pizza
Malupu success meet
`మ‌లుపు` సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 February 2016
Hyderabad

ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని జంటగా న‌టించిన సినిమా `మ‌లుపు`. ఆదర్శ చిత్రాలయ బ్యానర్ పై రూపొందింది. సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మించారు. ఈచిత్రం ఫిభ్రవరి 19న విడుదలైంది. మంగళవారం ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రవిరాజా పనిశెట్టి, సత్యప్రభాస్ పినిశెట్టి, ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని, రిచా పల్లోడ్, హరీష్ ఉత్తమన్, శ్రవణ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.....

రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ ‘’’సత్య, ఆది బాగా సక్సెస్ అయ్యారు. ఈ సినిమాను నేను లాభాలు రావాలని నిర్మించలేదు. ఏ ఉద్దేశ్యంతో అయితే సినిమా చేశానో అది ఈరోజు నేరవేరింది. సత్య ప్రభాస్ కు మంచి పేరొచ్చింది. ఆది పినిశెట్టి వాడి వయసుకు తగిన పాత్ర చేసిన సినిమా ఇది. సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. సినిమాను మరింత సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ ``వైశాలి, గుండెల్లోగోదారి, మృగం సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాను. మలుపు సినిమా విషయానికి వస్తే నా రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో దానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్ చేసిన సినిమా ఇది. కొత్తగా ట్రై చేశామని చెప్పి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది. ఆడియెన్స్ కొత్తదనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గెలుపు కేవలం మలుపు కోసం కాదు, కొత్త ప్రయత్నాన్ని చేసే ప్రతి ఒక్కరిది. అందరికీ థాంక్స్’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు సత్య ప్రభాస్ పినిశెట్టి మాట్లాడుతూ ``మలుపును గెలిపించినందుకు సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థాంక్స్. కంటెంట్ ను నమ్ముకుని చేసిన సినిమా. ఆడియెన్సే కాదు, క్రిటిక్స్ కూడా సినిమాను అభినందించారు. మంచి సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారని నమ్మకంతో చేసిన మా ప్రయత్నాన్ని నిలబెట్టారు. ఈ సక్సెస్ తో మరిన్ని కొత్త ప్రయత్నాలు చేయవచ్చునని కాన్ఫిడెంట్, ధైర్యం వచ్చింది. ఆది 100 పర్సెంట్ తన పాత్రకు న్యాయం చేశాడు. అలాగే నాన్నగారు నా సినిమాకు ఏం కావాలో అదిచ్చి ఎంకరేజ్ చేశారు. శ్రవణ్, హరీష్ యాక్టర్స్ లా కాకుండా నా విజన్ కు తగిన విధంగా క్యారెక్టర్ ను ఓన్ చేసుకుని చేశారు’ అన్నారు.

Nikki Galrani Glam gallery from the event

 

నిక్కి మాట్లాడుతూ ``ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. సినిమాను సక్సెస్ చేసిన వారందరికీ థాంక్స్. సినిమా చూసే ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనుకుని చేసిన మూవీ. ఈరోజు అది పూర్తయినట్టు అనిపించింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

రిచా పల్లోడ్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యపీగా ఉంది. సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్ మాట్లాడుతూ ‘’ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన సత్యప్రభాస్, ఆది పినిశెట్టిలకు థాంక్స్. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.

శ్రవణ్ మాట్టాడుతూ ‘’సత్యప్రభాస్ గొప్ప దర్శకుడు. డిటెయిలింగ్ అనే విషయాన్ని తన దగ్గరే నేర్చుకున్నాను. రవిరాజా పినిశెట్టిగారి దర్శకత్వంలో సినిమా చేయలేకపోయానని అనుకున్నాను కానీ ఆయన ప్రొడక్షన్ లో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

హరీష్ ఉత్తమన్ మాట్లాడుతూ ‘’ఈ మధ్య నేను నటించిన చిత్రాలన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే మలుపు చిత్రం కూడా పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థాంక్స్. నేను ఎన్ని సినిమాలు చేసినా, మలుపు నాకు పర్సనల్ గా నచ్చిన సినిమా. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు టీం కంటే ఫ్యామిలీగా ఫీలై చేసిన సినిమా. నా కెరీర్ లో మరచిపోలేని చిత్రమవుతుంది’’ అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved