pizza
Savitri Success meet
‘సావిత్రి’ సక్సెస్ మీట్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

04 April 2016
Hyderabad

నారా రోహిత్ హీరోగా , నందిత హీరోయిన్ గా రూపొందిన చిత్రం ‘సావిత్రి’. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. సినిమా ఏప్రిల్ 1న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సోమవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...

నారారోహిత్ మాట్లాడుతూ ‘’సోలో తర్వాత నేను చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సావిత్రి. ఈ సినిమా చేసేటప్పుడు నా కెరీర్ లో మరో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవతుందని చెప్పాను. నేను చెప్పినట్టుగానే జరిగింది. సినిమా విడుదలైన అన్నీ ఏరియాస్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. సినిమా చేసేటప్పుడు మాలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యింది. అదే సినిమా సక్సెస్ కు కారణమైంది. మంచి కథ. పవన్ సాధినేని సినిమాను చాలా ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాడు. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

Nanditha Raj Glam gallery from the event

డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ ‘’’సినిమా కథను నమ్మి, నా పై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన నారారోహిత్, నిర్మాత రాజేంద్రప్రసాద్ గారికి థాంక్స్. సినిమా విడుదలైనప్పటి నుండి పాజిటివ్ టాక్ రాబట్టుకుంది. మంచి ఓపెనింగ్స్ ను సంపాదించింది. సక్సెస్ ఫుల్ గా సినిమా రన్ అవుతుంది. సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థాంక్స్’’ అన్నారు.

నిర్మాత విబి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘’నారారోహిత్ గారు, నందిత అందరూ యాక్టింగ్, పవన్ సాధినేని డైరెక్షన్ సినిమా సక్సెస్ కు కారణం. మొదటి మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. విజయవాడలో నేను ఆడియెన్స్ మధ్య సినిమా చూశాను. మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా సక్సెస్ లో కారణమైన అందరికీ థాంక్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో నందిత, ప్రభాస్ శ్రీను, సత్యంరాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved