pizza
Janatha Garage Success meet
`జనతాగ్యారేజ్` సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 August 2016
Hyderaba
d

ఎన్టీఆర్‌సమంతనిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌యలమంచిలి రవిశంకర్‌సి.వి.మోహన్‌ నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్‌ హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌కల్యాణ్‌రామ్‌బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌దిల్ రాజు, డి.వి.వి.దానయ్యసుకుమార్‌సాయికుమార్‌సురేష్‌దర్శకుడు కొరటాల శివ, చిత్ర నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''ఆడియో ఫంక్షన్‌లో నాకు ఒక వెలుగు కనిపిస్తుందని చెప్పాను. ఆ వెలుగు జనతాగ్యారేజ్‌ అని తెలుస్తుంది. సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలైనప్పుడు చాలా రకాలుగు రిపోర్ట్స్‌ వచ్చినప్పుడు కాసేపు ఏం మాట్లాడాలోఎలా రియాక్ట్‌ కావాలో తెలియలేదు. శివపైఈ కథపై పెట్టుకున్న నమ్మకంఅభిమానులకు ఇచ్చిన మాట తప్పు కాకూడదే అని లోపల చాలా బాధ పడిపోయాను. కానీ అదే రోజుల అభిమానుల నుండి సాయంత్రం రిపోర్ట్స్‌ వింటుంటే ఈ మాటలు వినడానికి నాకు ఇన్నేళ్ళు పట్టిందా,ఇంతకంటే నాకేం అవసరం లేదనిపించింది. జనతాగ్యారేజ్‌ వల్ల అభిమానుల ముఖాల్లో సంతోషంనా తల్లిదండ్రుల పుట్టినరోజున మంచి గిఫ్ట్‌ ఇచ్చినవాడినయ్యాను. నేను,కల్యాణ్‌ రామ్‌ అన్నయ్య చాలా బాధగా ఉందని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇలాంటి విజయం కోసమే నేను ఇనేళ్ళు ఆగాను. నా వెనుక నా అభిమానులు ఆగారు. అభిమానులు ముందు తలెత్తుకునేలా చేసిన జనతాగ్యారేజ్‌ సినిమాను ఇచ్చిన కొరటాలశివగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నాపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమాతో నిజం చేశారు. నా గుండెలోఅభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయమిది. అలాంటి విజయాన్ని అందించిన శివకు థాంక్యూ వెరీ మచ్‌. ఒకవైపు ఆనందంతో వచ్చే ఏడుపును ఆపుకుంటున్నాను. అభిమానులను సంతోషపరచడానికే నేను ఇక్కడ ఉన్నాను. జనతాగ్యారేజ్‌ విజయం కొత్త ఊపిరినికొత్త ఆనందాన్నిచ్చింది. బ్రతికినంత కాలం అభిమానుల ప్రేమనుఅప్యాయతను పొందాలనే కోరుకుంటున్నాను. ఇంత పెద్ద విజయంలో భాగమైన నటీనటులకుటెక్నిషియన్స్‌ థాంక్స్‌. జనతాగ్యారేజ్‌ అని ఏరోజైతే టైటిల్‌ పెట్టుకున్నామో ఆరోజు ప్రజలు మమ్మల్మి గుండెల్లో పెట్టుకుని తలెత్తుకునేలా చేశారు'' అన్నారు.

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - ''గత మూడేళ్ళుగా ప్రతిరోజుప్రతిసారి నేనుతమ్ముడు గుబగుయ్‌ మనేలా ఎప్పుడు కొడతాం అని అనుకునేవాళ్ళం. కొడితే ఎలా ఉంటుందో మీరు చూపించారు. మా నాన్నగారి షష్టి పూర్తికి అభిమానులు మాకిచ్చిన గిఫ్ట్‌ ఇది. మా తమ్ముడు ఆకలి..మా నందమూరి అభిమానుల ఆకలిని ఇంత గొప్ప సక్సెస్‌తో తీర్చేసిన కొరటాలశివగారికిమైత్రీ మూవీ మేకర్స్‌కి థాంక్స్‌'' అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ అంటనే నాకు సపరేట్‌ ఎనర్జీ. మోహన్‌లాల్‌సురేష్‌సాయికుమార్‌సమంతనిత్యామీనన్‌దేవిశ్రీ ప్రసాద్‌ ఇలా అందరి సపోర్ట్‌తో పాటు ఈ సినిమాను తమదిగా భావించిన అభిమానుల కారణంగానే సినిమా పెద్ద సక్సెస్‌ అయ్యింది. తారక్‌కి సక్సెస్‌ కొత్తకాదు. అయినా ఈ సక్సెస్‌లో నేను కూడా భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. టెంపర్‌ నుండి రూట్‌ మార్చి కొత్తగా చేస్తున్నారు. అలా చేయడం ఆడియెన్స్‌కు నచ్చిందిఆదరిస్తున్నారు. అభిమానులు ఆదరణ ఇలాగే కొనసాగితే టెంపర్‌నాన్నకు ప్రేమతోజనతాగ్యారేజ్‌ వంటి సినిమాలు ఎన్నింటినో చేస్తారు. అలాగే ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన ఆడియెన్స్‌కు పెద్ద థాంక్స్‌. జయహో జనతా''అన్నారు.

ఎర్నేని నవీన్‌ మాట్లాడుతూ - ''ఇలాంటి మంచి పెద్ద హిట్‌ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌గారికిదర్శకుడు కొరటాల శివగారికి థాంక్స్‌. సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు స్పెషల్‌ థాంక్స్‌. ఎన్టీఆర్‌గారుకొరటాల శివగారు మా బ్యానర్‌లో ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం'' అన్నారు.  

సుకుమార్‌ మాట్లాడుతూ - ''సినిమా చూసి షాకయ్యాను. సినిమా బావుంది. తారక్‌కు ఫోన్‌ చేసి బావుందని చెప్పాను కానీఎక్కడో డౌట్‌ ఉండేది. అయితే సినిమా విడుదలైన తర్వాత తారక్‌కు ఇలాంటి సినిమా అవకాశం వస్తే ఎలా కొడతాడని ప్రూవ్‌ చేసిన చిత్రమిది. సినిమా తీయడానికి కామెడి అక్కర్లేదు అని నమ్మే వాళ్లందరికీ కొరటాల శివ దారి చూపించాడు. సినిమా చరిత్రలో శివ ముందుశివ తర్వాత అని ఎలా చెబుతారోఇకపై కమర్షియల్‌ సినిమా విషయానికి వస్తేకొరటాల శివకు ముందుకొరటాల శివకు తర్వాత అని చెబుతారు. అందులో నో డౌట్‌. నన్ను అంత బాగా ఇన్‌స్పైర్‌ చేశారు. నిర్మాతలు మరోసారి పెద్ద సక్సెస్‌ను అందుకున్నారు. ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన నిర్మాతలకు కంగ్రాట్స్‌'' అన్నారు.

రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ - ''ఒక మంచి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి జనతాగ్యారేజ్‌ సక్సెస్‌ ఉదాహరణ. మనందరికీ తెలిసిన విషయాలే అయినా కొరటాల శివ నిజాయితే చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన పెద్ద థాంక్స్‌''అన్నారు.

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''సినిమాలో నటించిన అందరికీ చాలా మంచి పేరు వస్తుంది. సినిమా హిట్‌ అయినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - ''జనతాగ్యారేజ్‌తో డైరెక్టర్‌ మూడో హ్యాట్రిక్‌ కొట్టారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌కు మరో పెద్ద హిట్‌ ఇది. ఎన్టీఆర్‌గారికి హ్యాట్రిక్‌ విజయమిది'' అన్నారు.

సురేష్‌ మాట్లాడుతూ - ''ఈ సక్సెస్‌ క్రెడిట్‌ కొరటాలగారికే చెందుతుంది. నా క్యారెక్టర్‌ అంత బాగా వచ్చిందంటే ఆయనే కారణం. తారక్‌ మంచి కోస్టార్‌. ఇలాంటి సక్సెస్‌లు తనకు మరిన్ని మంచి సక్సెస్‌లు రావాలి'' అన్నారు.

సాయికుమార్‌ మాట్లాడుతూ - ''జనతాగ్యారేజ్‌ ఇచ్చట అన్ని రికార్డులు చేయబడును. నా మొదటి సినిమా స్వర్గీయ ఎన్టీఆర్‌తో యాక్ట్‌ చేశాను. తర్వాత బాలయ్యతో రౌడీ ఇన్సెపెక్టర్‌ చేశాను. అలాగే కల్యాణ్‌రామ్‌గారితో పటాస్‌ చేశాను. ఇప్పుడు ఎన్టీఆర్‌తో జనతాగ్యారేజ్‌ చేయడం ఆనందంగా ఉంది. పోలీస్‌స్టోరీకి నాకు పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అని ఎంత పేరు వచ్చిందోఈ సినిమాకు డిగ్నిఫైడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అని పేరు వచ్చింది. నిర్మాతలకు అభినందనలు. సినిమాను సక్సెస్‌ చేసిన అభిమానులకు ప్రణామం''అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, చిత్రయూనిట్ సభ్యులకు డిస్క్ లను అందజేశారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved