pizza
Goodachari success meet
`గూఢ‌చారి` స‌క్సెస్‌మీట్‌

You are at idlebrain.com > News > Functions
Follow Us


8 August 2018
Hyderabad

అడివిశేష్‌, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో.. శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా.. అభిషేక్ నామ‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢ‌చారి`. ఆగ‌స్ట్ 3న సినిమా విడుద‌లైంది. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర విడుద‌ల చేశారు. బుధ‌వారం ఈ సినిమా స‌క్సెస్‌మీట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.. ఈ కార్య‌క్ర‌మంలో...

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''అందరూ ఇన్‌క్రెడిబుల్‌ వర్క్‌ చేశారు. త్వరలోన అందరి పేర్లు అన్ని సినిమాల్లో కనపడతాయి. అందరూ న్యూ జనరేషన్‌ యాక్టర్స్‌, టెక్నీషియన్స్‌. మీరందరూ తెలుగు సినిమా ఫ్యూచర్‌. మీతో పాటు ట్రావెల్‌ చేయాలనుకుంటున్నాను. లేకుంటే నేను వెనుకబడిపోతాను. సినిమా చూస్తున్నంతసేపు ఎలా చేశారో చూశాను. సినిమా బడ్జెట్‌ గురించి తెలుసుకుని.. ఎలా సాధ్యమైందని ఆలోచించాను. ఇప్పటి వరకు మేం చేస్తున్న సినిమాలను చూసి మేం అంత సోంబేరులా, బద్దకస్తుల, సినిమా తీయడం మాకు తెలియదా? అని మాకు అనిపించింది. టెక్నీషియన్స్‌ పరంగా చూస్తే సినిమాటోగ్రాఫర్‌గా శనీల్‌ గురించి చెప్పాలి. 17 రోజులు అన్నపూర్ణలో వీళ్లు షూటింగ్‌ చేశారు. అసలు నాకు తెలియని లొకేషన్స్‌ అన్నపూర్ణలో ఉన్నాయా? అనిపించింది. ఎలా సాధ్యమైంది. సిగ్గేసింది. నాన్నగారు ఉండుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. వీళ్లు వాడినట్లు అన్నపూర్ణ స్టూడియోను ఎవరు వాడలేదు. ఓపెనింగ్‌ సీన్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లో చేశారు. మేం వెళ్లినా కూడా అక్కడ ఎప్పుడూ చూడలేదు. డైరెక్టర్‌ శశి, అడివిశేష్‌, అబ్బూరి రవి కలిసి సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. మధుశాలిని యాక్షన్‌ సీక్వెన్స్‌ సమయంలో వచ్చే గన్‌షాట్‌ ఎంత హీరోయిక్‌గా ఉందో అనిపించింది. అలాగే టెర్రరిస్ట్‌ క్యారెక్టర్‌ చేసే ఫైట్‌.. హీరోయిక్‌గా ఉంది. మేము పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి సీక్వెన్స్‌లు చేస్తే వీళ్లు మాత్రం ఇంటెలిజెన్స్‌తో సింపుల్‌గా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేసేశారు. అందుకే నేను చెబుతున్నది.. ఇదే తెలుగు సినిమా ఫ్యూచర్‌. నాకు ఎవరైనా ఇలాంటి సినిమా చేస్తారా? అని ఎదరుచూశాను. కానీ ఎవరూ ఎదురుకాలేదు. నేను క్రియేటర్‌ని కాను. అందుకనే డైరెక్టర్స్‌, రైటర్స్‌పైన ఆధారపడతాను. నేను జెలస్‌గా, ఎగ్జయిటెడ్‌గా, హ్యాఫీగా ఫీలవుతున్నాను. ఈ సంవత్సరం తిప్పి తిప్పి మూడు సినిమాలు మాత్రమే ఆడాయి. రంగస్థలం, మహానటి తర్వాత గూఢచారి మాత్రమే ఆడింది. డబ్బులు చేసుకున్న మూడు సినిమాలు కూడా ఇవే. అలాగని ఇతర సినిమాలను నేను తక్కువ చేయడం లేదు. మీకున్న బడ్జెట్‌లో.. లిమిటేషన్స్‌లో.. వాటన్నింటినీ ఓవర్‌షాడో చేశారు. సినిమా ఎంత కలెక్ట్‌ చేసిందనేది ముఖ్యం కాదు. కానీ థర్డ్‌ ప్రాసెస్‌ ఎంతలా చేంజ్‌ చేస్తుందనేది నాకు తెలియదు .. కానీ నిర్మాతలు సినిమాను ముందుగానే ఇంతగా నమ్మారా? అనిపిస్తుంది. ఓ స్పై మూవీ తెలుగులో ఎలా ఆడుతుంది? వీళ్లు ఏమీ తీస్తారు? మణిరత్నం బాంబే సినిమా కంటే ఏం చేస్తారు? అనిపించింది. నేటి ట్రెండ్‌కు తగినట్లు కమర్షియల్‌ వేల్యూస్‌, సెన్సిబిలిటీస్‌ మిక్స్‌ చేసి అవుట్‌స్టాండింగ్‌ మూవీ చేశారు. శ్రీచరణ్‌ చిన్న బీప్‌తో స్టార్ట్‌ అయిన మ్యూజిక్‌ సినిమా అంతా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ట్యూన్‌ నన్ను హాంట్‌ చేస్తుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చాలా కొత్తగా ఉంది. అబ్బూరి రవి నాకు కూడా చాలా సినిమాలకు డైలాగ్స్‌ రాశారు. నా ఊపిరి, డాన్‌ సినిమాలకు అబ్బూరి రవి డైలాగ్స్‌ రాశారు. అయితే నా సినిమాల కంటే ఈ సినిమాకు చాలా చక్కగా రాశాడు. ఓ నెల ముందు రవి నన్ను కలిసినప్పుడు గూఢచారి చాలా బావుందని చెప్పాడు. సినిమా గురించి చాలా ఎమోషన్స్‌ ఉన్నాయి. శోభిత చాలా హాట్‌గా కనపడింది. చాలా ఎట్రాక్టివ్‌గా అనిపించింది. తను క్యారెక్టర్‌ను ఎంత చక్కగా దాచి..వేరే యాంగిల్స్‌లో చూపించారు. ట్విస్ట్‌ నాకు బిగ్గెస్ట్‌ షాక్‌. నేను ఇన్‌వాల్వ్‌ అయ్యాను. నవ్వాను.. ఏడ్చాను. సుప్రియను ఇన్ని రోజులు పట్టించుకోలేదు. తను చాలా చక్కగా నటించింది. తను రా ఆఫీసర్‌ రోల్‌కి చక్కగా సూట్‌ అయింది. మధుశాలిని.. తన పాత్రకు యాప్ట్‌ అయింది. ఫెంటాస్టిక్‌గా నటించింది. అడవిశేష్‌కి కంగ్రాట్స్‌. మిమ్మల్ని చూసి తెలుగు ఇండస్ట్రీ గర్వపడుతుంది. కలెక్షన్స్‌ గురించి నేను మాట్లాడటం లేదు. కొత్త దారిని చూపించిన చిత్రమిది. ఇండ్రస్టీకి 1989లో శివ వచ్చినప్పుడు దర్శకులకు, నిర్మాతలకు ఎంత ఇన్‌స్పిరేషన్‌ వచ్చిందో.. గూఢచారి కూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. యంగర్‌ జనరేషన్‌ ఇలాంటి సినిమాలనే కోరుకుంటుంది. ఎంటైర్‌ టీంకు అభినందనలు. ఈ సక్సెస్‌ ఇలాగే కంటిన్యూ కావాలి. గూఢచారి 2కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''సక్సెస్‌ నా ముఖంలోనే కనపడుతుంది'' అన్నారు.

అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ - ''సినిమా సక్సెస్‌ కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది'' అన్నారు.

వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ - ''సినిమా సక్సెస్‌పై హ్యాపీగా ఉన్నాం. మా నమ్మకాన్ని నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ శనీల్‌ డియో మాట్లాడుతూ - ''ఒక్కరి సక్సెస్‌ కాదు.. టీం అంతా కలిసి కష్టపడ్డాం. అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ సహా అందరి విజన్‌ ఈ సినిమాకు ఉపయోగపడింది'' అన్నారు.

శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ - ''ఇది గ్రేట్‌ టీమ్‌ ఎఫర్ట్‌. బ్రిలియంట్‌ టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం కలిగింది. అడివిశేష్‌కి కంగ్రాట్స్‌'' అన్నారు.

అభిషేక్‌ నామా మాట్లాడుతూ - ''ఈ సినిమాకు శేష్‌ మాత్రమే బలం. తనకే ఈ క్రెడిట్‌ అంతా దక్కుతుంది'' అన్నారు.

అడివిశేష్‌ మాట్లాడుతూ - ''నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే కారణం నా నిర్మాతలే. మా కలను.. మా సినిమాను ప్రపంచానికి చూపించిన అనీల్‌గారికి థాంక్స్‌. హీరోయిన్‌ శోభిత నటించిన తొలి తెలుగు సినిమా. అద్భుతంగా నటించింది. మధుశాలిని.. చక్కటి పెర్ఫామెన్స్‌ చేసింది. వెన్నెలకిశోర్‌.. ప్రకాశ్‌ రాజ్‌..సుప్రియ.. రాకేశ్‌.. భరద్వాజ్‌గారికి థాంక్స్‌. శనీల్‌ సినిమా చేయకుంటే.. ఇంత రిచ్‌గా వచ్చుండేది కాదు. ఎడిటర్‌ గ్యారీ.. సీజీ వర్క్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియో సి.వి.రావుగారు.. అందరికీ థాంక్స్‌. డైరెక్టర్‌ శశికి థాంక్స్‌. నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ చేసి పెట్టాడు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved