pizza
RX 100 success meet
`ఆర్ ఎక్స్ 100` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 July 2018
Hyderabad

KCW బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన చిత్రం `RX 100`. ఈ చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. An Incredible Love Story అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక పాత్రధారులు. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా గురువారం విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా గురువారం సాయంత్రం స‌క్సెస్‌మీట్‌ను హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం నిర్వ‌హించింది.

నిర్మాత మాట్లాడుతూ ``ఏడాది క్రితం స్క్రిప్ట్ తో సినిమా మొద‌లుపెట్టాం. ఇప్పుడు విడుద‌లై పెద్ద విజ‌యం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఉద‌యం వ‌ర్షం కురిసేస‌రికి ప్ర‌జ‌లు థియేట‌ర్‌కి వ‌స్తారో, రారో అనే భ‌యం క‌లిగింది. అయినా వ‌చ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 175, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 300 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశాం. తొలిరోజే మాకు రూ.2కోట్ల గ్రాస్ వ‌చ్చేసింది. డైర‌క్ట‌ర్‌ని న‌మ్మి సినిమా చేశాం. పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.

స్మ‌ర‌ణ్ మాట్లాడుతూ `` ఈ సినిమాకు నేనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాను. అంద‌రూ బావుందంటున్నారు`` అని చెప్పారు.

చైత‌న్ మాట్లాడుతూ ``ట్యూన్లు నేనే ఇచ్చాను. న‌న్ను న‌మ్మిన ద‌ర్శ‌కుడికి థాంక్స్`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నేను ఎనిమిది, తొమ్మిదేళ్ల క్రితం ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చాను. మా ఊరి నుంచి కూడా ఎవ‌రూ ప‌రిశ్ర‌మ‌కి రాలేదు. నాతో పాటు, మా అమ్మానాన్న‌లు కూడా ఎన్నో అవ‌మానాలు ప‌డ్డారు. కోట్లు కుమ్మ‌రించినా కొనుక్కోలేని చాలా విష‌యాల‌ను నేను మిస్ చేసుకున్నాను. అయినా ఇవాళ ఈ సినిమా విజ‌యం వాట‌న్నిటినీ మ‌ర‌పిస్తోంది. థియేట‌ర్లో చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా సినిమా చూడాలి. స‌గం యువ‌త‌కోసం, స‌గం ఫ్యామిలీ ఆడియ‌న్స్ కోసం సినిమా చేశాను. ఫ్యామిలీ ఆడియ‌న్స్ చూసిన‌ప్పుడే సినిమా నిజ‌మైన విజ‌యం సాధించినంద‌ని న‌మ్ముతాను`` అని అన్నారు.

రావు ర‌మేశ్ మాట్లాడుతూ ``స‌ర్వ‌త్రా వ‌స్తున్న ప్ర‌శంస‌లు చూసి ఎమెర్జెన్సీ మీటింగ్ పెట్టాం. ప్ర‌తి ఒక్క‌రూ బాగా చేశారు. మొద‌టి నుంచీ నాకు సినిమా మీద న‌మ్మ‌కం ఉంది.కానీ మౌత్ ప‌బ్లిసిటీతో మెల్ల‌గా ఎక్కుతుంద‌ని అనుకున్నాను. అయితే అంద‌రూ అంత‌క‌న్నా గొప్ప‌గా ఆద‌రిస్తున్నారు. కామెడీ కూడా కొత్త‌గా అనిపించింది`` అని చెప్పారు.

క‌థానాయిక మాట్లాడుతూ ``చాలా బోల్డ్ గా ధైర్యం చేసి చేశాను. అంద‌రూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

కార్తికేయ మాట్లాడుతూ ``విజ‌యాన్ని ముందే ఊహించాం. సినిమా పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.

సురేశ్ రెడ్డి మాట్లాడుతూ ``ఈ సినిమాను మాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. దేవీ 70ఎంఎం ఫుల్స్ కావ‌డం అరుదు. పెద్ద స్టార్ హీరోల సినిమాల‌కే అలాంటివి జ‌రుగుతాయి. మా సినిమాకు థియేట‌ర్ నిండ‌టం ఆనందంగా ఉంది. ఇండ‌స్ట్రీ మారుతోంది. ఇలాంటి కొత్త క‌థ‌లు ఇంకా చాలా రావాలి`` అని తెలిపారు.

కెమెరామేన్ రామిరెడ్డి మాట్లాడుతూ ``మంచి క‌థ‌ని న‌మ్మి సినిమా చేస్తే స‌క్సెస్ అవుతుంద‌ని మ‌రోసారి రుజువైంది`` అని చెప్పారు.


 

 

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved