pizza
Jayammu Nischayammuraa teaser song launch
`జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` ఫ‌స్ట్ లుక్ సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

5 October 2016
Hyderaba
d

శ్రీనివాస‌రెడ్డి, పూర్ణ హీరో హీరోయిన్లుగా ఎ.వి.ఎస్‌.రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శివ‌రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై శివ‌రాజ్ క‌నుమూరి ద‌ర్శ‌క‌త్వంలో శివ‌రాజ్ క‌నుమూరి, స‌తీష్ క‌నుమూరి నిర్మాత‌లుగు రూపొందుతోన్న చిత్రం `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా`. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ సాంగ్ విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లోజ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా....

సుకుమార్ మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడు శివ‌రాజ్‌ది మా ఊరే. ద‌ర్శ‌కుడు తాత‌గారితో నాకు చిన్న‌ప్ప‌ట్నుంచి అనుబంధం ఉంది. ఆయ‌న‌కు ఇప్పుడు తొంబై ఆరేళ్లు. ఇటీవ‌ల ఆయ‌న న‌న్ను క‌లిసిన‌ప్పుడు నా మ‌న‌వ‌డు సినిమా బాగా తీస్తున్నాడా అని అడిగాడు. నాకేమో సినిమా గురించిన వివ‌రాలు తెలియ‌వు. అయితే నేను శివ‌రాజ్ బాగా తీస్తున్నాడ‌ని చెప్పేశాను. ఇప్పుడు టీజ‌ర్‌లో ప్ర‌తి షాట్ చాలా బాగా ఉంది. హీరో హీరోయిన్లు మా మ‌ట్ట‌ప‌ర్రు పిల్ల‌ల్లాగే క‌నిపిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డితో సినిమా ఎందుక‌నిపించింది. కానీ ఇప్పుడు టీజ‌ర్ చూస్తుంటే ఈ క్యారెక్ట‌ర్‌ను శ్రీనివాస్‌రెడ్డి త‌ప్ప మరేవ‌రూ చేయ‌లేర‌నిపించింది. సినిమా పెద్ద హిట్ కావాలి. ద‌ర్శ‌కుడు శివ‌రాజ్‌కు నా బ్యాన‌ర్‌లో రెండో సినిమా అవకాశం ఇస్తున్నాను`` అన్నారు.

Glam gallery from the event

ద‌ర్శ‌కుడు శివ‌రాజ్ క‌నుమూరి మాట్లాడుతూ - నాకు చిన్న‌ప్ప‌ట్నుంచి సుకుమార్‌గారే ఇన్‌స్పిరేష‌న్‌. మా ఊర్లో ఫ‌స్ట్ సెల‌బ్రిటీ సుకుమార్‌గారే. నేను చ‌దువుకునే రోజుల్లో రాజోలులో ఎం.సెట్ కోచింగ్ సెంట‌ర్‌పెట్టి అంద‌రికీ మంచి ర్యాంకులు వ‌చ్చేలా చేశారు. అలాగే డైరెక్ష‌న్‌లో కూడా ఆయ‌నే నాకు ఇన్‌స్పిరేష‌న్‌. యు.కె.లో సంపాదించుకున్న డ‌బ్బుతో తీసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

పూర్ణ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. ఇప్ప‌టి వ‌ర‌కు న‌న్ను అంద‌రూ అవును పూర్ణ అనేవారు ఈ సినిమాతో జ‌య‌మ్మునిశ్చ‌య‌మ్మురా పూర్ణ అంటారు`` అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ - ``సినిమా బాగుండ‌టం కోసం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తీశారు. ద‌ర్శ‌కుడు శివ‌రాజ్‌కు ప్ర‌తి విష‌యం ప‌ట్ల మంచి క్లారిటీ ఉంది. సినిమాను క‌న్విక్ష‌న్‌తో తీశారు. కొత్త ద‌ర్శ‌కుడ‌నిపించుకోలేదు. సినిమా బాగా వ‌స్తుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మవుతుంది`` అన్నారు.

పోసాని, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ప్ర‌వీణ్‌, శ్రీవిష్ణు, ర‌వివ‌ర్మ‌, జోగి బ్ర‌ద‌ర్స్‌, జీవా, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి, కొరియోగ్ర‌ఫీః భాను, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ః కార్తీక్ రోడ్రిగ్వెజ్‌, మ్యూజిక్ః ర‌విచంద్ర‌, ఎడిట‌ర్ః ఎడిట‌ర్ వెంక‌ట్‌, సినిమాటోగ్ర‌ఫీః న‌గేష్ బానెల్‌, స్క్రీన్ ప్లేః శివ‌రాజ్ క‌నుమూరి, ప‌ర‌మ్ సూర్యాంశ్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః రామ్ మంతెన‌(మ‌ధు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః భాస్క‌ర్‌, నిర్మాత‌లుః శివ‌రాజ్ క‌నుమూరి, స‌తీష్ క‌నుమూరి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః శివ‌రాజ్ క‌నుమూరి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved