pizza
Drushyakavyam Success meet
‘దృశ్యకావ్యం’ సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 March 2016
Hyderabad

 

పుష్యమి ఫిలింమేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో రామ్ కార్తీక్‌, కశ్మీరా కుల‌క‌ర్ణి హీరో హీరోయిన్లుగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రం మార్చి18న విడుద‌లైంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు సక్సెస్ మీట్ కు హీరో శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈసందర్భంగా....

శ్రీకాంత్ మాట్లాడుతూ ‘’దృశ్యకావ్యం మంచి రిపోర్ట్స్, కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ కావడం ఆనందంగా ఉంది. బెల్లం రామకృష్ణారెడ్డిగారు నిర్మాతగా గతంలో నేను వీడికి దూకుడెక్కువ సినిమా చేశాను. అప్పుడు సినిమా పట్ల ఆయనకున్న ఆసక్తిని గమనించి దర్శకుడుగా మారమని నేనే సలహాఇచ్చాను. అన్నట్లుగా రామకృష్ణారెడ్డిగారు దృశ్యకావ్యంతో దర్శకనిర్మాతగా పరిచయం అయ్యారు. సినిమా తీయడం కంటే విడుదల చేయడం కష్టమైన ఈరోజుల్లో రామకృష్ణారెడ్డిగారే ఎగ్జిబిటర్స్ దగ్గరకు వెళ్ళి మంచి థియేటర్స్ లో విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిసింది. అందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. ఫ్యూచర్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’నిర్మాతగా ఉన్న నేను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాను. నా మొదటి ప్రయత్నాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. నిన్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగినా మంచి కలెక్షన్స్ రావడమే అందుకు నిదర్శనం. సినిమాకు తన మ్యూజిక్ తో ప్రాణం కమలాకర్ ప్రాణం పోశారు. అలాగే హీరో హీరోయిన్స్ సహా పృథ్వీ, షాని సహా అందరూ తమ వంతు పాత్రలు పోషించడంతో సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది’’ అన్నారు.

ప్రాణం కమలాకర్ మాట్లాడుతూ ‘’ప్రతి ఎమోషన్ సీన్ బాగా పడటంతో యూత్ నుండి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు సినిమాబాగా రీచ్ అయింది. సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి, సినిమాటోగ్రాఫర్ సంతోష్, కొల్లు శివ‌నాగేంద్ర‌రావు, ఎడిటర్ నాగిరెడ్డి, కో డైరెక్టర్ రాజు తదితరులు పాల్గొని చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

Kashmira Kulkarni glam gallery this event

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved