pizza
Oopiri Success meet
‘ఊపిరి’ సక్సెస్ మీట్‘
ou are at idlebrain.com > News > Functions
Follow Us

27 March 2016
Hyderabad

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్ లో పివిపి బ్యానర్ పై వంశీపైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించిన చిత్రం ఊపిరి. ఈ చిత్రం మార్చి 25న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో నా కంటే కార్తీ రోల్ ఎక్కువైందని కొంత మంది చెప్పారు. నేను ఇమేజ్ చూసుకుని ఈ సినిమా చేయలేదు. నా ఇమేజ్ పక్కన పెట్టి చేసిన చిత్రమిది. నాగచైతన్య సినిమ చూసి ఏడ్చాడట. మహేష్ బాబు ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడారు. అలాగే రాఘవేంద్రరావుగారు, శ్రీనువైట్ల, వినాయక్ సహా చాలా మంది ఇన్ స్పిరేషన్ ఇచ్చే సినిమా చేశామని మెచ్చుకున్నారు. దాదాపు ఇండస్ట్రీలోని అందరూ ఊపిరి చిత్రాన్ని అప్రిసియేట్ చేశారు. కొత్త తరహా చిత్రాలను ఎంకరేజ్ చేయడంలో, నిర్మించడంలో పివిపి సంస్థ ముందుంది. ఇలాంటి నిర్మాతలుంటే కొత్త చిత్రాలు వస్తాయి. గోపిసుందర్ మ్యూజిక్, వినోద్ ఫోటోగ్రఫీ ఇలా ప్రతి ఒక ఎలిమెంట్ సినిమాకు ప్లస్ అయ్యింది. అందరికీ థాంక్స్’’ అన్నారు.

కార్తీ మాట్లాడుతూ ‘’బాహుబలి తర్వాత మరో ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఊపిరి. నాకొక లైఫ్ చేంజింగ్ ఫిలిం అయ్యింది’’ అన్నారు.

ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ ‘’మా బ్యానర్ కు ల్యాండ్ మార్క్ మూవీలా ఊపిరి చిత్రం నిలిచిపోయింది’’ అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘’నాగార్జునగారు నిజమైన పాత్ బ్రేకర్. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుండి విడుదలయ్యే వరకు సినిమా క్లాసిక్ మూవీ అవుతుందని ఎక్కువగా నమ్మిన వ్యక్తి. కె.బాలచందర్ గారి సినిమా చూసినట్లు ఉందని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం కల్పించిన పివిపిగారికి, సినిమా సక్సెస్ భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved