pizza
Hora Hori song launch at Radio Mirchi
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 July 2015
Hyderabad

రేడియో మిర్చిలో 'హోరా హోరీ' సాంగ్ విడుద‌ల‌

'అలా మొదలైంది, అంతకుముందు ఆ తరువాత' వంటి వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ 'శ్రీ రంజిత్ మూవీస్'. 'చిత్రం, నువ్వు నేను, జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు తేజ. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రమే ‘'హోరా హోరీ’’. నూతన,నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించి, విజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం దర్శకుడు 'తేజ' కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ చిత్రాన్నిఆయన నూతన,నటీ నటులతో నే మరోమారు తెరకెక్కించే ప్రయత్నం చేశారు.ఆయనకు అండగా నిర్మాత దామోదర్ ప్రసాద్ నిలిచారు.

'హోరా హోరీ' ...ఇదీ ప్రేమ కథా చిత్రమే. అయితే దర్శకుడు 'తేజ' దాన్ని తెరకెక్కించిన తీరు మాత్రం ప్రశంసనీయంగా ఉంటుందని చిత్రయూనిట్ సభ్యులు అంటున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. కోడూరి కళ్యాణ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఒక పాటను గురువారం రేడియో మిర్చిలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు కోడూరి కళ్యాణ్, మధుర శ్రీధర్, హీరో హీరోయిన్లు పాల్గొన్నారు. ఆడియో త్వరలోనే మధురు ఆడియో ద్వారా విడుదలవుతుందని తెలియజేశారు.

ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్; ఎడిటర్: జునైద్; కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ; స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్, కెవిన్; సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి ; నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్; కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved