సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం '24 కిస్సెస్'. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకుడు. సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణం శెట్టి నిర్మాతలు. నవంబర్ 23న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో..
దర్శక నిర్మాత అయోధ్యకుమార్ కృష్ణం శెట్టి మాట్లాడుతూ - `` ప్రేక్షకులకు థాంక్స్. నైజాం సహా ఇతర ప్రాంతాల్లో కలెక్షన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. `మిణుగురులు` ఎలా తీశామో. ఈ సినిమాను కూడా అంతే జెన్యూన్‌గా తీశాం. టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమైయ్యే ఉంటుంది. పబ్లిసిటీ కోసం ఏదీ చేయలేదు. మా అమ్మతో కూర్చుని తొలి ఆట చూశాను. అలాగే మహిళా మండలి నుండి మరో ఇద్దరు కూడా ఆ షో చూశారు. ఎవరూ ఏమీ అనలేదు. సినిమాలో అశ్లీలం ఉందని ఎవరూ ఒప్పుకోరు. సినిమాలో అనవసరమైన వాటిపై ఆధారపడే ఫిలిమేకర్‌ని కాను. సినిమాలో చూపించిన ముద్దు కడా పొయెటిక్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది. రివ్యూ రాసిన వారి అభిప్రాయాన్ని... ప్రేక్షకుల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. సినిమాలో ల్యాగ్ అయిన సన్నివేశాలను ఎడిట్ చేశాం. థియేటర్స్‌తో పాటు.. డిజిటల్ మీడియాలో లెటెస్ట్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. మంచి అభిప్రాయాలను తీసుకుని ఎడిట్ చేశాం. రేపు టీవీల్లో వచ్చిన తర్వాత ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సినిమా తీసి.. థియేటర్‌కు రావడమే పెద్ద సక్సెస్‌గా భావిస్తున్నాను. ఈరోజు నేను ఆ విషయంలో సక్సెస్ సాధించినట్టే భావిస్తున్నాను`` అన్నారు.
సీనియర్ నరేశ్ మాట్లాడుతూ - ```మిణుగురులు` వంటి అవార్డ్ విన్నింగ్ మూవీని తీసిన దర్శకుడు చేసిన చిత్రమిది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. వైడర్ రీచ్‌కి వెళ్లాలని చెప్పి.. ఓ మంచి పాయింట్‌ను తీసుకుని చేసిన సినిమా 24 కిస్సెస్. ఈ కాలంలో యూత్ చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. పెళ్లిళ్లు చేసుకోవాలా వద్దా.. సహజీవనం బెస్ట్ ఏమో.. అది కూడా వద్దు అని అనుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇలాంటి పాయింట్‌ను తీసుకుని, ఓ యువకుడు, సినిమా అంటే ఇష్టపడే హీరోయిన్ మధ్య నడిచే ప్రేమకథను బోల్డ్‌గా, పొయెటిక్‌గా తీశారు. ట్రావెల్ ఆఫ్ లవ్‌స్టోరీని కిస్సెస్ ద్వారా చెప్పిన చిత్రమిది. వీధి బాలల సమస్యను కూడా ఈ ప్రేమకథలో చొప్పించి చక్కగా చిత్రీకరించారు. ఎక్కడా సినిమాలో వల్గారిటీ కనపడదు. సినిమాలో డెప్త్‌తో దర్శకుడు అయోధ్యకుమార్ తెరకెక్కించారు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని కన్‌వే చేశారు. కలెక్షన్స్ పరంగా సినిమా ఈరోజుకి 50 శాతం పైగానే ఉంది. ఇలాంటి సినిమాలో నేను కూడా మంచి పాత్ర చేయడం ఆనందంగా ఉంది. యూత్ చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మంచి పాయింట్‌ను అందంగా చెప్పారు. మా యూనిట్ తరపు నుండి ప్రేక్షకులకు థాంక్స్``అన్నారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ - ``సినిమాలో రెండు, మూడు థీమ్స్ ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో ముద్దుల గురించే సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇదొక పొయెటిక్ సినిమా. సినిమాలో వీధి బాలల గురించి మంచి పాయింట్‌ను చెప్పారు. ప్రమోషన్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనిపించింది`` అన్నారు.