pizza
Aravinda Sametha success meet
You are at idlebrain.com > News > Functions
Follow Us


14 October 2018
Hyderabad

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. అక్టోబర్‌ 11న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ మీట్ ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..

శ‌త్రు మాట్లాడుతూ - ``నా పాత్ర చేయ‌డం చాలా ఇంపాక్ట్ చూపించింది. తార‌క్ గారితో ప‌నిచేసేట‌ప్పుడు మ‌న‌లో న‌టుడు ఎప్పుడు తాప‌త్ర‌యంతో ఉంటాడు. ఇంకా ఏం చేయాలా? అనిపిస్తుంటుంది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

పెంచ‌ల‌దాస్ మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌గారు నాకు ఫోన్ చేసిన‌ప్పుడు ముందు పాట కావాల‌ని అన్నారు. స‌రేన‌ని ఆయ‌న్ని క‌లిసినప్పుడు రియ‌లిస్టిక్‌గా తెర‌కెక్కించాల‌ని .. రాయ‌ల‌సీమ యాసతో సినిమా చేయాల‌నుకుంటున్నామ‌ని అని న‌న్ను అడిగారు. త్రివిక్రమ్‌గారంటే నాకు గౌర‌వ‌మే. పెద్ద ద‌ర్శ‌కుడు, హీరో సినిమా కాబ‌ట్టి కాస్త భ‌య‌మేసింది. అయితే నాకు బాగా స్వేచ్చినిచ్చారు. ఎంత‌గానో ప్రోత్స‌హించారు. డైలాగ్స్ రాయ‌డంతో పాటు లొకేష‌న్‌లో కూడా ఉంచి డైలాగ్స్‌ను సరి చేయించుకున్నారు. ఎన్టీఆర్ లాంటి హీరో మా యాస‌ను ప‌లుకుతుంటే అంద‌రూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా మంది నాకు ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. మా యాస‌ను అద్భుతంగా ప‌లికినందుకు ఎన్టీఆర్‌గారికి థాంక్స్‌. జ‌గ‌ప‌తిబాబుగారు, బ్ర‌హ్మాజీగారు, న‌వీన్‌చంద్ర‌గారు, శత్రుగారు.. ఇలా అంద‌రూ డైలాగ్స్ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప‌రంప‌ర ఇప్పుడు మొద‌లైంది. నాకు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన త్రివిక్ర‌మ్‌గారు, నిర్మాత‌ల‌కు, మా టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ మాట్లాడుతూ - ``ఇంత మంచి సినిమాలో న‌న్ను భాగం చేసిన మా హీరో ఎన్టీఆర్‌గారికి, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌గారికి, యూనిట్ స‌భ్యుల‌కు థాంక్స్‌`` అన్నారు.

రామ్ ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ - ``ఇలాంటి హిట్ సినిమాలో మా పేరు కూడా ఉన్నందుకు ఆనందంగా ఉంది. సినిమా స్టార్ట్ చేయ‌డానికి రెండు నెల‌లు ముందుగానే మ‌మ్మ‌ల్ని పిలిచి ప్రాంక్‌గా , ఓపెన్‌గా మాట్లాడారు. ముందు ఫైట్స్‌నే డిజైన్ చేశాం. ఫ‌స్ట్ ఫైట్ అద్భుతంగా రావ‌డానికి కార‌ణం.. ఫ‌స్ట్ షెడ్యూల్‌లోనే ఫైట్‌ను చేయించారు. ప‌క‌డ్బందీగా ఫైట్‌ను కంపోజ్ చేశాం. దానికి త‌గ్గ‌ట్లు ఎన్టీఆర్‌గారు సిక్స్ ప్యాక్ చేసి.. చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. ఫ‌స్ట్ ప‌దిహేను నిమిషాలు వ‌చ్చే ఈ ఫైట్‌ను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇంట‌ర్వెల్ ఫైట్‌ను ఎమోష‌న‌ల్‌గా డిజైన్ చేశాం. సినిమా కోసం స్పెష‌ల్‌గా ఎన్టీఆర్‌గారి శ‌రీరం డిజైన్ చేసిన‌ట్లుగా ఉంటుంది. ఆయ‌న శ‌రీరంలోని అన్ని క‌ణాలు ఆయ‌న మాట‌లే వింటాయి. క్లైమాక్స్ ఫైట్ కోసం ప‌ది రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాం. రెండు రోజులు ఫైట్ కంపోజ్ కూడా చేశాం. కానీ ఎన్టీఆర్‌గారు స‌హా మా ఎవ‌రికీ క్లైమాక్స్‌లో ఫైట్ రావ‌డం ఇష్టం లేకుండా ఉంది. దాంతో సన్నివేశాల ప్ర‌కారం ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో క్లైమాక్స్‌ను డిజైన్ చేశాం. అందుకు కార‌ణం ఎన్టీఆర్‌గారు. ఎన్టీఆర్‌లాంటి హీరో ఉన్నా కూడా యాక్ష‌న్‌ను ప‌క్క‌న పెట్టి ఈ స‌న్నివేశం డిజైన్ చేసిన త్రివిక్ర‌మ్‌గారికి హృద‌య‌పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు. అంద‌రూ అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్ చేశారు. డైరెక్ట‌ర్‌గారి సినిమాలో ఏదో ఒక పాయింట్ ఉంటుంది. మ‌నిషిలో ప‌గ ఉంటే మ‌నిషి జీవితంలో ఎంతో కోల్పోతాడు అనే విష‌యాన్ని ఈ సినిమాలో చూపించారు. ఆయ‌న‌కు హ్యాట్సాఫ్‌. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

న‌వీన్ చంద్ర మాట్లాడుతూ - ``నాకు జీవితంలో మ‌రో అవ‌కాశం ఇచ్చిన నిర్మాత చిన‌బాబుగారికి రుణ‌ప‌డి ఉంటాను. అంద‌రూ న‌న్ను బాల్‌రెడ్డి అనే పిలుస్తున్నారు. త్రివిక్ర‌మ్‌గారి ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో కూడా తెలియ‌డం లేదు. ఎన్టీఆర్‌గారితో సెట్స్‌లో ఎలా ఉంటాన‌నేది నాకు ఐడియా లేదు. ప్రీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌గారితో మాట్లాడాను. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే బాల్‌రెడ్డి క్యారెక్ట‌ర్‌ను బాగా చేశాన‌నుకుంటున్నాను. అలాగే త‌మ‌న్‌గారు స‌న్నివేశాల‌ను త‌న సంగీతంతో నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. శ‌త్రు, బ్ర‌హ్మాజీ, జ‌గ‌ప‌తిబాబుగారు, ఈశ్వ‌రీరావు ఇలా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ఈ స‌క్సెస్ తెలుగు ప్ర‌జ‌ల‌దే. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.

సునీల్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరుతో నా లెవ‌ల్‌ను పెంచారు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్‌గారు డైరెక్ట‌ర్ కాకుంటే ఎవ‌రూ కామెడీ గురించి మాట్లాడేవాళ్లు కాదు. ఆయ‌నే కామెడీని అల‌వాటు చేశాడు కాబ‌ట్టి.. అంద‌రూ కామెడీ లేదు అని అంటున్నారు. ఈ సినిమాను చూడ‌టంతో ద‌స‌రాను ఆనందంగా జ‌రుపుకునేలా చేసిన త్రివిక్ర‌మ్‌కి, తార‌క్‌కి, రాధాకృష్ణ‌గారికి థాంక్స్‌. ఈ సినిమా కోసం అంద‌రం బంధువుల్లా ప‌ని చేశాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటే కామెడీయే కాదు.. అని ప్రూవ్ చేసిన త్రివిక్రమ్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ - ``అర‌వింద స‌మేత‌.. అనేది సినిమాయే కాదు.. జ‌ర్నీ. ఎన్టీఆర్‌గారిపై ప్రేమ‌, త్రివిక్ర‌మ్‌గారిపై అభిమానం, రాధాకృష్ణ‌గారిపై అభిమాన‌మే ఈ సినిమాకు న‌న్ను ఇంత బాగా ప‌నిచేసేలా చేసింది. త్రివిక్ర‌మ్‌గారు పెన్‌లో రీఫిల్స్ కంటే రైఫిల్స్ వాడుతారు. అందుకే ఆయ‌న మాట‌ల‌కు, పాట‌ల‌కు సంగీతం చేశాన‌న‌డం కంటే గౌర‌వం ఇచ్చాన‌ని చెప్పాలి. సినిమాలో చాలా ఎమోష‌న్స ఉన్నాయి. సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. త్రివిక్ర‌మ్‌గారిని ప్ర‌తిరోజూ కొత్త‌గా చూసేవాడిని. తార‌క్ అన్న‌తో బృందావ‌నం నుండి ప‌రిచ‌యం ఉంది. ఆయ‌నలోని ఎన‌ర్జీని కాస్త నాకు ఇచ్చారు. దాంతో మంచి మ్యూజిక్‌ను రాబ‌ట్టుకున్నాను. చాలా ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాను. చాలా గ‌ర్వంగా ఉంది. ఈ క్రెడిట్ అంతా రాధాకృష్ణ‌, నాగ‌వంశీగారికి థాంక్స్‌`` అన్నారు.

త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ - ``ప్ర‌తి సినిమా ఓ ఆలోచ‌న‌తోనే మొద‌ల‌వుతుంది. ప్ర‌తి క‌థ‌కు మొట్ట‌మొద‌టి ప్రేక్ష‌కుడు హీరోనే. ఈ సినిమాను మొద‌లు పెట్ట‌డానికి, పూర్తి చేయ‌డానికి, నాలుగు రోజుల్లోనే వంద‌కోట్లు దాటించ‌డానికి అన్నింటికి సార‌థి ఎన్టీఆర్‌. ఇందులో ఎంట‌ర్‌టైన్మెంట్ ఎక్క‌డా, ఫైట్స్ ఎక్క‌డా, పాట‌లేవీ అని అడ‌గ‌కుండా.. ఈ సినిమాలో ఫైట్స్ లేవు. ఉన్న‌వాటిని ఎమోష‌న‌ల్ బ్లాక్స్ అనాలి. రామ్ లక్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ ఫైట్స్ తీయ‌లేదు. ఫైట్ మాస్ట‌ర్స్ స్థాయిని వారు ఎప్పుడో దాటేశారు. కాబ‌ట్టి వారిని యాక్ష‌న్ డైరెక్ట‌ర్స్ అని పిలుస్తాను. సినిమాలో ఓ భాగ‌మైన యాక్ష‌న్స్‌ను వారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో ఫైట్ అక్క‌ర్లేద‌ని వాళ్లే నాకు చెప్పారు. ఇలాంటి ఫైట్స్, సాంగ్స్ లేని సినిమాను చేయ‌డానికి ఒప్పుకోవ‌డానికి ధైర్యం చేసిన ఎన్టీఆర్‌గారికి థాంక్స్‌. ఆయ‌న రెండింటీని బాగా చేయ‌గ‌ల నటుడు. పెద్ద స్టార్‌. ఈ సినిమా మాకొక ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. నేను ప‌రాజ‌యం త‌ర్వాత మొద‌లు పెట్టిన సినిమా. ఓ విషాదం త‌ర్వాత రిలీజైన సినిమా. వీట‌న్నింటినీ దాటుకుని.. వెల్లువ‌లా స‌క్సెస్‌ను మా ఇళ్ల‌ల్లోకి తీసుకొచ్చిన ప్రేక్ష‌కులంద‌రికీ పాదాభివంద‌నం చేస్తున్నాను. ఈ సినిమా నాకు, నా స్నేహితుడు రాధాకృష్ణ‌గారికి చాలా ముఖ్యం. చిన‌బాబుగారే నా మొద‌టి విమ‌ర్శ‌కుడు ఆయ‌నే. ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా మాతో నిల‌బ‌డ్డ జ‌గ‌ప‌తిబాబుగారు.. త‌క్కువ స‌మ‌యమే అయినా నిలిచిపోయే పాత్ర‌లు చేసిన న‌వీన్ చంద్ర‌, శత్రు, బ్ర‌హ్మాజీ, న‌ర్రా, సంతోష్‌, దేవ‌యాని, సితార‌, సుప్రియా పాట‌క్ అంద‌రూ వాళ్లు వాళ్ల‌దైన సంత‌కం చేశారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో యుద్ధ వాతావ‌రణం జ‌రిగిన త‌ర్వాత ప‌రిస్థితుల‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు? అనే పాయింట్‌పై మేం వెళుతున్న‌ప్పుడు త‌ల్లికంటే గొప్ప‌గా, నిస్వార్థంగా మ‌న‌ల్ని ఎవ‌రు ప్రేమించ‌గ‌ల‌రు. మ‌న విజ‌యాన్ని భార్య కంటే గొప్ప‌గా ఎవ‌రు కోరుకోగ‌ల‌రు. ఓ సోద‌రి కంటే మ‌న‌ల్ని ఎవ‌రూ కాపాడ‌గ‌ల‌రు... అలాంటి మ‌హిళల చేతిలో అధికారాన్ని పెట్ట‌డానికి మ‌నం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ గురించి ఇంత మాట్లాడుతున్నాం కానీ.. దాన్ని మ‌గ‌వాళ్లే ప‌డ‌నీయ‌కుండా ఆపుతున్నారు. ఇది అంద‌రికీ తెలిసిన స‌త్య‌మే. మాట్లాడం రాని.. న‌వ‌డం రాని.. తిన‌డం రాని.. ఒక ముద్దు ఎక్కువ తింటే కక్కేసుకునే మ‌న‌కు బ్ర‌త‌క‌డం నేర్పి, సంస్కారం నేర్పి త‌ల్లికి ప‌రిపాలించ‌డం గొప్ప విష‌య‌మేమీ కాద‌నేదే సినిమా ప్ర‌దాన ఆలోచ‌న‌. ఓ మంచి సొల్యూష‌న్‌ని ఈ సినిమా ద్వారా చెప్పామ‌ని మాకు అనిపించింది. దాన్ని ఈరోజు అంద‌రూ స్వాగ‌తించారు. వారంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు. సునీల్ గురించి నేను అస్త‌మానం ఎక్క‌డా మాట్లాడ‌ను. ప‌లుచ‌నై పోతుంద‌ని నా భ‌యం. నేను ఎప్పుడూ బావుండాల‌ని కోరుకునే నా స్నేహితుడు. పూజా హెగ్డే సినిమా కోసం చాలా ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేశారు. కెమెరామెన్‌ పి.ఎస్‌.వినోద్‌గారికి, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్రకాశ్‌గారికి నా థాంక్స్‌. ఈ సినిమాకు మొద‌లు, మ‌ధ్యం, చివ‌ర అంతా ఎన్టీఆరే. ఇంత బ‌ల‌మైన న‌టుడ్ని.. చాలా అరుదుగా చూస్తాం. న‌ట‌న‌కు సంబంధించిన ఎన్టీఆర్ టార్చ్‌బేర‌ర్‌లాంటి వ్య‌క్తి. ఎలాంటి క‌ష్ట‌మైన స‌న్నివేశాన్నిఅయినా ఆ క్ష‌ణంలోనే ఉంటూ న‌టించ‌డం ఆయ‌న‌కున్న గొప్ప ల‌క్ష‌ణం. తాత‌గారి పేరు నిల‌బెట్ట‌డానికి కాదు.. ఆయ‌నకు మ్యాచ్ చేసే స‌త్తా ఉన్న న‌టుడు. అంత ప్ర‌యాణాన్ని, వ‌య‌సు ఉన్న న‌టుడు. స‌మ‌యపాల‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిజాయ‌తీగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తి ఎన్టీఆర్‌. అంత హెవీ ఎమోష‌న్స ఉన్న ఈ సినిమా అంత త‌క్కువ స‌మ‌యంలో చేయ‌డానికి కార‌ణం ఎన్టీఆర్‌గారే. అతి పెద్ద విషాదం నుండి ..తండ్రి మ‌ర‌ణించ‌డం అనే విషాదాన్ని మ‌న‌సులో దాచుకుని.. మాపై ఎవ‌రిపై ప్ర‌బావం ప‌డ‌కుండా త‌న‌లో తాను న‌లిగిపోయి న‌టించిన హీరో ఎన్టీఆర్‌. ఈ సినిమా త‌ప్ప‌కుండా ఆడుతుంది అని మొద‌టి నుండి న‌మ్మి.. న‌మ్మింది తీయండి.. అని చెప్పిన వ్య‌క్తి ఎన్టీఆర్. ఈ స‌క్సెస్ క్రెడిట్ అంతా ఎన్టీఆర్‌గారిదే. అలాగే ఈ సినిమాకు కొత్త అందం, ప‌రిమ‌ళం రావ‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తి పెంచ‌ల‌దాస్‌. పాట రాయ‌డానికి వ‌చ్చిన ఆయ‌న‌.. మాట‌ల్లో కూడా ఓ చేయి అందించాను. ఆయ‌న అన్న‌గారు రెడ్డిమ్మ తాలుకా చ‌రిత్ర‌ను సేక‌రించి రాసిన పాట ఇది. ఈ సినిమాకు ప‌నిచేసిన అంద‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ - ``12 ఏళ్ల నుండి నేను ఎదురుచూస్తున్న త‌రుణం.. మా అన్న‌, మా అమ్మ‌కు ఇంకో కొడుకు, మా పిల్ల‌ల‌కు మావ‌య్య‌, నా భార్య‌కు అన్న‌య్య‌, నాకు బావ ఎన్ని బంధాల‌తో పిలిచినా ప‌లికే ఆత్మీయుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌గారితో ఓ సినిమా చేయాలి. చేస్తే జీవితాంతం నా గుండెలోతుల్లో ఆ చిత్రం చిర‌స్థాయిగా మిగిలిపోవాలి. రేపు గ‌ర్వంగా మా పిల్ల‌ల‌కు, స‌మాజానికి ఈ సినిమా చూపించుకోవాలనుకునే సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ రూపంలో వ‌చ్చింది. ఈ చిత్రం విజ‌యం నా ఖాతాలోకి తోసేయ‌డం జ‌రిగింది. నేను ఆయ‌న్ను న‌మ్మాను సరే!.. అలా న‌మ్మిన‌ట్లు చేసింది మీరే క‌దా! త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా అంటే న‌మ్మ‌కాన్ని క్రియేట్ చేసుకుంది మీరే. ఈ సినిమా విజ‌యం త్రివిక్ర‌మ్‌గారి జ‌ర్నీలో బాగంగానే మేం క‌లిశాం కానీ.. మా జ‌ర్నీలో భాగంగా ఆయ‌న వ‌చ్చి క‌ల‌వ‌లేదు. ఇది త్రివిక్ర‌మ్ క‌లం నుండి వ‌చ్చిన అద్భుత‌మైన విజ‌య‌మిది. ద‌ర్శ‌కుడిగా కాకుండా.. గురువుగా కూడా వేలు ప‌ట్టి న‌డిపించారు. చాలా సినిమాల్లో ఎమోష‌న‌ల్ సీన్స్ చేశాను. ప్ర‌తి ఎమోష‌న‌ల్ సీన్‌ను డ్రైవ్ చేసేది ద‌ర్శ‌కుడే. ద‌ర్శ‌కుడు ప‌రిపూర్ణంగా న‌మ్మిన‌ప్పుడే ఆ ఎమోష‌న్ సీన్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. నాగ‌బాబు పాత్ర చ‌నిపోయిన‌ప్పుడు వ‌చ్చే ఎమోష‌నల్ సీన్ గురించి చెప్పాలి. ఆరోజు నేను ఆయ‌న్ను వెళ్లి సామి! నాకు దారి చూపించండి అని అంటే.. ఆరోజు ఆయ‌న చెప్పింది నా న‌ట‌న‌కు ఇంకా దోహ‌ద‌ప‌డింది. ఆరోజు గురువులాగా నాకు బోధ‌న చేశాడు. ఆయ‌న‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. త్రివిక్ర‌మ్‌గారు రెండు క‌థ‌లు చెప్పారు. ఏదో ఆయ‌న‌కు సందిగ్ధం ఉండిపోయింది. తెలియ‌ని శ‌త్రువుతో క‌నిపించ‌ని యుద్ధం చేసేస్తున్నాడు. ఫైన‌ల్‌గా ముందు 20 నిమిషాల క‌థ‌ను నెరేట్ చేసేట‌ప్పుడు ఆయ‌న క‌ళ్ల‌లో ఓ మెరుపు చూశాను. నాకు నేను ఎలాంటి త్రివిక్ర‌మ్ కావాల‌నుకుంటున్నానో..ఆయ‌న్ను చూశాను. ఆయ‌న కామెడీని బాగా చెప్ప‌గ‌ల‌రు. కానీ న‌వ‌ర‌సాల్లో ఆదొక ర‌సం మాత్ర‌మే. అది కాకుండా ఎమోష‌న్‌ను బ‌లంగా చెప్ప‌గ‌ల బ‌ల‌మైన ర‌చ‌యిత త్రివిక్ర‌మ్‌గారు. అలాంటి క‌థ‌ను నాకు చెప్పిన ఆయ‌న‌కు థాంక్స్‌. చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. మా ఇద్ద‌రి న‌మ్మ‌కాన్ని వెన్నంటే ఉండి ప్రోత్స‌హించిన రాధాకృష్ణ‌గారికి థాంక్స్‌. నిర్మాత‌గా సినిమాకు ఎలాంటి పాత్ర వ‌హించాలో.. ఆ పాత్ర‌ను వంద‌శాతం అందించిన నిర్మాత చిన‌బాబుగారు. మా ఇద్ద‌రి కంటే చిన‌బాబుగారి కోరిక బ‌ల‌మైంది కాబ‌ట్టే.. సినిమా చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. త్రివిక్ర‌మ్‌గారి క‌ల‌ను ముందు తీసుకెళ్ల‌డానికి తాప‌త్ర‌య‌ప‌డ్డ వ్య‌క్తి థ‌మ‌న్‌. త‌ను కేవ‌లం సంగీత‌మే కాదు.. ప్రాణం పెట్టేశాడ‌ని ఎప్పుడో చెప్పాను. ఓ సీన్ తీసిన‌ప్పుడు వెన‌కాల వెయిట్ ఇవ్వాల్సింది నేప‌థ్య సంగీత‌మే. అలాంటి నేప‌థ్య సంగీతాన్ని అందించిన పిల్ల‌ర్ త‌మ‌న్‌కి థాంక్స్‌. త‌మ‌న్ ట్యూన్స్‌కి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య‌శాస్త్రి గారికి థాంక్స్‌. పెంచ‌ల‌దాస్‌గారికి థాంక్స్‌. ఆయ‌నిచ్చిన స‌హ‌కారంతో యాస‌ను అద్భుతంగా ప‌లికించాం. మంచి గురువుగా, శ్రేయోభిలాషిగా స‌పోర్ట్ అందించారు. న‌వీన్ చంద్ర‌, శ‌త్రు, నాగ‌బాబుగారు, సితార‌, దేవ‌యాని, ఈశ్వ‌రీరావు, పూజా హెగ్డే, ఈషా అంద‌రూ త్రివిక్ర‌మ్‌గారు క‌న్న క‌ల‌ను నిజం చేశారు. ఎడిట‌ర్ న‌వీన్ నూలి, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, కెమెరామెన్ పి.ఎస్‌.వినోద్ గారికి, రామ్ ల‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved