pizza
Anaganaga Oka Chitram success meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 December 2015
Hyderabad

`అన‌గ‌న‌గా ఒక చిత్ర‌మ్‌` స‌క్సెస్ మీట్‌

శివ‌, మేఘ‌శ్రీ జంట‌గా జె ప్రొడ‌క్ష‌న్స్, గోవ‌ర్షిణి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై రూపొందిన సినిమా `అన‌గ‌న‌గా ఒక చిత్ర‌మ్`. జె.ప్ర‌భాక‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడు. జె.ప్ర‌భాక‌ర‌రెడ్డి, కొడాలి సుబ్బారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 11న విడుద‌లైంది ఈ సినిమా. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో చిత్ర‌టీమ్ స‌క్సెస్ టీమ్‌ను నిర్వ‌హించారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ప్రేక్ష‌కుల నుంచి ఈ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇంత మంచి టీమ్‌తో క‌లిసి ప‌నిచేసినందుకు ఆనందంగా ఉంది. మ‌ల్ల‌య్య‌గారు బాగా స‌పోర్ట్ చేశారు. ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు ఓ కొత్త పాయింట్‌తో సినిమా చేశాం.ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. కామెడీ బావుంద‌ని అంద‌రూ అంటున్నారు`` అని చెప్పారు.

శివ మాట్లాడుతూ ``మంచి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. పాట‌ల‌ను తీసిన విధానం, కామెడీ హైలైట్ అవుతాయి. స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్`` అని చెప్పారు.

మేఘ‌శ్రీ మాట్లాడుతూ ``ఈ సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. నాకు మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు, సినిమాను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ `` అని అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved