pizza
Premam success meet
`ప్రేమ‌మ్` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 October 2016
Hyderaba
d

'Premam', directed by Chandoo Mondeti and starring Naga Chaitanya in the lead role, came as a Dasara gift from Sitara Entertainment's Suryadevara Nagavamsi. In 10 days, it has collected a share of Rs. 21 cr.

A success meet was held in a city hotel today. The event was graced by the evergreen 'Greeku Veerudu', Akkineni Nagarjuna.

Nagarjuna said, "I am very happy that 'Premam' has become this big a success. As soon as I watched it, I knew it will be a big hit for sure. I congratulated Chandoo Mondeti immediately. While returning to home, I tweeted that I was very happy. On reading the tweet, many people asked me if I was happy because of 'Premam' or because I was going to home. I told them I was happy because I watched 'Premam'. I had tears in my eyes while watching the climax scene wherein Shruti Haasan looks at Chaitanya on eating a particular sweet. 'Premam' is a very feel-good movie. One needs a lot of guts to make a movie like this. Chandoo made the movie keeping in mind the Telugu nativity."

The proud father further said, "Many people ask me as to why 'Shiva' shouldn't be remade with Chaitu or Akhil. 'Shiva' can't be repeated. A 'Chandramukhi' can't be done as it is. Our comedy, our songs, our culture are unique. Keeping all this in mind, Chandoo retained the soul and made this remake. Several people took potshots when 'Premam' was sought to be remade. Of course, our people, too, would do that if someone were to remake a Telugu classic. But, as Chaitu said, the intention was never to better the original."

Nag was all praise for his son's acting. "My father wouldn't praise me because he felt he shouldn't do so as a father. But I would like to praise my son. Chaitanya has done a wonderful job. It was at the same age as his that I got to do 'Githanjali'. I did what I could have at that age. I think Chaitu has done his best at his age. The audience are going to watch 'Premam' on TV many times. Since Chandoo is my fan, he wrote the dialogues very well. The 'cycle chain' line has been getting a very good response. The production values are remarkable. As a line by my character goes in the last scene: What more can a father ask for except his son's success.' It's my feeling, too."

Naga Chaitanya said, "It was producer Vamsi who first told me about 'Premam'. I had watched the film and so, I gave the nod. He didn't want us to hurry up keeping a deadline in mind. It's only our conviction that the film came out very well that mattered. It takes a lot of guts to remake a classic like this. Chandoo recreated it without spoiling the soul. Chandoo has given me a big gift. Entertainment was brought out very well through Praveen, Srinivasa Reddy, Brahmaji and Narra."

The film's presenter PD Prasad said, "It was an adventure to remake 'Premam'. We have got a share of Rs. 21 cr for the first 10 days. Even in the third week, we are adding new screens. We have released it even in Kerala. It's great that the film is running to packed houses for all three shows there. Our film is running successfully in Chennai as well. We are going to add six more screens there. We thank the audience and Akkineni fans for this grand success."

Director Chandoo Mondeti said, "We thank the audience for this big hit. People are asking me if the teenage portions of Chaitanya were shot five years ago. From this, you can gauge how much he must have worked hard for the role. I feel it's the best compliment. I thank Nagarjuna garu and Venkatesh garu for acting in 'Premam'."

`ప్రేమ‌మ్` స‌క్సెస్ మీట్‌

అక్కినేని నాగచైతన్య హీరోగా న‌టించిన చిత్రం` ప్రేమ‌మ్`. అక్టోబ‌ర్ 7న విడుద‌లై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ సినిమాకు

పిడివి ప్రసాద్‌ సమర్పకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. చందు మొండేటి దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమా స‌క్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో బుధ‌వారం నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ``ప్రేమ‌మ్ చాలా పెద్ద హిట్ కావ‌డం ఆనందంగా ఉంది. ఇప్ప‌టికే నిద్ర‌లేవ‌గానే నేను `ఎవ‌రే` పాట‌ను వింటున్నా. అంత‌గా న‌చ్చింది. ఈ సినిమా టాక్ విని నేను మ‌హాబ‌లేశ్వ‌ర్ నుంచి ఫోన్ చేసి నిర్మాత‌ల‌తో మాట్లాడా. అంత‌కు ముందే నిర్మాత‌లు నాకు ఫోన్ చేసి సినిమాలో కొంచెం న‌చ్చ‌లేద‌ని రీషూట్ చేస్తున్నామ‌ని చెప్పారు. `గో ఎ హెడ్ ` అన్నాను. చైతూ కెరీర్‌లో ఇలాంటి సినిమా రావ‌డం ఆనందంగా ఉంది. మ‌ల‌యాళం సినిమా చూశాను. అక్క‌డ మూడో ల‌వ్ స్టోరీని కాస్త జాగ్ర‌త్త‌గా చూసి చేయాల‌నిపించింది. చందుతోనూ అదే విష‌యాన్ని చెప్పాను. త‌ను చాలా బాగా డీల్ చేశాడు. సినిమా చూస్తున్న‌ప్పుడు చందు నా ఫ్యాన్ అనిపించింది. కొన్ని డైలాగులు మెప్పించాయి. త‌ను క‌థ చెప్తే నేను అత‌నితో సినిమా చేస్తాను`` అని అన్నారు.

పి.డి.ప్ర‌సాద్ మాట్లాడుతూ ``మేం ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం చైతూ. ఆయ‌న ఈ సినిమాను చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. రెండు వారాల్లో రూ.21కోట్ల షేర్ చేసిందీ సినిమా. అమెరికా నుంచి అమ‌లాపురం వ‌ర‌కు స‌ర్వ‌త్రా బాగా ఆడుతోంది. మేం కేర‌ళ‌లోనూ విడుద‌ల చేశాం. అక్క‌డ రెండు వారాలు దాటి ఇంకా ఆడుతోంది. మ‌ల‌యాళం వాళ్లు కూడా చూస్తున్నారు. త‌మిళ‌నాడు, కర్ణాట‌క‌లోనూ చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. క‌ర్ణాట‌క‌లో కోటి రూపాయ‌ల షేర్ వ‌చ్చింది. చైతూ న‌టించిన `ఏమాయ చేసావె` సినిమాకు నైజాంలో నేను కూడా లాభం పొందాను. ఈ సినిమాకు కూడా మేం హ్యాపీగా ఉన్నాం. చిన‌బాబుగారు వంద‌సార్లు ర‌ష్ చూసుకుని ఈ సినిమాను చేశారు`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు చందు మొండేటి మాట్లాడుతూ ``స‌ర్వ‌త్రా పాజిటివ్ బ‌జ్ వ‌చ్చిందీ సినిమాకు. ఇందులోని ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను ఆరేడేళ్ల క్రితం చేశారా? అని అడుగుతున్నారు. సినిమా బాగా వ‌స్తేనే రిలీజ్ చేద్దామ‌ని నిర్మాత‌లు చెప్పేవారు. మా టీమ్ త‌ర‌ఫున వెంక‌టేష్‌గారికి స్పెష‌ల్ థాంక్స్ చెబుతున్నాను. నాగార్జున‌గారు, వెంకీగారు చేస్తేనే ఈ సినిమా చేస్తాన‌ని నేను ముందు నుంచీ చెప్పాను. వారిద్ద‌రూ చేఇస‌నందుకు చాలా థాంక్స్`` అని అన్నారు.

చైతు అక్కినేని మాట్లాడుతూ ``వంశీ ఈ సినిమా థాట్‌ను నా మైండ్‌లో పెట్టారు. చిన‌బాబుగారు ఫ‌స్ట్ కాపీ చూశాక హ్యాపీగా ఉంటేనే విడుద‌ల చేద్దామ‌న్నారు. అలాగే చేశారు. క్లాసిక్ మూవీని రీమేక్ చేయాలంటే గ‌ట్స్ కావాలి. అక్క‌డి సోల్‌ను ఇక్క‌డ జాగ్ర‌త్త‌గా రీప్లేస్ చేశామ‌ని న‌మ్ముతున్నాను. మామూలుగా ద‌ర్శ‌కులు `మీ కెరీర్‌లో బిగ్ హిట్ అవుతుందండీ` అని చెప్తుంటారు. కానీ చెప్ప‌కుండా చందు మంచి హిట్ ఇచ్చారు. ఈ సినిమాకు హీరోయిన్లు మెయిన్ పిల్ల‌ర్లు. తొలి గెట‌ప్ లో యంగ్ లుక్ కోసం కాసింత త‌గ్గాను. కార్టూన్ సినిమాలు చూసేవాడిని. అలాంటి పాత్ర‌ను తొలిసారి చేశాను`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌వీణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved