.

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ - ''నేను చెన్నైలో ఉన్నప్పుడు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేవాడిని. రాముగారికి అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ గుడ్‌ మార్నింగ్‌ చెప్పడం ఇష్టం ఉండదు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత రాముగారిని కలవాలని... ఆయనకు గుడ్‌ మార్నింగ్‌ చెప్పడం ఇష్టం ఉండదు కదా...అలా చెప్పకుండా హాలో సార్‌..అని విష్‌ చేయడం ఎలా అని ఓ 100 సార్లు ప్రాక్టీస్‌ చేశాను. రాముగారు శివతో ఎంతో మందిని ఇన్‌ స్పైర్‌ చేసారు. ఆయన సినిమాలు తీసి తీసి మధ్యలో ఐస్‌ క్రీమ్‌, అడవి అంటూ సినిమాలు తీసారు. రాము గారితో అంతగా పరిచయం లేదు. గత మూడేళ్లుగా డైరెక్ట్‌ గా పరిచయం ఉంది. అయితే ఐస్‌క్రీమ్‌ లాంటి సినిమాలు ఎందుకు తీస్తారు అని అడిగాను. దానికి ఏదో చెప్పారు కానీ అర్ధం కాలేదు. ఈ సినిమా విషయానికి వస్తే రాము గారు ఈ సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన ప్రేమించి తీసిని సినిమా అనిపిస్తుంది. ఆర్‌ జీ వి ఈజ్‌ బ్యాక్‌ అనిపిస్తుంది. వంగవీటి ఈజ్‌ బ్యాక్‌. ఈ సినిమాలోని పాటల్లో మరణం సాంగ్‌ చాలా బాగుంది. సాంగ్స్‌ విజువల్స్‌ నన్నునిజంగా టచ్‌ చేసాయి. వంగవీటి బిగ్‌ హిట్‌ అవ్వాలని ఆశిస్తున్నాను. ట్రైలర్‌ చూస్తుంటే ఓరిజినల్‌ క్యారెక్టర్స ని చూసిన ఫీల్‌ కలుగుతుంది'' అన్నారు.

Glam galleries from the event
 

టి.డి.పి నాయకుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ - ''రాముగారి సినిమాలు శివ చూస్తే శివ అవ్వాలి అనిపిస్తుంటుంది. సత్య సినిమా చూస్తే జెడి చక్రవర్తి అవ్వాలి అనిపిస్తుంటుంది. సర్కార్‌ చూస్తే అమితాబ్‌లా ఉండాలి అనిపిస్తుంటుంది. అంతలా రాముగారి సినిమాలు ప్రభావం చూపిస్తాయి. రాముగారు తెలుగులో సినిమాలు తీయాల్సిందే మనం చూడాల్సిందే. వంగవీటి యూనిట్‌కు నా శుభాకాంక్షలు'' అన్నారు.

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''స్టూడెంట్స్‌ గా ఉన్నప్పుడు శివ చూశాం. మమ్మల్ని ఎంతగానో ఇన్‌ స్పైయిర్‌ చేసారు. ఒక గాడ్‌ ఫాదర్‌ని అయినా సరే అద్భుతంగా చూపించాలి అంటే వర్మగారి తర్వాతే. శివ చూసినప్పుడు చాలా మంది స్టూడెంట్స్‌పై ప్రభావం పడింది. శివ వర్మగారి ఫస్ట్‌ సినిమా ఇది నిజం. వంగవీటి వర్మగారి ఆఖరి సినిమా కాదు ఇది అబద్దం కావాలి'' అన్నారు.

డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''శివ సినిమా వచ్చినప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. శివ సినిమాలో సైకిల్‌ చైన్‌ తీయగనే థియేటర్స్‌లో విజుల్స్‌. చిన్నా రాడ్‌ ఇవ్వారా అనగానే విజిల్స్‌..శివ అనే మాట వినబడితే చాలు విజిల్సే. ప్రతి డైరెక్టర్‌ మీద వర్మగారి ప్రభావం ఉంది'' అన్నారు.

నిర్మాత పివిపి మాట్లాడుతూ - ''వంగవీటి సినిమా చూశాను. ఈ సినిమాలో ప్రతి సీన్‌ని చాలా డీటైల్‌గా చెప్పారు. 30 సంవత్సరాల విజయవాడ హిస్టరీని తెరకెక్కించినందుకు వర్మగారికి థ్యాంక్స్‌'' అన్నారు.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''ఇండస్ట్రీకి ఒక్కడు వచ్చి సంచలనం స ష్టించాడు వాడే రామ్‌ గోపాల్‌ వర్మ. నేను 25 ఏళ్లుగా రాము గారితో కాపురం చేస్తున్నాను అయినా ప్రేమ తగ్గలేదు. వంగవీటి సినిమా 40 నిమిషాలు చూశాను. అద్భుతమైన సినిమా. కొన్ని సీన్స్‌ చూస్తుంటే కళ్లంట నీళ్లు వచ్చాయి. విజయవాడవాళ్లు ఎంజాయ్‌ చేసే సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన వాళ్లు సూపర్‌ స్టార్‌లు అవుతారు'' అన్నారు.

డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ - ''నేను డైరెక్టర్‌ అవ్వడానికి కారణం వర్మగారు. నాకు వర్మ గారు ఎప్పుడూ హీరోలా కనిపిస్తారు. చాలా మందికి వర్మ గారు డైరెక్టర్‌ కానీ...నాకు ఆయన హీరో. ఏ హీరో డైలాగ్‌ తీసుకున్నా అది వర్మ గారికి కరెక్ట్‌ గా సరిపోతుంది. నాకు కొంచెం తిక్క ఉంది దానికో లెక్క ఉంది ఈ డైలాగ్‌ వర్మగారికి కరెక్ట్‌ గా సరిపోతుంది. నేను ఏదోలా బతికేయడానికి రాలేదు ముంబాయిని ఉచ్చ పోయించడానికి వచ్చాను ఈ డైలాగ్‌ కూడా వర్మ గారికి కరెక్ట్‌ గా సరిపోతుంది. సినిమాలును మించి ఎదిగారు వర్మగారు. ఎలా పడితే అలా బతకే మనిషి వర్మ గారు. ఆయనలా బతకాలి అనుకుంటారు కానీ..ఎవరికీ కుదరదు అన్నారు.

డైరెక్టర్‌ బి.గోపాల్‌ మాట్లాడుతూ - ''శివ సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. శివ రిలీజ్‌ తర్వాత సైకిల్‌ చైన్‌ స్టైల్‌ అయ్యింది. రాము స్టడీ కామ్‌, సౌండ్‌కి ఇంపార్టెన్స్‌ తీసుకువచ్చాడు. మా రాము ఓ అద్భుతమైన డైరెక్టర్‌. ఎన్నో సూపర్‌ హిట్స్‌ తీశాడు. ఇంకా చాలా సినిమాలు తీయాలి. రామును చూసి గర్వపడతాం. భగవంతుడు రాముని గొప్ప సినిమాలు తీయమని ఈ భూమి మీదకు పంపించాడు అనుకుంటాను. రాము సినిమాలు తీయడం మానేస్తే నేను, నీ శిష్యులు అందరితో కలిసి సైకిల్‌ చైన్‌ లు తీసుకుని నీ ఇంటికి వస్తాం. నా రాము సక్సెస్‌ క్రెడిట్‌ నాగార్జునగారికే చెందుతుంది. చాలా మంది దర్శకులకు లైఫ్‌ ఇచ్చిన దేవుడు నాగార్జునగారు. వంగవీటి పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్‌''్ట అన్నారు

గుణశేఖర్‌ మాట్లాడుతూ - ''శివ నుంచి వంగవీటి వరకు కాదు...వర్మ గారి ప్రయాణం ఇంకా ఇంకా ముందు సాగాలని అని కోరుకుంటున్నాను. ఆయనతో పాటు 2 అడుగులు వేసే అవకాశం కలిగింది. ఆయన సినిమాలు చూసి ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. వంగవీటి తెలుగులో వర్మ గారి ఆఖరి చిత్రం కాదు...వర్మ గారు తెలుగులో సినిమాలు తీయడం ఆపేస్తే నిరాహార దీక్ష చేస్తాం. శివ చూసి ఎలాగైతే ఇన్‌ స్పైయిర్‌ అయ్యామో వంగవీటి చిత్రం కూడా మమ్మల్ని ఇన్‌ స్పైయిర్‌ చేసేలా ఉంటుంది అని ఆశిస్తున్నాను'' అన్నారు.

హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ - ''శివ రిలీజ్‌ అయినప్పుడు యూత్‌ పై బాగా ప్రభావం చూపించింది. ఇప్పటి వరకు లైఫ్‌ లో జరిగిన సంఘటనలతో వర్మ గారు సినిమాలు తీసారు. ఫ్యూచర్‌ లో వర్మగారి మీద సినిమాలు తీస్తారు అనుకుంటున్నాను'' అన్నారు.

వై.వి.ఎస్‌ చౌదరి మాట్లాడుతూ - ''సినిమా ఫీల్డ్‌ కి రావడం అద ష్టం అంటారు. ఈ స్టేజ్‌ పై మాట్లాడడం ఇంకా అద ష్టం అంటాను. నేను ఎన్టీఆర్‌ స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చాను. నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే... దర్శకుడిగా జన్మనిచ్చింది నాగార్జున గారు. నాగార్జున గార్కి జీవితాంతం రుణపడి ఉంటాను. నాగార్జున గారికి సెల్యూలాయిడ్‌ సైంటిస్ట్‌ అని పేరు పెట్టుకున్నాను. నాగార్జున గారు కొత్త వాళ్లను పరిచయం చేయడానికి శక్తి ఇచ్చింది రామ్‌ గోపాల్‌ వర్మ గారు. నాగార్జున గారు మనిషిని మనిషిగా చూస్తారు. ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమాలు తీయడానికి ధైర్యం దమ్ము వర్మ గారికి ఉన్నాయి. గోవిందా గోవిందా సినిమాకి వర్మ గారి దగ్గర వర్క్‌ చేసాను. తెలుగులో వర్మ గారు ఖచ్చితంగా మరో సినిమా తీస్తారు. విజయవాడలో జరిగిన గొడవలు కథాంశంగా వంగవీటి సినిమా తీశారు. ఇలాంటి సినిమాలు తీయడం వర్మ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. వంగవీటి పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

వంశీ చాగంటి మాట్లాడుతూ - ``వంగ‌వీటితో వ‌ర్మ‌గారు నాకు డ్రీమ్ రీలాంచ్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా వ‌చ్చింది. దాస‌రి కిర‌ణ్‌కుమార్‌గారు వ‌ల్లే వంగ‌వీటి సినిమా చాలా బాగా వ‌చ్చింది. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌`` అన్నారు.

ఎస్‌.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ - ``వంగ‌వీటి టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ర‌ఘురామ‌రాజు మాట్లాడుతూ - ``ఆల్ ది బెస్ట్ టు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. శివ‌లాగా వంగ‌వీటి కూడా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ - ``వ‌ర్మ‌గారి సినిమాలు చాలా ప్ర‌భావితం చేస్తుంటాయి. చాలా మంది ద‌ర్శ‌కుల‌ను వ‌ర్మ‌గారు ఇన్‌స్పైర్ చేశాయి. వంగవీటి టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

డా. రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``రామ్‌గోపాల్ ఓ పెద్ద యూనివ‌ర్సిటీ. నేను కూడా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల‌ని శివ నుండి కోరిక ఉండేది. ఆ బ్రాండ్‌లో ఓ సినిమా చేసినా ఆ బ్రాండ్‌కు త‌గిన‌ట్టు లేద‌ని, నేనే ఆ సినిమా ఆపేశాను. నా బ్యాడ్ ల‌క్‌. నాకు గుడ్ ల‌క్ వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఆ సినిమాను పూర్తి చేస్తాను`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved