pizza
Budugu success meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 April 2015
Hyderabad


‘బుడుగు’ సక్సెస్ మీట్

మంచు లక్ష్మీ, శ్రీధర్ రావు, మాస్టర్ ప్రేమ్, బేబీ డాలీ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం బుడుగు. సుధీర్ సమర్పణలో హైదరాబాద్ ఫిల్మ్ ఇన్నోవేటీస్ ప్రై.లి. బ్యానర్ పై మన్ మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏప్రిల్ 17న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో శుక్రవారం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...

దర్శకుడు మన్ మోహన్ మాట్లాడుతూ ‘’సినిమా మేం అనుకున్న దానికంటే హ్యుజ్ సక్సెస్ అయింది. వంద థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మంచు లక్ష్మి, శ్రీధర్ రావు బాగా సపోర్ట్ చేశారు. ప్రేమ్ నటనకు మంచి పేరు వచ్చింది. ఇంద్రజగారు పోషించిన రోల్ కి మంచి అప్లాజ్ వస్తుంది. సాయికార్తీక్ గారి మ్యూజిక్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్’’ అన్నారు.

నిర్మాత సారికా శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో సినిమా రన్ కావడం మంచి విషయంగా బావిస్తున్నాం. బుడుగు అందించిన ఎనర్జీతో బుడుగు 2 చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాం’’ అన్నారు.

మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘’డైరెక్టర్ మన్ మోహన్ గారు పక్కా క్లారిటీతో ఉండటం వల్ల సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమా పెద్ద సక్సెస్ అయింది. నిర్మాతలు మంచి చిత్రం తీయాలనే ఉద్దేశంతో సినిమాని నిర్మించారు. మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్నారు. సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved