pizza
Hushaaru success meet
`హుషారు` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 December 2018
Hyderabad

బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న ప్రేక్షకులైంది. ఈ సందర్భంగా...

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''నేను ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో మాట్లాడినప్పుడు 'హుషారు' సినిమా మంచి సక్సస్‌ కావాలని కోరుకున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్‌ అయింది. విడుదలైనరోజు కంటే తరువాతి రోజు నుండి ఈ సినిమా కలక్షన్స్‌ పెరగడం సంతోషంగా అనిపించింది. ఇదంతా కేవలం ప్రేక్షకుల మౌత్‌టాక్‌తోనే జరిగింది. అలాగే ఈ సినిమా చూసిన యూత్‌ అందరూ సినిమాని సపోర్ట్‌ చేద్దాం అని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో పోస్ట్‌ చేయడం, మీడియా మంచి సపోర్ట్‌ ఇచ్చింది. వెబ్‌ సైట్స్‌ లలో పాజిటివ్‌ రివ్యూ లు కూడా పెట్టి మంచి రేటింగ్స్‌ ఇవ్వడం ద్వారా ఈసినిమా ఇంత మంచి హిట్‌ అయింది. రోజురోజుకి కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. అందరూ కొత్త నటీనటులు ,కొత్త టెక్నిషన్స్‌తో చేసినప్పటికీ సినిమా మంచి హిట్‌టాక్‌ తెచ్చుకుంది. చిన్న సినిమాలకు నావంతు సహాకారం అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సక్సస్‌మీట్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. 'హుషారు' సినిమాని సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.'' అన్నారు.

హీరో మాట్లాడుతూ - ''మా 'హుషారు' సినిమాను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్‌హిట్‌ చేసిన ప్రేక్షకులకు నా క తజ్ఞతలు. మా ఫ్రెండ్స్‌ అందరూ ఫోన్‌ చేసి విషెస్‌ తెలుపుతున్నారు. మొదటి నుండి మా టీం అందరం ఇది మా సినిమా కాదు ప్రేక్షకుల సినిమా అని చెప్పాము. అలాగే ప్రేక్షకులు ఈ సినిమాను హిట్‌ చేశారు. ఫ్రెండ్‌షిప్‌కి మంచి ఇంపార్టెన్స్‌ ఉన్న సినిమా కాబట్టి అందరూ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. మంచి సినిమాకు ప్రేక్షకుల సపోర్ట్‌ ఉంటుంది అని మరోసారి రుజువయింది'' అన్నారు.

హీరోయిన్‌ ప్రియావడ్లమాని మాట్లాడుతూ - ''మా సినిమా సక్సస్‌ అయిందన్న ఫీల్‌ వేరే విధంగా ఉంది. చాలా రోజుల కష్టం ఇవ్వాళ మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. మా సినిమా ఇంకా ప్రేక్షకులకి దగ్గరవుతుందనే నమ్మకం ఉంది. వెదర్‌ కూడా చాలా బాగుంది. మేము థియేటర్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూసి క్రేజీగా ఫీల్‌ అయ్యాము. పాప్‌కార్న్‌ సమోసాతో మా సినిమా ఇంకా బెస్ట్‌గా ఉంటుంది'' అన్నారు.

లింగా శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ - '' నేను శ్రీకర్‌ గ్రూప్స్‌, శ్రీకర్‌ సీడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను. నా స్నేహితులు లక్ష్మినారాయణ, బెక్కం వేణుగోపాల్‌ సలహా మేరకు ఈ సినిమా కథ నచ్చి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం జరిగింది. ఈ సినిమా ఇంత పెద్ద సక్సస్‌ కావడంతో 'శ్రీకర్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే బ్యానర్‌ను నెలకొల్పుతున్నాం. త్వరలోనే ఈ బ్యానర్‌లో మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాం. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్‌ కొత్తవారిలా కాకుండా ఎక్స్‌పీీరియన్స్డ్‌ ఆర్టిస్టుల్లా నటించడం జరిగింది. డైరెక్టర్‌ గారు కూడా ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఇస్తూ స్క్రీన్‌ ప్లే అద్భుతంగా నడిపారు. మీ అందరి సహకారంతో ఈ సినిమా ఇంకా మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరోయిన్‌ దక్ష నగార్కర్‌ మాట్లాడుతూ - ''మా సినిమాను ప్రారంభం నుండి సపోర్ట్‌ చేసిన 'దిల్‌రాజు' గారికి నా క తజ్ఞతలు. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన మా డైరెక్టర్‌ గారికి ప్రొడ్యూసర్‌ గారికి నా హ దయ పూర్వక నమస్కారాలు. మా మూవీని హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

హీరో తేజస్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా అంతాకొత్త వారితో తీయడం, ఇంత పెద్దహిట్‌ కావడం అనేది మాటీం అందరి కల. ఇది సాకారమైందుకు ప్రేక్షకులందరికీ థాంక్స్‌. మీ అందరి సపోర్ట్‌ తోనే మా సినిమా ఇంత హిట్‌ అయింది మాకు మంచి సపోర్ట్‌ అందించిన ఆడియన్సుకి, ఫ్రెండ్స్‌కి, మీడియాకి నాక తజ్ఞతలు. సినిమాని థియేటర్‌ లలో మాత్రమే చూడండి ''అన్నారు.

నైజాం డిస్ట్రిబ్యూటర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - '' హుషారు' సినిమాను నైజాంలో విడుదల చేసింనందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమా చిన్న చినుకులా మొదలయ్యి ప్రేక్షకులఆదరణతో తుఫాన్‌లా హైదరాబాద్‌ అంతా విస్తరించింది. రిలీజ్‌ అయినా అన్ని థియేటర్‌లో క్రేజీ రెస్పాన్స్‌ ఉంది. ఈ సినిమా హిట్‌ నుండి సూపర్‌ హిట్‌ రేంజ్‌కు వెళ్తుంది అనే నమ్మకం ఉంది'' అన్నారు.

హీరో తేజ్‌ కొర్రపాటి మాట్లాడుతూ - ''మా సినిమాకు మంచి సహాకారం అందించిన 'దిల్‌ రాజు' గారికి థాంక్స్‌. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు మా టీం అందరి తరపున హ దయ పూర్వక నమస్కారాలు'' అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved