pizza
Speedunnodu success meet
‘స్పీడున్నోడు’ సక్సెస్ మీట్....
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 February 2016
Hyderabad

భీమ‌నేని రోషితాసాయి స‌మ‌ర్ప‌ణ‌లో గుడ్ విల్ సినిమా బ్యాన‌ర్‌పై బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `స్పీడున్నోడు`. భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో భీమ‌నేని సునీత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిభ్ర‌వ‌రి 5న సినిమా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో స‌క్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భీమ‌నేని శ్రీనివాస్ రావు, ప్ర‌కాష్ రాజ్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, వివేక్ కూచిబొట్ల‌, మ‌ధునంద‌న్‌, డిజె.వ‌సంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

భీమ‌నేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ``సినిమాను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కులు అంద‌రికీ థాంక్స్‌. మంచి టీం చేసిన కృషే ఈ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ సాధించ‌డానికి కార‌ణం. తండ్రిపాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్‌గారు చేసిన న‌ట‌న సూప‌ర్‌. ఆయ‌న‌తో సుస్వాగతంలో క‌లిసి ప‌నిచేశాను. ఆ త‌ర్వాత ఆయ‌న‌తో క‌లిసి చేస్తున్న సినిమా ఇది.యూత్‌, ఫ్యామిలీ ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఆద‌రిస్తున్నారు. ఫ్రెండ్ షిప్ ఆధారంగా చేసుకున్న మంచి పాయింట్‌పై తెర‌కెక్క‌డంతో సినిమాను అంద‌రూ బాగా ఆద‌రిస్తున్నారు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ప్ర‌కాష్ రాజ్ మాట్లాడుతూ ``ఒక మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన భీమ‌నేని శ్రీనివాస్‌గారికి థాంక్స్‌. మొమ‌ర‌బుల్ రోల్స్ ఇస్తున్నారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ విష‌యానికి వ‌స్తే చాలా మెచ్చూర్డ్‌గా న‌టించాడు. ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. యూత్, ఫ్యామిలీ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. సినిమాను స‌క్సెస్ చేసిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ``సినిమా కోసం ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ హార్ట్ అండ్ సోల్ పెట్టి వ‌ర్క్ చేశారు. ఈ స‌క్సెస్ మంచి టీం ఎఫ‌ర్ట్‌. అల్లుడు శీను త‌ర్వాత గ్యాప్ వ‌చ్చినా మంచి కలెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. బాగా చేశాన‌ని అంద‌రూ అంటున్నారు. గ్రేట్ అచీవ్‌మెంట్‌లా అనిపిస్తుంది. ఇంత మంచి స‌క్సెస్‌ను అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు రుణ‌ప‌డి ఉన్నాను`` అన్నారు.

ప్ర‌కాష్ రాజ్, రావు ర‌మేష్‌, అలీ, పోసాని, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, మ‌ధునంద‌న్‌, చైత‌న్య కృష్ణ‌, క‌బీర్, స‌త్య అక్క‌ల‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, ర‌మ‌ప్ర‌భ, ప్ర‌గ‌తి త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి మెయిన్‌స్టోరీః ఎస్‌.ఆర్‌.ప్ర‌భాక‌ర‌న్‌, డైలాగ్స్ః ప్ర‌వీణ్ వ‌ర్మ‌, భీమ‌నేని శ్రీనివాస‌రావు, ఆర్ట్ః కిర‌ణ్‌కుమార్ మ‌న్నె, ఫైట్స్ః ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్ః గౌతంరాజు, మ్యూజిక్ః డిజె.వ‌సంత్‌, సినిమాటోగ్ర‌ఫీః విజ‌య్ ఉల‌గ‌నాథ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వివేక్ కూచిబొట్ల‌, నిర్మాతః భీమ‌నేని సునీత‌, స్టోరీ డెవ‌ల‌ప్‌మెంట్‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వంః భీమ‌నేని శ్రీనివాస్ రావు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved