pizza
Janatha Garage Success meet
`జ‌న‌తాగ్యారేజ్` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 September 2016
Hyderaba
d

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సమంత, కాజల్‌ హీరో హీరోయిన్లుగా, మోహన్‌లాల్‌ పధ్రాన పాత్రలో నటించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సందర్భంగా శనివారం చిత్రయూనిట్‌ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు....

యలమంచిలి రవిశంకర్‌ మాట్లాడుతూ - ''సినిమా బ్లాక్‌బస్టర్‌ అయ్యిందని అన్నిచోట్ల నుండి ట్రెమెండస్‌ రెస్పాన్స్‌ వస్తుంది. మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. తొలిరోజున చాలా చోట్ల రికార్డ్‌ కలెక్షన్స్‌ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ కాల్‌ చేసి సినిమా బావుందని అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ - '''జనతాగ్యారేజ్‌' సెప్టెంబర్‌ 1న విడుదలైంది. ప్రేక్షకుల నుండే కాదు, ఇండస్ట్రీ నుండి కూడా సినిమా బెస్ట్‌ అని కాంప్లిమెంట్స్‌ ఇవ్వడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. నా కెరీర్‌లోనే బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అందుకున్నాను. నా జీవితంలో విలువైన, సంతోషకరమైన రోజు. ఇంత భారీ అంచనాలు నడుమ విడుదలైన సినిమాకు అన్నిచోట్ల నుండి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్‌ ఫోన్‌ చేసి ఫస్ట్‌ వీక్‌లోనే సేఫ్‌ అయిపోతామని చెప్పారు. శ్రీమంతుడు కంటే బెటర్‌ సినిమా అని చెప్పడం ఆనందాన్నిస్తుంది. చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమాలే తీయ్‌ అని చాలా మంది నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఇంత పెద్ద రెస్పాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. మైత్రీలో సెకండ్‌ బ్లాక్‌బస్టర్‌. నాకు హ్యాట్రిక్‌ మూవీ అయ్యింది. ఇది ఇంకా మంచి సినిమాలు తీయాలని నా బాధ్యతను మరింత పెంచింది. చాలా విలువైన సక్సెస్‌. అనుకున్నది అనుకున్నట్లు తీశాం. కేరళ నుండి మోహన్‌లాల్‌గారు ఫోన్‌ చేసి, నేను చేసింది డబ్బింగ్‌ మూవీ అయినా నా బ్లాక్‌బస్టర్‌ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్‌ వచ్చిందన్నారు. నాపై నమ్మకంతో ఈ సినిమా చేసిన మోహన్‌లాల్‌గారికి, నా టీంకు థాంక్స్‌. ఇద్దరు స్టార్‌ హీరోలను హ్యండిల్‌ చేయగలమా అనుకున్నాం కానీ ఇప్పుడు థియేటర్స్‌ నుండి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇద్దరినీ ఒక్క ఫ్రేమ్‌ కూడా మిస్‌ కావడం ఎవరూ ఇష్టం లేదు. ఇలాంటి సినిమా చేసినందుకు హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి సినిమా ఇంకా హైట్స్‌కు రీచ్‌ అవుతుంది. సినిమాలో కంటెంట్‌ బావుందని అందరూ అంటున్నారు. సినిమా చూసిన పెద్దవారైతే నాకు ఫోన్‌ చేసి ఈ మధ్య ఇలాంటి సినిమా చూడలేదంటూ ఫోన్‌ చేస్తున్నారు. ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. ఫ్యాన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రతిసీన్‌ బ్యూటీఫుల్‌గా పండింది. తిరుగారు అద్భుతమైన టెక్నిషియన్‌. సినిమాలో ఎమోషన్స్‌ను అద్భుతంగా క్యారీ చేశారు. సమంత, నిత్య గ్లామరస్‌ హీరోయిన్సే కాదు, మంచి పెర్‌ఫార్మర్స్‌. ఎన్టీఆర్‌, సమంత మధ్య వచ్చే బ్రేకప్‌ సీన్‌కు ఆడియెన్స్‌ నుండి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. మహిళలు, యూత్‌ అందరూ ఇలాంటి సినిమాయే మాకు కావాలి అని ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఎన్‌విరాన్‌మెంటల్‌ స్టూడెంట్‌గా అద్భుతంగా నటించారు'' అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved