pizza
Jenda Pai Kapiraju success meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 March 2015
Hyderabad

జెండాపై కపిరాజు సక్సెస్ మీట్

యువ హీరో నాని ద్విపాత్రాభినయంతో అమలా పాల్‌, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా వాసన్స్‌ విజువల్‌ వెంచర్స్‌ సమర్పణలో మల్టీ డైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సముద్రఖని దర్శకత్వంలో రజిత్‌ పార్థసారధి, కె.ఎస్‌.శ్రీనివాసన్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. ఉగాది కానుకగా మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌ టాక్‌ రావడంతో సోమవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర యూనిట్‌ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మల్టీడైమెన్షన్‌ వాసు, వాసన్‌ విజువల్‌ వెంచర్స్‌ శివ, హీరో నాని, నటుడు శివబాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వాసు మాట్లాడుతూ ... ఉగాది కానుకగా 440 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ చాలా సహకరించారు. కోసం నాని వేరే ఏ సినిమాను ఒప్పుకోకుండా కేవలం ఈ సినిమా మీదే కాన్సన్‌ ట్రేట్‌ చేసాడు. సాయికార్తిక్‌ అధ్బుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. నాని నటించిన మాస్‌ సినిమాలలో హైయెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చిన సినిమా ఇదే. సినిమా కలెక్షన్స్‌ కూడా చాలా బావున్నాయి అన్నారు. నిర్మాత శివ మాట్లాడుతూ ... తమిళంలో 30 కి పైగా సినిమాలను చేసిన మా సంస్థ తెలుగులో మొదటి సారిగా ‘జెండాపై కపిరాజు’ సినిమాతో అడుగుపెట్టాం. ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అన్నారు. హీరో నాని మాట్లాడుతు... నా రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నాయని చాలా టెన్షన్‌ పడ్డాను. కాని ఈరోజు సినిమాలకు వచ్చిన స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. ‘జెండాపై కపిరాజు’ అన్ని ఎలిమెంట్స్‌ కలగలిపిన కమర్షియల్‌ సినిమా. సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్‌ చేసి బాగా నటించావు అని చెప్తుంటే నా ఆనందానికి అవధుల్లేవు. మాస్‌ హీరోగా కూడా నన్ను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. కలక్షన్స్ పరంగా చాలా బాగున్నాయని రిపోర్ట్ వస్తోంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు. ఈ కార్యక్రమం లో శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved