pizza
Bluff Master success meet
`బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` సక్సెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us



29 December 2018
Hyderabad

శ్రీదేవి మూవీస్‌ సంస్థ అధినేత శివలెంక క ష్ణప్రసాద్‌ సమర్పణలో, అభిషేక్‌ ఫిలిమ్స్‌ అధినేత రమేష్‌ పిళ్లై నిర్మాతగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'చతురంగ వేట్టై'ని ఆధారంగా చేసుకుని గోపీ గణేష్‌ పట్టాబి దర్శకత్వంలో.. తెలుగులో రూపొందిన చిత్రం 'బ్లఫ్‌ మాస్టర్‌'. 'జ్యోతిలక్ష్మీ', 'ఘాజి' చిత్రాల ఫేమ్‌ సత్యదేవ్‌ హీరోగా నటించారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక. `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` సక్సెస్‌మీట్‌ సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

మారుతి మాట్లాడుతూ ``గోపీగ‌ణేష్ నాకు ఎప్ప‌టి నుంచో తెలుసు. సినిమాను బాగా తీశాడు. స‌త్య‌దేవ్‌ని చూస్తే జెన్యూన్ ఆర్టిస్టును చూసిన ఫీలింగ్ వ‌చ్చింది. త‌ను పాత్ర‌కు న్యాయం చేశాడు. త‌మిళ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా తీశారు. ప్ర‌తి పాత్ర‌కూ డీటైలింగ్‌గా ప‌నిచేశారు. ఇలాంటి చిన్న సినిమాల‌ను ఆద‌రిస్తే వీళ్ల ద‌గ్గ‌ర నుంచి మ‌రిన్ని మంచి సినిమాలు వ‌స్తాయి. వీళ్ల క‌ష్టానికి మ‌నం ఇచ్చే ఎన‌ర్జీ థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడ‌ట‌మే`` అని అన్నారు.

శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``త‌మిళ సినిమాను చూడ‌గానే తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నా. రైట్స్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించాక ర‌మేష్ పిళ్లై ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని తెలిసింది. ఆయ‌న్ని అడిగితే ఇద్ద‌రం క‌లిసి చేద్దామ‌ని అన్నారు. ఇది చిన్న సినిమాల్లో పెద్ద సినిమా. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడ‌క్షన్స్... చూసిన ప్ర‌తి వాళ్లూ ఎగ్జ‌యిట్ అయ్యారు. అదే ఎగ్జ‌యిట్‌మెంట్ జ‌నాల్లో క‌నిపిస్తుంది. నిర్మాత‌గా మాకు సంతృప్తిని ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాం`` అని చెప్పారు.

ల‌క్ష్మీభూపాల్ మాట్లాడుతూ ``ఈ చిత్రంలో ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ రాశాను. అది బీప్ సాంగ్‌. బిజినెస్‌మేన్ సినిమా క్లైమాక్స్ చూసి త‌మిళంలో `స‌దురంగ వేట్టై` తీసిన‌ట్టు ఆ ద‌ర్శ‌కుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ర‌కంగా ఈ ఐడియా మ‌న‌దే. ప‌ర‌భాష‌ల నుంచి వ‌చ్చింది కాదు. బ్ల‌ఫ్ మాస్ట‌ర్ పాత్ర‌కు స‌త్య‌దేవ్ ప‌రిపూర్ణంగా న్యాయం చేశాడు. అత‌నితో మాత్ర‌మే సినిమా చేస్తాన‌ని ప‌ట్టుబ‌ట్టాడు గోపీ గ‌ణేష్‌. తెలుగు ఇండ‌స్ట్రీలో స్ప‌ష్ట‌మైన ఉచ్ఛార‌ణ‌తో డైలాగులు చెప్ప‌గ‌లిగేది యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ మాత్ర‌మే. ఆ స్థాయిలో ద‌మ్మున్న డైలాగుల‌ను చెప్ప‌గ‌లిగిన న‌టుడు స‌త్య‌దేవ్‌. స‌త్య‌దేవ్ చాలా బాగా న‌టించాడు. అత‌నిలో ఈ సినిమాలో మ‌నం చూసింది 5 శాతం మాత్ర‌మే. ఇంకో 95 శాతం మిగిలి ఉంది. ఈ సినిమాల్లో డైలాగులు చాలా బావున్నాయి. కొన్ని డైలాగులు చూసి నాలో కుళ్లు వ‌చ్చింది. గోపీగ‌ణేష్ అంత అద్భుతంగా రాశాడు. కొంత‌మంది సినిమాలు చంపేయ‌డానికి మార్నింగ్ 8.45 షోల‌కు సినిమాల‌కు వ‌స్తున్నాడు. అలాంటివాళ్లు నెల త‌ర్వాత సినిమాలు చూసుకోండి. మంచి సినిమాల‌ను చంపేయ‌వ‌ద్దు`` అని అన్నారు.

గోపీగ‌ణేష్ మాట్లాడుతూ ``సినిమాకు వ‌స్తున్న స్పంద‌న సంతోషాన్నిచ్చింది. త‌మిళ సినిమా విడుద‌లైన ఆరు నెల‌ల త‌ర్వాత పోలీసులు ద‌ర్శ‌కుడు హెచ్.వినోద్‌ను క‌లిసి దో నెంబ‌ర్ దందా నేరాలు త‌గ్గాయ‌ని అప్రిషియేష‌న్ లెట‌ర్ ఇచ్చార‌ని తెలిసింది. ఇక్క‌డ కూడా సినిమా అలాంటి ప్ర‌భావం చూపించిన‌ప్పుడు మా ప్ర‌య‌త్నం విజ‌య‌వంత‌మైన‌ట్టు. సినిమాలో డైలాగుల‌కు మంచి పేరు వ‌స్తోంది`` అని చెప్పారు.

నందిత శ్వేత మాట్లాడుతూ ``అవ‌ని పాత్ర‌లో న‌టించ‌లేదు. జీవించాను. ఆ పాత్ర నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి చాలా రోజులు ప‌ట్టింది. స‌త్య‌దేవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు`` అని చెప్పారు.

స‌త్య‌దేవ్
మాట్లాడుతూ ``మా సినిమాకు ప‌నిచేసిన యూనిట్ స‌భ్యులు, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు సినిమా బావుంద‌న్న‌ప్పుడు నా మీద ప్రేమ‌తో చెప్పార‌నుకున్నా. మూడు రోజులుగా థియేట‌ర్ల రెస్పాన్స్ చూసి, విని గ‌ర్వంగా అనిపించింది. ఆనందంగా ఉన్నాను`` అని అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved